Thursday, February 17, 2011
ఎడబాటు ఎన్నాళ్ళు అంటే..ఓ జీవితకాలం అని తేలిపోయింది
వేకువజాము పక్షుల కిలకిల రావాల చప్పుల్లు ఒకప్పుడు..హాయిగా
ఇప్పుడు అవేపక్షుల కిలకిల లు వినలేకపోతున్నా..ఎందుకీ తేడా..
ఒకప్పుడు ఇష్టాలన్నీ కష్టాలుగా ఎందుకు మారుతున్నాయి..
ఎక్కడో అలజడి..రోజులు గడచాయి..నెలలు దాటుతున్నాయి..
అదే వాతావరనం అదె మనుష్యులు మరి ఎక్కడొచ్చింది తేడా..?
గుండెళ్ళో గుబులుకు కారణం తెలుసు..పాతరోజులు తిరిగి రావని తెల్సు
జరిగింది నిజమే అని తెలుసు..గతం ఎప్పటికి తిరిగి రాదని తెల్సు..
.... మనుష్యులకు మనస్సనేది లేకుండా ఎందుకు పోతోంది..
గతం గడచిపోయినా ...వాస్తవం వెక్కిరిస్తున్నా...నిజాయితీకి చోటులేదు..
ఎదురు చూపులో తేడాలేదు..ఎడబాటు ఎన్నాళ్ళు అంటే..ఓ జీవితకాలం అని తేలిపోయింది