Wednesday, August 22, 2012
ప్రియా పగిలిన జ్ఞాపకాలు అన్ని ఒక్కటిగా చేయాలనే విఫల ప్రయత్నం
ఊహల రెక్కల ప్రేమ విహంగనం
మది తనువంతా పులకిస్తున్న వేళ
నేనున్నా అంటూ పకులరించి ప్రేమకురిపించి
అదే జీవతం అన్ని క్షనాన..హృదయాన్ని విసిరి కొట్టి
మనసు సముద్రపు అలల్లా కొట్టుకుంటున్న సమయాన
తానేవచ్చి పలుకరిపులతో పులకరించజేసి
కొత్త ఆశలు మళ్ళీ చిగురింపజేజి
జ్ఞాపకాల నీడలో సేద తీరుతున్న సమయాన..?
ఎవరి కోసమో నా తీయ్యని జ్ఞాపకాలు ..
భళ్ళుపగులగొట్టి నా జ్ఞాపకాల జాబిల్లి..
పగిలిన జ్ఞాపకాలు ఏరుకుంటూ నేను.
ఎక్కడ చిన్న అవకాశం దొరికినా..
జ్ణాపకాలను పగల గొడుతున్న జాబిల్లి..
పిచ్చివాడిలా ఆత్రంగా జ్ఞాపకాలను ఏరుకొంటూ నేను
పగిలిన ఆజ్ఞాపకాల ముక్కళ్ళో అన్నీ పేర్చి
గుండేళ్ళో జ్ఞాపకాలున్నాయేమో అని
అవికూడా పగులకొట్టాలని చూస్తున్న జాబిల్లి
హృదయంలో కి చేతులు పెట్టి మరీ వెరుకుతోంది
ఒక్కటిగా చేయాలనే నా తపన నెరవేరేనా ప్రియా..
కనికరం లేని జాబిల్లి..కన్నీరు పెట్టిస్తూ
ఆకన్నీటిని చూస్తూ ఆనందిస్తోంది ..
పగిలిన జ్ఞాపకాలు అన్ని ఒక్కటిగా చేయాలనే
విఫల ప్రయత్నంలో నేను ఎంతకాలమిలా ప్రియా..
నాలో ఉన్న నీజ్ఞాపకాలను పగులగొట్టి
నన్నేడిపించి నీవేం సాదించావు బుజ్జీ..?
Labels:
కవితలు