నీతో ఎడబాటు ఇంత బాధాకరమైనదని
ఎంతగా బాదపడుతున్నానో నీకేం తెల్సు.
ఎందుకంటే భాదపడటం..
నిద్రలేని రాత్రుల్లు గడపడం నేర్పావుగా
వెన్నెలలోను వడగాడ్పులు
ఉంటాయని,
శీతాకాలంలో చలిమంటలు
బాధిస్తాయని ,
మండు వేసవిలో చల్లనినీడ
హాయినివ్వదని ,
హేమంతము మనసు తాపాన్ని
చల్లార్చదని ,
సప్తవర్ణపు ఇంద్రధనువు అందంగా
కనిపించదని ,
మనసునిండా నీ రూపమే
నిండి వుంది వెంటాడితే
నీతోడులో కాక మనసు
ఎచట సేద తీరుతుంది ??
మరలిరా ప్రియతమా నాకోసం
మనసు నీకోసమే ఆరాటపడుతున్నది !!