Monday, February 7, 2011
ఉప్పెనలా జీవితంలో ప్రవేశించి సముద్రపు అలలా వెళ్ళిపోయావు..
నీ జ్ఞాపకాల తీరంలో నీ అనుభూతుల కూర్చున్నాను ఒంటరిగా
ఆశనిపాతంలా వస్తున్న జ్ఞాపకాల జడివానలో తడిసిపోతున్నా నిజం కాని వాస్తవంలా
నీ కోసం నాలో రగిలే విరహ ఆవిరిని చల్లార్చలేక
చూస్తున్నా ఆకాశంవైపు దీనంగా అక్కడ తారలా ఉన్ననిన్ను అందుకోలేక ..
నీ నవ్వులు పూదోట లో పూవులేమయ్యాయి మిత్రమా..
అస్సలు నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రానా..
ఎన్నోసార్లు అనుకున్నా అస్సలు నీపరిచయంలేకుంటే..
ఉప్పెనలా జీవితంలో ప్రవేశించి సముద్రపు అలలా వెళ్ళిపోయావు..
నీకిది న్యాయమా అని అడిగేంత దూరంలో ఉన్నావు..
ఏం అడగాలాన్నా ఏంచెప్పాలన్నా వినే స్థితినుంచి దూరం అయ్యావు
ఎప్పుడైనా మనస్నేహం గుర్తుకు వచ్చి నీవు నాతో మాట్లాడాలనుకున్న
నీకు ఎప్పటికీ అందనందూరం ....శాశ్వితంగా
Labels:
కవితలు