Saturday, February 5, 2011
మనసులో గందరగోళం..కంటినుంచి దూకుతానంటున్న కన్నీరు ఆగేదెలా..?
మనసులో గందరగోళం..కంటినుంచి దూకుతానంటున్న కన్నీరు ఆగేదెలా..?
అనునిత్యం నా కన్నుల్లో నీ రూపం కదిలాడుతూ ఉంటుంది
క్షణం నీ తలపులతో నే ఆలోచనలు తిరిగాడుతున్నాయి..
మనం కలిసిన క్షానాల జ్ఞాపకాల పేజీలు ఎప్పుడూ మనస్సులో తిరగేస్తూ నేను..
ఒక్కోసారి అనిపిస్తుంది అస్సలు నీకు ఒక్కసారైనా గుర్తుకు వస్తానా అని..
ఇలా నా ఆలోచనల సాగుతూనే ఉంటాయి...ఎందుకో ఒక్కోసారి..
మనం కలిసిన క్షానాలనుంచి..విడిపోయిన పరిస్థితులు తలచుకోంటే..
కంట కన్నీరు ఎప్పుడు బయటికి దూకుదామా అని చూస్తాయి..
అపుకున్నా ఆగనంటున్నాయి..
మనం కలిసే అవకాశం లేదని కనీసం ఓ మంచి స్నేహితులు గా ఉండే అవకాశంకూడా లేదా..
ఒకప్పుడు నిన్ను తలచుకున్నప్పుడు..మనస్సు ఆనందంతో ఉరకలేసేది..
కాని ఇప్పుడు భాధతో మనసు అంతా గందరగోళం అవుతుంది.
ఇదిక సమాదానం లేని ప్రశ్నేనా..పరిష్కారంలేని ....?
Labels:
కవితలు