Monday, February 7, 2011
నేను గిరి గీసుకున్న చట్రం లోంచి బయట పడలేకపొతున్నా..
నేను గిరి గీసుకున్న చట్రం లోంచి బయట పడలేకపొతున్నా కారణంనేను పెట్టుకున్న నమ్మకం.. కాని నమ్మకం కు ఎదురౌతున్న ఘటనలు నిజాలైనా కాదేమొ అని ఎక్కడో చిన్న ఆశ కాని అవి నిజాలు కాని నిజాలు..అని తెల్సినా నేను గీసుకున గిరి లోంచి బయట పడలేకపోతున్నా..తిన్నామా పడుకున్నామా లేచామా ఇదేనా లోకం..ఎక్కడుంది నమ్మకానికి స్థానం..కొంతమంది నాలాంటి వారు ఉంటారేమో ఎదురుగా అన్ని వాస్తవాలు జరుగుతున్నా అవి నిజాలు కాదు అంటూ పెట్టుకున్న నమ్మకాలు..ఆ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టారు అయినా ఎక్కడో మనసును కెలుకుతున్న అనుమానం ఎవరు వీళ్ళంతా..ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు..వీళ్ళ కోసం నా ఆలోచన దోంతరలో సమయాన్ని ఎందుకు కేటాయించాలి వాళ్ళకు నాగురించి కించిత్ ఆలోచన లేకుండా లైఫ్ ఎంజాయి చేస్తున్నప్పుడు ..బందాలు చత్తా చెదారం అని ఎదురు చూడాల్సిన అవసరం వుందా అని ఎన్ని ప్రశ్నలేసుకున్న అస్సలు సమాదానం దొరకడంలేదు..అందుకే ఎదుటివారిని బ్లైం చేయకుండా మనం కరెక్టుగా ఉడాలనేది నిజంకదా..?ఎవరో కరెక్టుగా లేరు అనేకంటే....మనం మనంగా మనల్నికోల్పోకుండా ఉండాలి కదా..ప్రతి మనిషికీ మానవీయ విలువలు అవసరం ...ఎట్టి పరిస్థ్తితిల్లో వాటిని వీడకూడదు...ఎప్పుడో ఏదో జరుతుందని నమ్మకాలకు పాతరపెట్టి అప్పటికప్పుడు మార్పు చెందాల్సిన అవసరం వుందా...? పరిస్థితులను బట్టి మారాలా ఇవన్నీ జరుగుతాయని ముందుగానే తెల్సుకదా మరి అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా....వద్దు ఆలోచించకు నీ సమయం వృధా చేసుకోకు GUD LUCK