ఒకప్పుడు నీవు నాదానివే అన్న క్షణం నుంచీ
ఎడారి నిండా ఒయాసిస్సులు ,
మండు టెండ చల్లని స్పర్శగా ,
హిమాలయాలపై నులి వెచ్చగా ,
ఎదురుగాలులు పిల్లగాలులుగా ,
... కుండపోత వర్షం చిరు జల్లులుగా ,
పగలే కలలు కంటున్నట్లు,
కలలలో తేలి పోతున్నట్లు ,
గాలిలో ఎగిరి పోతున్నట్లు ,
ఎన్నెన్నో అనుభూతులు ...
ఇవన్నీ పగటి కలలేమో అనుకున్నా
నువ్వు చిలిపిగా గిల్లితే నెప్పి తెలిసేదాకా
నీ ప్రేమతో ఇన్ని అద్భుతాలు జరిగాయా ??
ఇలా ఊహళ్ళో తెలుతూ ఆనందగా ఉన్ననాకు తెల్సిందో నిజం
గుండె ఆగిపోయిందా అనిపించింది ఆగిపోతే బాగుండు అనిపించింది..
చిన్న విషయాన్ని తట్టుకోలేని నాకు ప్రతిక్షనం ..
ఎంత బాదపడుతున్నానో నీకు తెల్సు..
నిద్రలేని రాత్రుల్లు...భాదపడని నిమిషంలేదు అయినా...?
నాకే ఎందుకులా జరుగుతోందోతెలీదు..నేనేం...దు?
చెప్పుకోలేని భాద..పంచుకోలేని వెదని ఇంక ఎన్నాళ్ళూలే...కదా..?
సమయం దగ్గర పడ్డదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది..నిర్నయం తీసుకున్నా