నా కలలకి పై పై మెరుపులు దిద్దుతున్నా
అందంగా కనిపించాలని ...
దీనంగా నేలకి మొహం వేసుకున్న వాటికీ
అబద్దపు ఆనందం అయినా ఇవ్వాలని ..
నా కలలు నీ చిరునామాకి పంపించనా ...?
ఎందుకంటే నా కలల్లో
నాకన్నా నువ్వే ఎక్కువున్నావ్ ..!!
నా కలలు నీ కలలతో కలుస్తాయట
నేనేం తక్కువ చేసానో నాకు తెలియదు
నీ పేరుతో జతగా గుర్తింపు కావాలని
వాటి ఆశ మరి ఏమంటావ్ ??
కలలు కాలంతో కరిగి పోకుండా
నా నిచ్వసతో కలిసి ఆవిరి అవకుండా
నీ తోడు కౌగిలిని వాటికిస్తావా ?
నా కలలకు ఊపిరిని అందిస్తావా ??