Thursday, February 10, 2011
వెంటాడుతున్ననీ ఆలోచనలు...మరపు నాకు సాద్యంకాదేమో..
అసలు నేను గుర్తున్నానా..
నా ఆలోచనలు నీ కున్నాయా.
గుర్తుకొచ్చే కొద్దీ గుండెల్లో వేదన..
కాస్త సమయందొరికితే నీ ఆలోచనలే..
వెంటాడుతున్ననీ ఆలోచనలు...మరపు నాకు సాద్యంకాదేమో..
వద్దనుకున్నా ఎంచేయగలను కంటకన్నీరు వేడి నిట్టూర్పులు తప్ప..
కొన్ని నిజాలు అబద్దాలు కాకుండా వుంటే బాగుండన్న స్వార్దం..
గుండేల్లో అగ్నిని రాజేస్తున్నా..మంటల్లోనించి అవలీలగా కనిపిస్తున్న నీనవ్వు..
అప్పటి నీనవ్వుల్లో నన్ను నేను చూసుకునే వాడిని ..
ఇప్పుడు నన్ను వెక్కిరిస్తున్నట్టుంది ఎందుకో..
....అప్పటి నీనవ్వు మనసుకు దగ్గరగా..
ఇప్పటి నవ్వు మనిషికి దూరంగా వెటకారంగా అనిపిస్తుంది..
తప్పు నీదికాదు..నీవెప్పుడూ తప్పు చేయవు అంతా నాదే తప్పు...
నా ఆలోచన తప్పు.. నా పిచ్చి ప్రేమలో నిజాయితీలేదు
అదే ఉంటే నీవు నాకెందుకు దూరం అవుతావు మిత్రమా..
అందుకే ఎప్పుడు ఒకర్ని నిందించడం కంటే నన్ను నేను నిందిచుకొంటాను..
అందరూ ఎవరి స్వార్దం వాల్లు ఆలోచిస్తుంటే.. నీవెందుకురా నిన్ను కాదన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావని మనస్సు తిట్టి పోస్తోంది నన్ను
Labels:
కవితలు