అదే చీరకట్టు అదే అందం గుండెల్లో గిలిగింతలు..
ఆదే చీరకట్టులో..పాత జ్ఞాపకం..
ఒకప్పుడు ఇదే చీరలో మనసుకు ఆమనిషి దగ్గరగా
ఇప్పుడు అదే చీరలో అదేమనిషి మనసులో ఉన్నా మనిషి దూరంగా
కొన్ని జ్ఞాపకాలు మదిలో సిధిలంగా నిలచిపోతాయి..
ఆ తలపులు మనస్సులో చక్కిలిగింతలు రేపుతాయి
కొందరిని గుర్తు చేసుకునేందికు..జ్ఞాపకాల పందిరిని కదిలించినప్పుడు..
మసస్సు భాదతో విలవిల లాడుతుంది..కారణం చెప్పుకోలేం
కదిలాడే జ్ణాపకాలు కన్నుల్లో కన్నీరు తెప్పిస్తున్నాయి..
అప్పటి జ్ఞాపకాలు మనస్సులో ఎప్పుడూ కదిలాడుతూనే ఉన్నాయి..
ఎదో చేయాలనే తపన ఏమీచేయలేని నిస్సహాయత
ఎదోటి చేసెయ్ అని మనస్సు హెచ్చరిస్తున్నా ...ఏమీ చేయలేన్ని పరిస్థితి