జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక రాసాను నేను నావ్యధనంతా
మేఘాలతోటీ నా నివేదనా లేఖగా నీకంపినాను రావా దేవీ
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే