Friday, February 11, 2011
....సమయం 12 గంటలైంది ఇప్పుడే... అర్ద్ర్రరాత్రి
ఈ రోజెందుకో మనసు చాలా కలవర పడుతోంది..
ఇది మద్యిరాత్రి చూట్టూ చిమ్మ చీకటి..
నా మనసులో కమ్ముకున్న వేదనలా..
కునుకు తీద్దాం అంటే కలలు కవవర పెడుతున్నాయి..
కంట కన్నీరు నా మీద కసి తీర్చుకుంటుంది..
పిచ్చివాడా నీవెప్పుడం టే అప్పుడొచ్చేది నేనే అని కన్నీరు చెబుతోంది..
ఎన్ని సార్లు నిన్ను తలచుకున్నా వచ్చే ఆ కన్నీరు కూడా రావడం లేదీరోజు...
నీకే కాదు అందరిని లోకువయ్యాను..కదా..?
నిన్ను చేరడానికి గమ్యిం ఎంత దూరం వున్నా రావలని ఉంది..
అసలు ఆగమ్యాన్నే లేకుండా చేశావు..ఎక్కడికి రాను మిత్రమా..
నన్ను అస్సలు ఇబ్బంది పెట్టవు ..అర్దం చేసుకునే మనస్సు ఉందని
అని నన్ను నీవంటుంటే..మనస్సు గాలిలో తేలిపోయేది...
....అప్పుడు అదే మనిషి అదే మనస్సు..
ఇప్పుడు ఎమైందని నామనస్సు ప్రశ్నిస్తుంటే నాదగ్గర సమాదానం లేదు..
నిన్ను అడిగి తెల్సుకునే అర్హత లేదని ఎప్పుడో తేల్చావు..
....చూశావుగా ఈ నిశరాత్రి ఎంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు..
....సమయం 12 గంటలైంది ఇప్పుడే అర్ద్ర్రరాత్రి అయింది
....అందరు ఆదమర్చి నిద్దుర పోతున్నారు నీతో సహా..
నేను మాత్రం నీ ఆలోచనలతో వెర్రిగా..నామీద నాకే అసహ్యిం చేసేలా..
Labels:
కవితలు