Saturday, February 25, 2012
...మృత్యువా ఎక్కడున్నావు....?
...మృత్యువా ఎక్కడున్నావు....?
అడుగడుగునా మోసం..అడుగడుగునా ద్రోహం..?
నిజాయితీ లేని మనుషులు ..వాళ్ళ స్వార్దం నన్ను దోషిని చేస్తే..?
ఒకటా రెండా ప్రతిచోట ప్రతి విషయంలో నాకే ఎందుకిలా జరుగుతుందో
మరణమా ఒక్కసారి నన్ను కబలించు ఎందుకు బయపడుతున్నావు
మరణమా అందరూ నాతో నా జీవితంతో గేం ఆడి నట్టే నీవు నటిస్తున్నావా..?
మృత్యువా నీకూ నేనంటే చిన్నచూపా ..ఎందుకని..?
మనిషి ఒక్కసారే ఓడి పోతాడు కాని నాలా ప్రతిక్షనం ఓడిపోడు..
నేను నమ్మిన మనుషులే నన్ను దగ్గరుండీ ఓడించి నవ్వుకుంటున్నారు..
ఎవ్వరికైనా గుండెకు గాయం ఒక్కసారే జరుగుతుంది మరి నాకేంటీ ప్రతిదీ గాయం అవుతోంది
ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు చేయని తప్పులకు బలి అవుతున్నా
ఇలా ప్రతిక్షనం చస్తూ బ్రతికే కంటే ఒక్కసారిగా..?
అందుకే మృత్యువా ఎక్కడ నీవు కూడా నాదగ్గరికి రావడానికి బయపడుతున్నావా
నీవు ఎందుకు బయపడుతున్నావు నాకు ..నీవుకూడా నాతో నాటకాలాడుతున్నావా
మృత్యువా నాదగ్గరకు రావడాని ఎందుకు బయపడుతున్నావు..?
ప్రతిక్షనం చస్తూ బ్రతికే కంటే ఒకేసారి ..కదా మరి మృత్యువా వచ్చి నన్ను కబలించు
Labels:
కవితలు