పరికించి చూస్తే రెప్పపాటుది మనిషి జీవితం
అందులో చీకటిలాంటి దుఖం అరక్షణం ఆక్రమిస్తే
ఆనందపు వెలుగులకు మిగిలేది ఇంకో అరక్షణం మాత్రమే
సరిగమపదని లు సప్తస్వరాలే అయినా
వాటితో కోటి రాగాలు పలికించినట్లు
ఆకాశాన్ని ఆవరించిన అనంతమైన తారల్లా
విరిజాజుల పరిమళ చిరునవ్వుల దరహాసాన్ని
నీ పెదవుల పూతోటలో ప్రతీక్షణం పూయించాలని
ఈరోజే ఆ మహోత్సవానికి శ్రీకారం చుట్టాలని
ప్రేమతో ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు ఆదూరి ఇన్నారెడ్డి అన్నకి …..
- Anil Kumar