Monday, February 28, 2011
మనస్సాక్షిగా మౌన వేదన ఎన్నాల్లిలా..?
మనస్సాక్షిగా మౌన వేదన ఎన్నాల్లిలా..?
నాలో నేను ఉన్నానో లేనో అర్దంకావడంలేదు....
నాకు నేనుగా ఎమౌతున్నానో అర్దం కావడంలేదు..
మౌనంగా ఉండటంలో ఎంత వేదనో ఇప్పుడు అర్దం అవుతుంది..
వద్దు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు..
ఒకప్పుడు పిలవగానే పలికే ఓ కోయిల ఇప్పుడు ఎంత పిలివాలనుకున్నా రాదేల..
రాని ఆ కోయిల రాగాలు పలికిస్తుందని ఎదురుచూపులో వెర్రితనమే కదా..?
ఎం రాస్తున్నానో ఏం చేస్తున్నానో అర్దంకావడంలేదు...
నిజం ఎప్పుడూ నిజమే ...అబద్దంకూడా నిజమే..
నన్ను నేను ఎక్కడో పోగొట్టుకున్నాను..
నాకు తెలిసిన "నేను" కాదు; ఇప్పుడున్న నేను..
స్పందించే హృదయాన్ని పోగొట్టుకున్నానో..
హృదయ స్పందననే పోగొట్టుకున్నానో..అర్దంకావడంలేదు...
ఎదో అవుతున్నాను ఎమౌతున్నానో అర్దం కావడం లేదు
Labels:
కవితలు