నా ప్రేమ నవపారిజాతం..పలికింది ప్రియ సుప్రభాతం..మెలోడి బీట్ ట్రాజెడీ ఫీల్ తో సాగే పాట చాలా బాగుంటుంది..ఇది కుడా నాకు చాలా ఇష్టం ఎందుకో ఈ రోజు పాతపాటలు తిరగేస్తుంటే ఇవన్నీ గుర్తుకు వచ్చి అన్నీ బ్లాగ్ లో పొష్టు చేస్తున్నా..ఈ పాటలంటే నాకు చాలా ఇష్టం మనస్సుకు నచ్చిన పాటలు ...మనసు బాగోనప్పుడు ఇలాంటి పాటలు వింటే కొంచెం రిలాక్సుగా ఉంటుంది కదా .... అది ఇష్టమైన మెలోడి సాంగ్స్ అందరికి నచ్చక పొవచ్చు కాని ఈ పాటలంటే నాకు చాలా ఇష్టం ఇద్దరు నిజమైన ప్రేమికులు దూరంగా ఉండి గతాన్ని గతంలో తమ ప్రేమను గుర్తుకు తెచ్చుకునె పాట ఇది నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం ...నీ ఎదవీన పై మనకద వీన మీటగా అనురాగం పలకాలి నూరేళ్ళ బందాన్ని కానా అంటూ సాగుతుంది..ప్రేమ అనేని ఇప్పటిది కాదు ఏళ్ళు గడిచినా నిజమైనా ప్రేమ శాశ్వితంగా ఉంటుంది అనే లైలో సాగుతుంది బేసికల్ గా ట్రాజేడీ బీట్ కాని పాత జ్ఞాపకాల దొంతరలో హీరో హీరో యిన్లు గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పాడుకునే పాట.. వేదంలా స్నేహంలో యుగాలు క్షనాల్లా గడుపుతూ సాగాలి ప్రేమ అంతు సాగుతుంది నిజమేకదా నిజమైన ప్రేమను ప్రేమికులు ఇలాగా ఫీల్ అవుతాను ..అనుకుంటాను ఈ జన్మలో ప్రేమించి కోవడం అంటే గత జన్మ బందమే ఈ జన్మలో ఇలా ముడి పడుతుంది అంటారు నిజమే కదా..?నీ ప్రేమలో మునిగిపొయి ప్రపంచాన్నే మర్చిపొతాను అనేది కూడా వాస్తవమేకదా ట్రాజిడీ బీట్ అయినా..ఈ పాట విడియో చూడండి ప్రేమికులు తాము గతంలో ఎలా ఏంజాయి చేశారో తమ ప్రేమలో ఎలా మునిగి ఆనందాన్ని పంచుకున్నారో చూపిస్తారు ...ఇలా ఉండాలి నిజమైన ప్రేమికులు అన్నా నిజమైన స్నేహితులు అయినా సరే ఆ పాట వింటూ ఆ వీడియోసాంగ్ మీరు చూడండి ఫీల్ అవండి