Monday, February 14, 2011
లవ్ ఫెయిలైతే..?...ఏంచేయాలి...?
లవ్ ఫెయిల్.. ఇప్పుడు కామన్ వర్డ్.. మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా పలకరించి చూడండి.. వారి లవ్‌స్టోరీలు తెలుసుకోవడానికి ట్రై చేయండి.. ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథలు చాలానే ఉంటాయి. వాలెంటైన్ డేన మీకు మీ లవర్ దూరం అయ్యిందని ఫీలవడం కన్నా.. అలాంటివి లవ్‌లో కామనే అని తెలుసుకోండి. ఎందుకంటే ఇది కమర్షియల్ వరల్డ్. రిలేషన్స్‌షిప్‌పై ఫీలింగ్స్‌తో పాటు, చాలా ఇష్యూలు ప్రభావం చూపిస్తుంటాయి. అవసరాన్ని బట్టి బంధాలను మార్చేస్తుంటాయి.డ్రస్స్ లను మార్చినంత ఈజీగా బాయ్ ప్రెండ్స్ ను మార్చే అమ్మాయిలున్నారుఎదుటి వాళ్ళ మనస్సులతో వాళ్ళు ఆడుకుటారు ..వీళ్ళో శాడిస్టులు. సో.. లవ్ ఫెయిల్ అయిందని ఏ మాత్రం ఫీల్ కావద్దు.చాలామంది లవ్ ఫెయిల్ అయితే.. జీవితం కోల్పోయామనుకుంటున్నారు. ఆ కోపంతోనే..దాడులకూ దిగుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలనూ తీయడానికి ట్రై చేస్తున్నారు. హంతకులుగా మారుతున్నారు. మన రాష్ట్రంలో ఇలా ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, తృటిలో తప్పించుకున్న అమ్మాయిలు ఎంతోమంది. మరి ఇదేనా ప్రేమంటే.. ? అంతవరకూ ఎంతో ప్రేమించి.. అప్పటికప్పుడు ప్రాణాలు తీయాలని ఎలా అనిపిస్తుంది..?
అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమలో పడ్డవారు ఎప్పుడైనా ఆలోచించారా..? లవర్‌ను ఎప్పుడూ చూడాలనిపించడం, వాళ్లతో వీలైనంత వరకూ గడపడం.. సరదా షికార్లకు వెళ్లడం.. అంతేనా...? అంతవరకే అయితే అది ప్రేమ కానే కాదు. జస్ట్ అట్రాక్షన్. అది వయస్సుకు సంబంధించింది మాత్రమే గానీ.. మనసుకు సంబంధించింది కాదు. మీరు మనసుతో ప్రేమించి ఉంటే.. మీరు ఎప్పుడూ అలా ప్రవర్తించరు.
ఇక ప్రేమలో గెలవలేదని మనోవేదనకు గురై.. ఎంతోమంది తమ జీవితాలను ముగిస్తుంటారు. అదీ కరెక్ట్ కాదు. ఎందుకంటే.. మనకు ప్రేమ దక్కలేదంటే.. అది ఎదుటివారి లోపం అనుకోవాలే తప్ప.. మన లోపం అనుకోకూడదు. ఒకరు కాకపోతే మరొకరు. ఈ ప్రపంచమేమీ చిన్నబోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి కోసం ఎదురు చూడండి.
ఇక ప్రేమించడానికి, లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డే మాత్రమే ఉందనుకోకండి. మీలో ఎప్పుడు ఫీలింగ్ వస్తే అప్పుడే వాలెంటైన్ డే. మీకు నచ్చిన మనిషిని.. మిమ్మల్నీ మెచ్చితే ఆ రోజే ప్రేమికుల రోజవుతుంది. ఎక్కడినుంచో వచ్చి పడ్డ ఈ రోజును తలచుకుని ఏ మాత్రం బాధపడకండి. మీ వాలెంటైన్‌డేను మీరే సృష్టించుకోండి.చెప్పడం ఈజీనే అనుబవిస్తే తెలుస్తుంది అసలు భాదంటే అంటారు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు... మరి ఎవరి భాద వాళ్ళని నిర్నయించడానికి మనం ఎవరం కదా...?
Labels:
జరిగిన కధలు