Monday, February 14, 2011
ఆత్మకి చావు వుండదు.. మన స్నేహానికి కూడ చావు వుండదు..
నా ప్రీయ మైన నెస్తమా...!
నా చుపూ నీ కొసం ఏదురు చుస్థుంది...
నా స్వసా నీ కొసం తపిస్తుంది...
నా ప్రతి ఆశ నువ్వు గొప్ప వ్యక్తివి కావలని..
నా ప్రతి రక్తపు బొట్టు నీ కొసం చిందిస్తాను..
నా తుది స్వసా వదిలె వరకు నిన్ను మరవను..
ఆత్మకి చావు వుండదు.. మన స్నేహానికి కూడ చావు వుండదు..
నీ కొసం తపిస్తున్న ఈ స్నేహితుడిని మరవకు......................
"ఎవరు నువ్వు అని నన్ను అడిగితే -
ఏమని చెప్పను నా గురించి నేను...
ఇన్నేళ్ళ ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెను తిరిగి చూస్తే
నా ఈ జ్ఞాపకాల దొంతరలో
ఎన్నో అనురాగాలు,ఎన్నో మమకారాలు
ఎన్నో ఏవగింపులు,ఎన్నో ఈసడింపులు..
ఏమి సాధించానని నన్ను నేను ప్రశ్నించుకుంటే -
అసలు ఏమీ సాధించావంటు ఈ ప్రశ్న అని
నా అంతరంగం నవ్వుతుంది నన్ను చూసి..
చిత్రంగా లేదు -
కనీసం నా అంతరంగాన్ని అయినా సమాదానపరుచుకోవాలన్న
పట్టుదలతో ముందుకి సాగుతున్నాను......
ఒంటరితనం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది అంటారు -
కాని అదే ఒంటరితనం నిన్ను నువ్వు తెలుసుకోవాడానికి,
నిన్ను నువ్వు మలుచుకోవాడానికి దొరికే సమయం అంటాను నేను...
ఈ ఒంటరితనపు నిశీదిలో
నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది అంటారు -
కాని అది నన్ను వెక్కిరిస్తుంది
నిన్ను నువ్వు తెలుసుకుంటు ఎన్నాళ్ళు ఇలా అనీ..
పాపం దానికేమి తెలుసు -
మనిషి ఆశకు అంతం ఉండదని
ప్రపంచం ఎంత తెలుసుకున్నా చేరని లోతు బావి అని....
అణువు అణువున స్వార్ధం నిండిన ఈ ప్రపంచం మీద నాకు -
ఏదో తెలియని ఆవేశం
ఏదో తెలియని ఆక్రొశం
ఏదో తెలియని ఆవేదన...
కాని -
రేపు ఎప్పుడు నిన్న లాగ ఉండదని నాది ఒక చిన్న ఆరాటం
రేపటీ ఆ వెలుగు కిరణాల కోసమే నా ఈ గమ్యం లేని ప్రయాణo
Labels:
కవితలు