Tuesday, February 15, 2011
ఆజాత శత్రువులా ఉన్న నేను ఆశత్రువు చేతిలో ఓడి పోయా..?
ఎందుకో ఈ మద్యి పాతజ్ఞాపకాలు కంగారు పెడుతున్నాయి..
నీ తలపులు గుర్తుకొచ్చి గుండె వేగంగా కొట్టుకుంటుంది..
కారణం అడక్కు ఆ రోజులు పోయాయి తిరిగొస్తాయన్న నమ్మ లేదు..
నీకు అస్సలు గుర్తుకొస్తానా అని తలచుకొంటే..గుండెళ్ళో దడ..
గుండెళ్ళో గాయం బాగా పెద్దది అయినట్టుది..రోజు రోజుకి భాద పెరుగుతోంది..
ఆ గాయానికి ఎన్నోరకాలుగా మందులు వేసి తగ్గిందుకొందామని ట్రైచేసి ఫైల్ అయ్యా..
విషాదం గుండెల్లో చేరి ఆగాయాన్ని ఇంకా పెద్దది చేస్తుంది..
ఒక్కోసారి అనిపిస్తుంది నీవు నాకు అస్సలు గుర్తుకు రాకుండా ఉండాలంటే ..
ఎంచేయాలో నిన్నే అడిగితే అని..అంతదైర్యం చేయలేనని తేలింది..
గుండెలొ ఉప్పొంగే దుఖం కన్నీటి బొట్టులా జారుతున్నాయి..
నులి వెచ్చని ఆకన్నీరు కూడా బాధను దూరం చేయలేక పోతుంది..
ప్రతి క్షనం నీతలపులు తో పైకి ఆనందంగా ఉన్నట్టు నటించ లేకపోతున్నా..
నీవు దూరమైన గడియలు ..నీ తలపులు నన్ను శత్రువులా వెంటాడుతున్నాయి ..
మరి ఆ శత్రువునుంచి దూరంగా పరిగెత్తూన్నా వెంటాడుటూనే ఉంది ..
అ శత్రువు నన్ను వదిలేట్టు లేదు నా అంతం చూసేవరకు...
నా రక్తం కళ్ళ్ చూసేవరకు అది నిదుర పోయేట్టు లేదు మరి..
ఇప్పటి దాకా ఆజాత శత్రువులా ఉన్న నేను ఆశత్రువు చేతిలో ఓడి పోయా..
Labels:
కవితలు