Saturday, February 25, 2012
నా గుండె ఆ నిజంలో తగల బడుతోంది...అది శవంకాలిన వాసన వేస్తుంది
మాటలు తడబడుతున్నాయి...జగింది జరుగుతోంది ఏమౌతోందసలు
కొన్ని జరిగిన జరుగుతున్న నిజాలు నన్ను తగల బెడుతున్నాయి
నామీద నాకే అసహ్యింవేసేలా..నామీదనాకే విరక్తి కలిగేలా చేస్తున్నాయి
నేనోడి పోయా అని తెల్సుగాని ఇంత ఘోరంగా ఓడిపోయాని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది..
నన్నోడించీ నోడి నోట విన్న నిజం నన్ను కాల్చేస్తుంది...దగ్దం అవుతున్నా
వాడి నోట ఆ నిజం విన్నప్పటి నుంచి ..నేను వేదనతో తట్టూకోలేక తగల బడుతున్నా
నా గుండె ఆ నిజంలో తగల బడుతోంది...అది శవంకాలిన వాసన వేస్తుంది
ఒకప్పుడు కళ్ళెదురుగా జరిగిన నిజం..నన్ను ఓ వెష్టుగాడిని చేసింది
ఇప్పుడు నన్న నేను తగలబడేలా చేస్తుంది..గుండె మండుతోంది..
నిజం వాడు చెప్పినప్పటినుంచి నిద్ర పట్టడం లేదు నాకేదో జరుగుతోంది
నామీద నాకు అసహ్యం వేస్తుంది..ఎందుకిలా నాకే జరుగుతోందో అర్దం కావడంలేదు
నన్నెందుకిలా దారుణంగా ఓడిస్తున్నావు..నేను నేను గా ఎప్పుడో కోల్పోయాను
నా కన్నీటీకి విలువలేదు .. నా వేదనకు అర్దం లేదు..నన్నెందుకు అర్దం చేసుకోవు..
చల్లని చంద్రుని నీడకూడా నాకు పగలు లా అనిపిస్తున్నాయి..ఎందుకో
చంద్రుని చల్లని కాంతిలో కూడా నాకు నడిసూర్యుడిలా నన్ను కాల్చేస్తున్నాయి
పగలు చీకటిలా చీకటీ పగలులా ..ఏంటో పిచ్చి పిచ్చిగా మారిపోతుంది లోకం
నన్ను నేను గా బ్రతుకుతున్నప్పుడు జీవితంలో ప్రవేశించి ఇప్పుడు నన్నెందుకిలా కాల్చేస్తున్నావు..
అప్పుడలా ఇప్పుడిలా నీవు నన్నెందుకి లా చేశావని అడుగలేను ఆర్హత నాకు లేదుకదా..?
Labels:
కవితలు