చిరంజీవి సినిమాల్లొ ఇదో మంచిసాంగ్ మనసుకు సంబందించి తన లోని భావాలు మనస్సుతో పొలుస్తూ పాడే పాట ...నిజంగా చాలా అద్బుతమైన పాట..మనస్సులో ఉప్పొంగే ఉప్పెనలను లోలోపలె పేరుక పోయిన భాదను ఈ పాట రూపంలో వ్యక్తంచేసినట్టూంటుంది..ఇష్టమైన వాళ్ళు కనిపిస్తున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే ఈపాటే పాడాలనిపిస్తుందేమో అనిపిస్తుంది మాటల్లో చెప్పలేని భావాలు పాటరూపంఅంటే ...ఇలాగే ఉంతుంది కదా..? మీరు ఆపాట పాడుకోవాలనిపిస్తే ఇక్కడ ఉండి చూడండి ఆపాటలో "ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ...తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందికలగాని... కల ఏదో... కళ్లెదటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది..." చూశారా ఎంత అద్బుతంగా ఉందో ఆపాట పదాల అమరిక ప్రతిక్షనం గుండేల్లో అలజడుల ప్రతిరూపమే ఈ సాంగ్..ఇంకా ఈపాటగురించి ఏదో చెప్పాలని ఉందికాని..మాటలు రావడంలేదు..అంత అద్బుత మైనపాట ఇది
పల్లవి :
అరె! ఏమైందీ... అరె! ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ...
తన మనిషిని వెదుకుతు
ఇక్కడొచ్చి వాలింది
కలగాని... కల ఏదో...
కళ్లెదటే నిలిచింది
అది నీలో మమతను
నిద్దుర లేపింది... ఆ ఆ ఆ... ॥
చరణం : 1
నింగి వంగి నేలతోటి
నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగి కోసం
పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు
పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు
నింగిైవె పు చూపులేదు
కన్నెపిల్ల కళ్లలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావే... ఓ...
చరణం : 2
బీడులోన వాన చినుకు
పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన
పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు
గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే
పాట నీవె రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు
వీడు మారిపోతాడు
మనిషౌతాడు...
ఆ అద్బుత మైన పాట తాలూక వీడియో చూడండి ..నిజంగా మనసు ఉన్న మనుషులైతే నిజంగా ఎవ్వరిని అయినా ప్రేమించి ఉంటే కంట కన్నీరు రావల్సిందే..