కలువలు సైతం కల్లార్పకుండా చూస్తాయి...నీ కన్నుల సోయగం చూసి
గులాబీ లు సైతం సలాం అంటున్నాయి...నీ పెదవుల ఎర్ర దనాన్ని చూసి
పండువెన్నెల సైతం పరవసిస్తుంది...నీ చిరు మందహాసాన్ని చూసి
తేనే మాధుర్యం తక్కువనిపిస్తుంది...నీ పలుకులలో తియ్యదనం చూసి
చందమామ కూడా చిన్నబోయింది ...నీ మోము ని పరిశీలనగా చూసి
సరిగమల కి కూడా గతి తప్పుతుంది ...నీ నడకలోని హొయాలను చూసి
ఇంద్రధనస్సు కూడా మైమరచిపాయింది ...నీ మేని విరుపులు చూసి ...
అను నిత్యం నను కలలో వేధించే అతిలోక సౌందర్యమా ...ఇంతకీ నీవెక్కడ ..ఒక్కసారి కనిపించుమా ప్రియా