నీ కురులకు కుప్పెలు అవ్వాలని
నీ నుదుటన తిలకంగా నిలవాలని
నీ కనులకు కాటుక కావాలని
నీ చెవులకు బుట్టలుగా ఊగాలని
నీ పెదిమల నవ్వులుగా విరియాలని
నీ ముక్కున మక్కేర కావాలని
నీ ఎదపై హారంగా మెరవాలని
నీ నడుమున వడ్డాణముగా చుట్టాలని
నీ కాళ్ళకి గజ్జేలుగా మ్రోగాలని
నా చిన్న మనసుకి ఎంత ఆశో
చెప్పలేని చిలిపి కోరికలు ఎన్నో
నీకు చెప్పాలని వచినప్పుడల్లా
అన్నీ మరచిపోతుంది మనసు
నీ ప్రేమని మాత్రమె కోరుతుంది..
నువ్వే తన ప్రాణం అంటున్నది .
నా మనసు నన్ను వదిలి ఎన్నడో
చేరింది నీ చెంతకి
నువ్వంతగా నచ్చావు నా మనసుకి !
నా మనసుని.. అదే నీ మనసుని
పదిలంగా చూసుకో ప్రియ సఖీ !!