తుమ్మెద రెక్కల లాంటి నీ కనులు
చూసి చూడనట్లు చూసే తుంటరి చూపులు
తాకీ తాకనట్లు నా మనసుని తాకితే
మదిలో రేగెను అలజడులెన్నో!
కొంటె కన్నుల సంధించి
బిగబట్టిన నవ్వుల పదును బెట్టి ,
విడిచిన వలపు బాణాలు,
సూటిగా నా గుండెను గుచ్చితే
విల విల లాడదా హృదయం ??
దూరాన్ని దూరం చేసిన నీ చూపులు
దూరం చేసెను ఎన్నో ప్రశ్నలు
చెప్పెను ఎన్నో సమాధానాలు
తోలి వలపులో తియ్యనితనం
తెలిపిన నీ ప్రేమ ఇంక నా
గుండె లోతుల్లో పదిలం