ప్రియా నీ జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుకుపోయి
నీ ఆలోచనల ఊబి నుండి బయటకు రాలేక ఊపిరాడక అందులోనే ఉండలేక
తప్పిపోయి తీరాన ఎగిరిపడిన చాప పిల్లలా గిలా గిలా కొట్టుకుంటున్నా ప్రియా
ప్రియా నీ హృదయ సముద్రాన్ని చేరుకోలేక ..
జ్ఞాపకమై నను వేదిస్తుంటే కన్నీటితో మనసును ఓదార్చుతున్నా
కాని కార్చి కార్చి అలిసిపోయిన ఆ కన్నీటికి ఓదార్పు ఎవరు
గుండెల్లో గుడి కట్టుకున్న నీ రూపమా లేక
ఆ గుండెని చీల్చే నీ ఆలోచనలా ప్రియా?