వెలుగుతున్నంత సేపు ...
వెలుగు పంచుతున్నాను
అన్న ఆనందం చాలు నాకు ...
కాసినంత కాలం
మంచి ఫలాలను ఇస్తున్నాను
అన్న తృప్తి చాలు నాకు ....
ప్రవహిన్చినంత కాలం ..
ఎందరి దాహమో తీరుస్తున్నాను
అన్న ఆనందం చాలు నాకు ..
ఈ మాటలు వినడానికి బాగున్నై కదా
అని రాసా... కానీ వాటి వెనక అవి పడే బాద
నాది .... ఎవరికీ తెలియకుండా
కార్చే కన్నీరు నాది
ఆనందాన్ని నటిస్తూ ..నవ్వు పంచాలనుకునే
నాకు ఆనందం కూడా
ఒక వస్తువే అనుకునే స్థితికి
దిగజారిన గెలుపులో ఓటమి నాది