మౌనం అర్ధ అంగీకారం అంటారు .. కానీ...ప్రస్తుత పరిస్తితుల్లో మౌనం మరణ శిక్ష లాంటిది.
అనవసర మయిన చోట మాట్లాడక పోవడం మౌనం అనిపించుకుంటుంది కానీ ... మనకు ఎందుకులే... మనం ఒక్కరం ఏమి చేయగలం అని తప్పు కోవడాన్ని మౌనం అని పించు కోడు అది మరణ శిక్ష లాంటిది ముందు చెప్పు కున్నటు.
కాలం కరిగి పోతూ ఉంటుంది...పచ్చని చెట్టు మోడు బారి పోతుంది...అది ప్రకృతి నైజం. ఎండిన ఆకుల్లా ఎదుటి వారి కన్నీళ్ళు రాలి పోతుంటే కరిగే హృదయం కరువయింది.
ఎండిన చెట్టు చిగురించడానికి వర్షం సాయం చేస్తుంది... మరి ...మనిషికి?
మనిషి ... మనిశికీ మధ్య మౌనం రాజ్యమేలుతుంటే... మనిషి పయనం ఎటు వైపు?
మోడు బారిన చెట్టు లా ఒంటరిగా మిగిలిపోవదమా ... లేక వర్షం లాగ తోటి మనిషికి సాయపదతమా... మనలోని మనిషిని మనమే అడగాలి... మనమే బ్రతికించు కోవాలి.
సృస్తి లో అన్ని తమకి ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వహిస్తున్నాయి ఒక్క మనిషి తప్ప... మనిషి తన కర్తవ్యమ్ కాకుండా మిగతా కర్మ లన్నిటిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను అని అనుకుంటూ వెనక్కి పయనిస్తున్నాడు.