ఎన్నిసార్లని విరిచేస్తాం
తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా
ఎన్నిసార్లని పీకేస్తాం
రాళ్ళ పగుళ్ళలో తలెత్తే ఏ మొక్కనైనా
ఎన్నిసార్లని మూసేస్తాం
దారి మధ్యలో ఉబికే ఏ ఊటనైనా
ఎన్నిసార్లు తొక్కేస్తాం
శాశ్వతం అనుకునే ఏ పరకనైనా
ఎన్నిసార్లని కుక్కేస్తాం
నీ ఆలోచనలతో నిండిపోయిన జ్ఞపకాల పెట్టెలోనైనా
ఎన్నిసార్లని ఛేదిస్తాం
అసాధ్యమని తెలిసిన ఏ పద్మవ్యూహాన్నైనా
ఎన్నిసార్లని ముందుకుతోస్తాం
అలసత్వం నిండిన ఏ పిరికి మెదడునైనా
ఎన్నిసార్లని చూస్తూంటాం
నీ కై పరితపించే మనస్సుకు ప్రాణం వుంది
ఆ తపన ఎన్నాళ్ళు గొంతులో ప్రాణం వున్నత వరకేగా
నీవు ఎన్నాళ్ళూ దూరంగా ఉంటావు నా గొంతులో ప్రానం తీసేతవరకేగా