Monday, February 21, 2011
వేశ్య...తనువు పుండై..ఒకరికి పండై..తనువుని పంచునది..
నిలువెత్తు,
హ్రుదయశిల్పమెప్పుడొ
సమాధిగ మారినది..
పాపమొక భోగం,
ఆడతనమొక శాపం..
దహిచు రోగం
అరణ్య రోదనం..
తనువు పుండై..
ఒకరికి పండై..
తను శవమై..
ఒకరికి వశమై..
విధిరాత విషమై..
తను శిలగ మారి
తనువుని పంచునది..
నాలుగు నోట్ల మధ్య
నలుగుతున్న అస్తిత్వం..
సమాజం కోరల మధ్య
ఉరేయబడ్డ మానవత్వం..
యేనాడొ వెలేయబడ్డ
చీకటి ప్రపంచపు
ఆఖరి శ్వాసల
ఉత్తేజం లేని ఉచ్వాసం..
నిస్సత్తువ నిచ్వాసం..
రేపన్నది లేనేలేదు
బయటప్రపంచమొక
మధ్యరాత్రి పీడకల..
నీలి నీడల ఆర్తనాదాలు..
కాళ రాత్రుల ఆనవాళ్ళు..
నేనొక అర్ధరాత్రి స్వతంత్ర్యం..
నాదొక అంటరాని వసంతం..
- చైతూ (ORKUT )
( విది వంచితులు తమ వళ్ళు అమ్ముకొనీ జీవిస్తుంటే కోందరు తిరుగుతున్నారు...అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా... మాకు కొందరు సీక్రెట్ గా తీసిన వీడియోలను పంపుతారు ఇంట్లో తల్లి దండ్రులకు తెలీకుండా ఇలాంటి పనులు చేస్తున్న వారిని ఏమనాలి కొన్ని చీ అనిపిస్తుంది ఇలాంటి పనులు చేసేవారు తమను ఎవ్వరూ చూడటం లేదనుకుంటా టెక్నాలజీ పున్యమా ఎప్పుడొ ఒకప్పుడు బ్రతుకులు బయట పడతాయి జాగ్రత్త ..ఒక్కొక్కరు అమ్మాయిలు ,అబ్బాయిలు పదిమందితో తిరగటం ఎంజాయ్ చేయడం ఫేషన్ అనుకుంటున్నారు..పబ్బుల చుట్టూ తిరుగుతూ గబ్బు పడుతున్నారు...ఆ ఫోటోలు మీకు తెలీకుండా తీసి నెట్లలో పెడుతున్నారు జాగ్రత్త ఇలా తీసిన వీడియోలు ఫొటోలు మీతల్లి దండ్రులు చూస్తే ఉరి వేసుకొని చస్తారు ఇది మాత్రం నిజం..మీకు తెలీకుండా తీసిన వీడియోలు మీడియాకు దొరికేలా చేస్తున్నారు కొందరు వెదవలు .....ఈ మద్యి ఇలాంటి ఓసిడి చూస్తే తల తిరిగిపోయింది..నలుగురికి తెల్సిన కొందరి వీడియోలో ఉన్నాయి అందుకే ఈ కవిత చూసి భాద కోపం వచ్చి ఇలా రాస్తున్నా...అందుకే అన్నా కొందరు విధిలేని పరిస్థితుల్లో చేస్తుంటే చివరకు పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా బరెతెగించి పోతున్నారు ఆడమగ తేడాలేకుండా..? అది ఒక్కరితో కాదు మరి వీరికంతే వ్యభిచారులే నయం అనిపించింది)