Thursday, August 23, 2012
ప్రియా నీవు నామనసులో బందీ అయిపోయావు
ప్రియా ఎంత నిశ్శబ్దంగా
నా జీవితంలోకి వచ్చావో
అంతే నిశ్శబ్దంగా వెలుతున్నావు
అడక్కుండానే వచ్చావు..
భాదల్లో ఊడడించావు..
బందాన్ని ఎర్పరిచావు..
ప్రియా నీవు నామనసులో బందీ అయిపోయావు
వస్తూ వస్తూ నే బోలెడు వసంతాన్ని
బతుకంతా వర్షించి నన్ను నీవాడిగా మార్చావు ప్రియా
ప్రియా ప్రతిక్షనం నీ ఆలోచనలతో పిచ్చివాడిని చేస్తున్నావు..
నీవు మిగిల్చిన జ్ఞాపకాల పూదోటలో
ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు
ఎన్నో జ్ఞాపకాలు గుండెల్లో పదిలపర్చావు
నిజానికవి జ్ఞాపకాలు కాదు
గుండెళ్ళో మ్రోగుగున్న నీ అందెల రవళుళు ప్రియా
ఒకప్పటి మాటల ప్రావాహం ఆగిపోయిందేం ప్రియా
నావల్ల తప్పుజరిగితే మనస్సులో పెట్టుకొని ఊరడిస్తావని తలచా
కాని ఇలా అకారణంగా దూరం అవుతావని ఊహించలేదు ప్రియా
ఏది అబద్దమో ఏది నిజమో తెల్సుకొలేక పిచ్చాడిలా తచ్చాడుతున్నా ప్రియా
కనికరించి కాస్తనీ తీయ్యని మాటలతో సేద తీర్చవా ప్రియా
మాటలన్నీ మూటలు గా పేర్చా ఏకాంతంలో కలుస్తావన్నవుగా
ఎప్పుడు వస్తావు ప్రియా నాలో వసంతాన్ని ఎప్పుడు నింపుతావు ప్రియా
Labels:
కవితలు