ఎవరిని చూసినా గుండె కొట్టుకుంటుంది కానీ
నిన్ను చూస్తేనే గుండె ఆగిపోతున్దనిపిస్తుంది !
ఎవరితో ఎన్నైనా మాట్లాడగలను కానీ
ఎవరినైనా కన్నులలో కన్నులుంచి చూడగలను
నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను ఎందుకో !
ఎవరి వెనక నడవాలన్నా ఇష్టం వుండదు కానీ
నీ అడుగులలో అడుగువేస్తే ఎంతో ఇష్టం నాకు !
ఎవరితోనైనా కొంత సమయమే ఉండాలనిపిస్తుంది
నీతో మాత్రమే జీవితాంతం ఉండాలనిపిస్తుంది !!