ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం
తనలోకి లాక్కుంటుంది ...
ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో
మనసంతా ఇరుకుచేస్తుంది ..
ఉక్కిరిబిక్కిరిగా
నన్ను ఏడిపిస్తుంది..
దాన్ని వెళ్ళగొట్టాలని చూస్తానా
ముందు వెళ్ళేది "నువ్వు" అని వెక్కిరిస్తుంది
ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది....
నీ మాటలు పండించే పువ్వులు నా మనసు నింపి , హాయి గంధాలు చిలుకుతుంది.
నిన్ను కలవలేని మన మధ్య ఉన్న మైళ్ళ దూరాన్ని ప్రతి రోజు కొలుచుకుంటూ ...
తెలీయకుండానే నీ సమీపానికి చేరుకుంటున్నా. !
ఆకాశం లో నాకోసం మెరిసే ఏ తారవో అని వెతుకుతున్నా .. నిన్ను చందమామ లో పోల్చుకోలేక పోయా.!!
వేల నిముషాల వృధా ప్రయాసలో , నీకు నాకు మధ్య చిగురువేసిన బంధానికి నేనెప్పుడు తోడుగా ఉంటాను. మరి నువ్వు?
ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది..
సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా?
జాగు చేయక చెప్పిపోరాదా?
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??