ప్రియా మనసుకేమో.. మరుపే లేదు
కంటికేమో కునుకే రాదు
ప్రియా మనసుకేమో.. మరుపే లేదు
ఎక్కడున్నావంటూ నిన్నడుగుతోంది మనస్సు ప్రియా
ప్రియా కన్నీటికి కారనం చెప్పలేక.. నీవేమయ్యావో తెల్సుకోలేక
నీవులేక ప్రతిక్షనం ఒంటరి తనం ఒడి చేరుతుంది
సరదాలు సంతోషాలను కాలదన్ని..మనస్సు ఒంటరిగా ఉండలని చూస్తోంది
ఎన్నటికి నిన్ను వీడనంటూ..ఏకాంతం కౌగిలించుకుంది ..
ప్రియా జ్ఞాపకమై గుండెలో చేరి మౌనాన్ని మంత్రంగా వేసి నిశ్సబ్ధం గా మరలిపోయావు
జ్ఞాపకాలు గుండెల్లో చేరి తీయని గాయం చేస్తున్నాయి ప్రియా
నీ మాటలతో ఆ మౌనం వీడేదెప్పుడు ప్రియా
నీ ఓదార్పుతో నా గుండె గాయం మానేదెప్పుడు ప్రియా