నీవు నడచిన దారిలో
వసంతం విరియదా ?
చిలిపి చూపులు తాకిన
వలపు తలపులు రేగవా ?
విరిసిన పెదవుల నవ్వులకు
హరివిల్లు తల వంచదా ?
అందమైన మోము చూసి
చందమామ కుంగి పోదా ?
నా ఎదపై నువ్వు వాలితే
ప్రపంచం మాయమవ్వదా ??
నిండు పున్నమిలో పండు వెన్నెలలో ,
నిండు గోదారిలో పడవలో ప్రయాణంలో,
నీటి అలలపై తేలియాడు వెండి వెన్నెల,
నీ మోముపై పడి మేరియుచుండ !
నీటిపై ప్రతి బింబంలా మారెను చందమామ
నీ మోము చూసి మురిసి మెరియుటకు !
పిల్ల తెమ్మెరలు నీ నేలి ముంగురులు
సవరించి సరసమాడగా !
నీ మేను తాకి పరిమళాలు మోసుకొస్తున్న
పిల్లగాలులు గిలితింతలు పెట్టగా ,
అప్రయత్నంగా అడుగులు వేసాను
నన్ను నేను మరచి నీకోసం తపిస్తూ ,
నా ప్రాణ సఖిని చేరటానికి
క్షణమాగిన ఉపిరి అగునేమోనని తలచి !!