నువ్వు నన్ను దూరంగా ఉంచినప్పుడల్లా
నాకు నువ్వు ఇంకా బాగా అర్ధం అవుతావు
ఎందుకంటే ప్రతి క్షణం నీ ఆలోచనలే !
నీవు దూరమైనా క్షణం నుంచే తెలుస్తుంది
నీ స్నేహం ఎంత ఆనందాన్నిస్తుందో ,
నీ సహచర్యం ఎంత మనో బలాన్నిస్తుందో ,
నీ స్పర్శ ఎంత ప్రేమని తెలుపుతుందో ,
నీ చూపు ఎంత ధైర్యన్నిస్తుందో !
ఇవి ఒప్పుకోలేని తనముతో నే
నీతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేది !
నీ గురించి ఇంకా తెలుసుకోవాలి ,
ఇంకా ప్రేమించాలి, ఇంకా దగ్గరవ్వాలి..
మన ఎడబాటు ప్రేమను పెంచినంతకాలం
నీతో ప్రేమగా గొడవ పడుతూనే వుంటా ...
నీవు కానీ దేదీ వద్దు నాకు !
కొంచెం కొంచెం గా నేను మారి, అంతా నువ్వే కావాలి
నేను శూన్యంగా మిగిలి, నీలో ఇక్యం కావాలి అనేది
నా మొదటి చివరి కోరిక ..........