Saturday, February 25, 2012
ఊహల్ని..కాలరాసి ఆత్మను ముక్కలు ముక్కలుగా మిగిల్చావు
ప్రేమిస్తున్నాను అని,
నాకోసమే జీవిస్తున్నానని ... అన్నావు
ఎప్పటికీ నాతోనే అన్నావు
నీ జీవనం అని ... అన్నీ అబద్దాలు!
నా భావనల్ని, ఊహల్ని
కాలరాసి ఆత్మను ముక్కలు ముక్కలుగా మిగిల్చావు
నా ఆనందం హరించి
గుండెల్లో గాయాన్ని రేపావు!
బాధే ... మిగిలింది
ఆత్మ ఆవిరై ...
నమ్మలేని నిజం నీవు అబద్దాలాడటం ....
మనము చాల ప్రాక్టికాల్ గా ఉంటాము . మనకు ఎంతో నచ్చిన వాళ్ళ తో కూడా అలానే ఉంటాం . కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయము . మనం అలానే ఉండటం వలన ఏమి కోల్పోతున్నాము అని . కానీ ఎప్పుడు కూడా ఆ పద్ధతి మార్చుకోము ఎందుకు అంటే మనము మనుషులం కదా ...ఏమి కానీ నీవు నా జీవితము లో కీ వచ్చావు ..నాకు తెలుసు నీ రాక శాశ్వతము కాదు అయిన నా పిచ్చి మనసు ఊరుకోదు.నీ రాక తో నా ఎడారి లాంటి జీవితము లో వెన్నెల వచ్చింది మిత్రమా ....
నీవు వస్తున్నావు అంటే ఆనందం .నీకు స్వాగతము చెప్పటము కూడా మరచిపోతా ,, వెళ్ళిపోతున్నావు అన్నా బాధ లో నీకు వీడుకోలు కూడా పలకను...
...
నీ నుంచి దూరంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తే, నా ప్రమేయం లేకుండానే మళ్ళీ నీ వైపుకే పది అడుగులు పడిపోతుంటే ఎలా ? ఒక్క నువ్వు ఒక్క నాలో ఇన్ని వేల వేల తలపుల్ని పూయించడం ఎంతటి విచిత్రము కదూ! నా నువ్వైపోతూ నీ నేనుగా మారిపోతున్నఈ క్షణాన.. ఏమని చెప్పాలి నీకసలు...... ఏమని అడగాలి నిన్నసలు.. ఎవరనుకోవాలి నిన్నసలు
Labels:
కవితలు