Thursday, February 24, 2011
మనసులో అలజడి.. నీ జ్ఞాపకాలు......శత్రువుల్లా వెంటాడుతున్నాయి
అదే జ్ఞాపకం..మనసులో అలజడి
మనస్సుని తడుముకుంటూ..నిన్నే తలచుకొంటూ
కల్సిసాం ..విడిపోయాం
క్షణం క్రితమే..అన్నీ జరిగినట్టుగా ఉంది
ఎందుకు జరిగిందో అలోచించే లోపు అన్నీ జరిగిపోయాయి
గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో మనసుతో వెతకమని..
వెతికితే కనిపిస్తావేమోకాని అప్పటి నా మనిషిగా కాదు..
అప్పుడు మిత్రుడిని ఇప్పుడు శత్రువు నయ్యాకదా..?
నీ గుర్తులు గుండెళ్ళో గునపాళ్ళా గుచ్చుకుంటున్నాయి...
నా మనస్సు హెచ్చరిస్తూనే ఉంది...నీవు జ్ఞాపకమే నని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని...అది నావళ్ళ కాదు అని తెల్సినా
నేను వేసే ప్రతి అడుగులో..తీసే ప్రతి శ్వాసలో నీ జ్ఞాపకం
నేను చేసే ప్రతి పనిలో నీజ్ఞాపకం..శత్రువుల్లా వెంటాడుతున్నాయి
నాకు.నీవు ఎందుకంత దూరం అయ్యావో తెలీదు
మనస్సులో ఉన్నావు... నివు దూరం అయ్యేంత తప్పు నేనేం చేశాను
నీవు ఎప్పుడూ మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో తెలుసా
కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి నీతో మనస్సు విప్పి మాట్లాడాలని
ఎదురుచూస్తున్నా...నిస్సహాయంగా దీనంగా నీకోసం అయినా నీకు జాలి కలుకదా ప్రియా...?
Labels:
కవితలు