Thursday, February 17, 2011
ఒక అందమైన రాక్షశివి..ముళ్ళులున్న గులాబి పువ్వువి
కల ఒక జ్ఞాపకం
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది
జ్ఞాపకం ఒక కల
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది
కలలాంటి జ్ఞాపకం
జ్ఞాపకం లాంటి కల
నువ్వే....
నువ్వెవరో...
అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా
కానీ నీదయిన రూపం నీకుంది..నీకు దయలేదు..
నీ ఒక అందమైన రాక్షశివి..ముళ్ళులున్న గులాబి పువ్వువి
ప్రతిక్షణం నీ ఆలోచనలే చుట్టుముడుతుంటే
కించిత్ ఆలోచనలు లేకుండా ఎలా ఉంటున్నావు
నువ్వే నా మనసనుకున్నా ..ఆ విషయం తెలుసు నీకు
వేకువఝామున నిద్దుర లేపే పిల్ల తెమ్మెర ఒకప్పుడు
నా ముంగిలి తాకే తొలి సూర్యకిరణం నువ్వు ఒకప్పుడు
నా కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళం నువ్వు ఒకప్పుడు
రాత్రంతా నన్నల్లరి పెట్టే వెన్నెల నువ్వు ఒకప్పుడు
మరిప్పుడు ఎమైయ్యావు..ఎక్కడున్నావు
ఎప్పటికైనా వస్తావని ఎదురు చూస్తూ..?
Labels:
కవితలు