నేనోడిపోయానా..ఎందుకు ఓడిపోయాను..
ఏంటో ఎందుకిలా జరుగుతుంతో నాకే ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు..
అవును ప్రేమగా ఎలా ఉంటారో కదా... అప్పుడొకలా తరువాత మారుతారా..?
కొందరు కొందరితో ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేది నిజమా అనిపిస్తుంది
నిజంగా అంత ఇష్టం గా ఎలా ఉంటారో కదా...?
వాళ్ళిద్దరి మద్యిలో ఏవరో వచ్చి చెబితే ఆ ఇష్టం మారిపోతుందా..?
ప్రేమ...ఇష్టం అంటే ఏంటీ..ఎందుకు పుడుతుంది ఎందుకు కష్టంగా మారుతుంది
అప్పుడలా ఇప్పుడేలా మారిపోతారు...అందరూ ఇలాగే ఉంటారా
ఇష్టం కష్టంగా మారుతుందా...ఇష్ట పడ్డ మనిషి భాదపడుతుంటే ...?
తెల్సి ఎలా సైలెంట్ గా ఉంటారోకదా... అది ఎలా సాద్యిమో
అంత ఇష్టంగా ఉండటం..భాద పెట్టడం__నీకీ సాద్యిమేమో
మనుష్యుల్లో ఇంత మార్పు ఎలా సాద్యమో అర్దం కావడంలేదు..
మనం కల్సిన మొదటిరోజు ఎలా ఉన్నామో నేను ఇప్పుడు అంతే ఇష్టం నీవంటే
నేను మారలేదే...ఎందరో ఎన్నో చెబుతారు అది వారి స్వార్దం ..కాని మనం అలా కాదుకదా..?
నేనీ మార్పును తట్టుకోలేక పోతున్నా..మాటలు గొంతుదాటి రావడం లేదు
ఇష్ట పడ్ద మనిషిను చూడకూడని స్థితిలో చూడాల్సి వస్తే..అదెంత భాదో కదా..?
ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అదీ నాకే ఎందుకు జరుగుతుందో తెలీదు
కొందరు కావాలని నా ఎదురుగా సేస్తున్న పనులు నన్ను ఇంకా పిచ్చివాడిని చేస్తున్నాయి
మాటలు రావడం లేదు మూగగా రోదించడం తప్పించి ఏమీ చేయలేను ..?
ఎవ్వరికి చెప్పుకోలేక మనసులో భాదను తట్టుకోలేక ఈ గుండె ఏప్పుడో ఆగుతుంది
ఆరోజైనా నా ప్రేమను ... నీమీద ఉన్న ఇష్టాన్ని నమ్ముతావా..
అయినా అప్పుడు ఎంత వెతికినా కనిపించను కదా ..అదే కోరుకుంటున్నావా....?
నేను నేను గా లేను నా భాదను ఎప్పుడు అర్దం చేసుకుంటావో తెలీదు
ఏమో చెప్పాలని ఉంది ..కాని ఆ అవకాశంలేదు...ఎందుకిలా అయ్యాను..
ఎమౌతానో ..ఏమౌతుందో తెలీదు అందరూ మచివాళ్ళే నేను తప్ప కదా..?