ప్రియా తీయని మాటలు లేవు
మూగ బాసలు లేవు
ప్రియా చిలిపి చేష్టలు లేవు
ఆశలు లేవు కలిసి కన్న అందమైన కలలు లేవు
మరి ఎదో జ్ఞాపకం వెంటాడి వేదిస్తూ నన్ను నిలువునా దహించివేస్తుంటే
ప్రియా కన్నీరు కూడా ఆవిరైపోతుంది ఏమిలేని ఆ జ్ఞాపకాల సెగలో .నీ ఆలోచలు నా గుండెల్లో అగ్ని గుండాన్ని మండిస్తుంటే
ప్రియా కన్నుల్లో కారే కన్నీరు ఆ అగ్నికి ఆజ్యం పోస్తుంది
ఆ అగ్నిలో దహించుకు పోయేది నేనే కాని
ప్రియా నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు