Tuesday, February 22, 2011
నిన్ను గెలిపించడంకోసం నేను ప్రతిక్షనం ఓడిపోతున్నా
నిన్ను గెలిపించడంకోసం నేను ప్రతిక్షనం ఓడిపోతున్నా..
నాకు ఓటమితో భాదలేదు..నీగెలుపే నాకు ముఖ్యిం
నిన్ను గెలిపించడం కోసం నన్ను నేను కోల్పోతున్నా..
అదిఎంతలా అంటే ..నేను జీవించలేనంతగా..
జీవించాలని లేదు...జీవించి సాదించేదేమిటి నీవులేకుండా..
నిన్ను గెలిపించే క్రమంలో నేను ఎప్పుడో చచ్చిపోయాను..
బ్రతికున్న శవంగా మారిపోయాను నీకు తెలుసా..
నీవు విజయంసాదించావు ...నేను ఓటిపోయాను
నీకు విజయం శాస్వితం..నాకు ఓటమి శాశ్వితం..
నీది నూరేళ్ళ జీవితం..నాది మద్యిలోపోయే ఊపిరి?
నీకు ఎప్పుడైనా ఒక్కసారైనా గుర్తుకు వస్తానా..?
ప్రతిక్షనం మదన పడుతునా తెల్సా...?
నీ కన్నీ తెల్సు..అయినా తెలియనట్టు నటిస్తున్నావు..
ఇలా ఆలోచించి కంట కన్నీరు ఇంకి పోయేంత భాదపడటం తప్ప ఏమీచేయలేను..
రాత్రుల్లు నిదుర కోల్ఫోయాని...చిమ్మచీకటే నా నేస్తం..
చీకట్లో...ఎన్ని సార్లు వెతుక్కుంటానో తెల్సా నీకోసం..
నీవు అక్కడ లేవని తెల్సినా ..నా వెతుకులాట మాత్రం ఆపను
Labels:
కవితలు