ఏది జరుగకూడదో అని భయపడతామో అవే కళ్ళెదురుగా జరిగితే..
ఏ మాటలు వినకూడదు అనుకుంటావా అవే మాటలు వినాల్సివస్తే
ప్రాణంకంటే ఇష్టమైన వ్యక్తి .. నీవు చస్తే నాకేంటి అంటే..
బ్రతికితే నాకేంటి అని దారుణంగా మాట్లాడితే ..?
ఆ మాటల వెనుక అసలు నిజం తెల్సినప్పుడు ఓర్చుకోలేని భాద..
ఆ మాటలు కావాలని ఎవరు అనిపించారో నిజం తెల్సినప్పుడు
అప్పుడు ఆన్నమాటలు ప్రతి క్షనం గుర్తుకు వచ్చినప్పుడల్లా చచ్చి పోవాలని పిస్తుంది
ఏవ్వరైనా ఎదుటి వానిగురించి కావాలని చెడుగా చెబుతున్నాడంటే వాడేదో ఆసిస్తున్నాడని తెల్సుకోలేక పోయావా
ఒకడు చెయ్యని నేరానికి దోషిని చేస్తే .. మరొకడు తన స్వార్దం కోసం..నడిపిస్తున్న డ్రామా
ఇలాంటి విషయాలు తెల్సి చెప్పాలని ట్రైచేస్తే.._____ వద్దులే..?
ఎలా పరిచయం అంటూ ..ఏలా పడవేశానంటూ..నా ఎదురుగా మాట్లాడుతుంటే
పదే పదే పాత జ్ఞాపకాలు నన్ను చుట్టి మనసును గందరగోలం చేస్తున్నాయి
అర్దం చేసుకుంటారండి అన్న మాటవెనుక నీ సంతోషంకోసం అప్పుడు ఏం కోల్పోయానో తెలుసా...?
నావైపు గా ఉండి ఒక్కసారికూడా ఎందుకు ఆలోచించలేవు..ఎందుకని
అవును నిజంగా అంత ఇష్టంగా ఎలా ఉంటారో కదా...?
ఎవ్వరు ఏం చెప్పినా విననంత నమ్మకంగా ఉంటారా.. అది సాద్యిమేనా
ఎదుటి వాడు తన స్వార్దంకోసం ఏమేమో చెబుతాడు అవన్ని నమ్మకుండా ఎలా ఉంటారో కదా...?
స్వార్ద పరుల్ని నమ్మిన మనుషులు ..నిస్వార్దం గా ఆలోచించే వాళ్ళను ఎందుకు నమ్మరు
మనసులో నలిగిపోతున్న బావాలు గుర్తించాలని ఎందుకు ట్రై చేయవు..
నేను అందరి ఎదురుగా ఓడిపోవడం నీకిష్టమా..అవునుకదా..?
కాని ఇలా ఎంతకాలం అని ఓడిపోవాలి ..ఎంతకాలం నన్నోడిస్తూనే ఉంటావు
నీకు ఎదుటి వాళ్ల సంతోషంకోసం నన్ను భాదపెట్టడం ఇష్టమేమో కదా..?
వాళ్ళకు నన్ను భాదపెట్టడమే ఇష్టం అందుకు నీవు నన్ను ఎన్నైనా అంటావుకదా..?
మొత్తనికి నీవిషయం లో అందరూ అనుకున్నది సాదించారు..అప్పుడూ వాడు ఇప్పుడు వీడు
నీకో సంగతి తెల్సా నాకు అస్సలు ఓడిపోవాలని లేదు కానీ ఓడిస్తున్నావు
మనసుకు భాద అనిపిస్తే నీకు చెప్పాలని పిస్తుంది నీవే ఇలా బాద పెడుతుంటే..?
కొందరు నన్ను నీవు బాదపెట్టాలని కావాలని అంటున్నా మాటలు వింటున్నావే దానికి ఇంకా భాద అని పిస్తుంది
వాళ్ళలా గేంలు ఆడలేను ..వాళ్లని నటంచలేని వాళ్ళంత మంచి వాడిని కాదుకదా....?