Wednesday, August 8, 2012
ప్రియా అందమైన పాదాలు..చేతితో తీసుకొని ముద్దాడిన క్షనం
ప్రియా అందమైన పాదాలు..
నా మనసులో మువ్వలు మ్రోగిన గంటలు
గుండెళ్ళో గుబిలి రేపుతుండగా.
చిలిపి ఆలోచనలు
ప్రియా అందమైన పాదాలు..చేతితో తీసుకొని ముద్దాడిన క్షనం
మళ్ళీరాని ఆక్షనం మదురాను బూతిగా మిగిలి పోయింది
ఎందుకో కలవరింత..గుర్తుకొచ్చిన జ్ఞాపకం
జల జలా రాలుతున్న కన్నీరు.
ఆపేందుకు చేసిన విఫల ప్రయత్నం..కాని
మాటలు మౌనం దాల్చినవేల..మనసు మూగరోదన
నీకు చేరిందా ప్రియా.. చేరిన ఆ భావలను
నీ అందమైన పాదాలతో తొక్కి విసిరేశావుగా ప్రియా
అయినా నీమీద కోపంలేదు.
నాభావాలను నీ పాదలు తాకాయని
సంతోష పడుతున్నాను తెల్సా
అల్పసంతోషిని..ప్రియా నిజంగా నేను
నాబావాలను నీవు కాలితో తన్నినా..
అప్పుడు నీకాలి అందెయల సవ్వడి
విని ..అవి నావళ్ళనే మ్రోగాయని
ఆనంద పడిపోతున్నా తెల్సా ప్రియా ..
ప్రియా నీవు నీ అందమైన పాదాలతో
గుండెల మీద తన్ని ఉంటే ఆశబ్దం ఇంకా బాగుంటుందని
నా గుండెకు ఆ అధృష్టం లేదని
నిరాశ పడుతున్నా ప్రియా..
Labels:
కవితలు