మనం ఏం చేస్తున్నామో అర్దం అవుతోందా..మనుషులుగా ఎన్నో కోల్పోతున్నాం..నేను మేము అనే పదాళ్ళోనుంచి బయటకు రాలేకపోతున్నాం..అంతా స్వార్దం పక్క వాడికి ఏమైతే నాకేంటి అనే కుంచిత స్వభావం మనసుల్లో పెట్టుకొని పైకి కి పెద్ద మనసు ఉన్న పెద్ద మనుషుల్లా బిల్డప్ స్తున్నాం.తనదాకా వస్తేనే అది ప్రాబ్లం గా కనిపిస్తోంది మనకు ఎదుటి వానికి వస్తే అవునా అని పక్కకు తప్పుకుంటాం..కారణం మన మనసులు కల్మషం అయ్యాయి...మంచి అనే ముసుగు..వేసుకొని తిరుగుతున్నామే కాని చుట్టు పక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడంలేదు..మన సమాజంలో చుట్టూ ఏం జరుగుతున్నాయో ఓ సారి మనసున్న మనిషిగా చూడండి..అనేక భాదలు వ్యధలు కనిపిస్తాయి..రోడ్ల్ పై తెగిన గాలి పటాల్లా తిరుగుతున్న చిన్నారులను చూశాం కదా ఏరోజైనా వారిగురించి ఒక్కసారైనా ఆలోచించామా..ఎవరు వీళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని మన పిల్లవాడు బాగా చదువుకోవాలి మంచిగా హాయిగా జీవించాలని ఎన్నోచేస్తాం మన జీవితాన్ని దార పోస్తాం అది మన ధర్మం..మన పిల్లలు హాయిగా ఉంటున్నారు మరి ఇలా వీధిలో తిరుగుతున్న చిన్నారులు ఎవరు...ఎక్కడినుంచి వచ్చారు అని ఒక్కసారి అన్నా ఆలోచించామా లేదు మనక్కి అంత తీరిక ఎక్కడిది..
కారనాలు అనేకం..ఇంటినుంచి బయటికి వస్తున్న చిన్నారులు గమ్యింతెలియక అనేక అలవాట్లకు గురౌతున్నారు...తల్లిదండ్రుల ఆలనా పాలనా కరువైనప్పుడు...వీదుల పాలవుతున్న చిన్నారులు ఎందరో...ఒక్క హైదరాభాద్ లోనే వేలల్లో దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటున్నారు..మరి విరిని అసాఘిక శక్తులుగా చూడవలసిందేనా...ఒక్కసారి వారి జివితాల్లోకి తొంగిచూసే ప్రయత్నంచేస్తే ఎన్నో బయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి...నేను ఈ ష్టోరీని 6 సంత్స్రారాలక్రితం చేశాను కాని అప్పటికి ఇప్పటికి సమాజంలో ఎలాంటి మార్పులేదు..వీధిబాలలు పెరుగుతూనే ఉన్నారు కొన్నిస్వచ్చంద సంస్థ్జలు పనిచేస్తున్నా...పెరుగుతున్న వీధి బాలల జివితాలు బుగ్గిపాలవుతూనే ఉన్నాయి..........ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇలాంటి వీధి బాలలను ఆదుకోవలసిన అవసరం ఎంతైనాఉంది..ఆ వీధి బాలలు తల్లిందడ్రులను వదలి విదుల్లో ఎలాంటి కష్టాలు అనుబవిస్తున్నారో ఒక్కసారి మీరే చూడండి....