Saturday, February 5, 2011
ప్రేమా ప్రేమా..ఎక్కడ వెదకను నీచిరునామా.....?
ప్రేమా ప్రేమా ప్రేమా, ఏదమ్మా ఎక్కడ వెదకను నీచిరునామా...
ప్రేమా ప్రేమా ప్రేమా, రాస్తుందా ఈతరం రక్తాక్షరాల వీలునామా...
సుకుమారపు కుసుమాల కుత్తుక తెగవేతలోనా?
ధరణిని తలపే తరుణి దహనపు దావానలంలోనా?
ఎక్కడ దాగింది నీ కొత్త చిరునామా ?, ఏమని చెబుతుంది నయా శవపంచనామా?
ప్రేమంటే తనదూరంతో తరిగిపోయేది కాదని
ప్రేమంటే తనుకాదన్నా చెరగిపోయేది కాదని
ప్రాణం పోసేది ప్రాణం పంచేది ప్రేమనీ ...
ప్రాణం తీసే దారుణమారణ శాసనం ప్రేమేకాదని దానికి ఆపేరేవలదని
ప్రేమనిండిన గుండెకు ప్రేమించడమే తెలుసని, ప్రేమనుపంచడమే తెలుసని
వెర్రి గొంతుకతో కసాయి గుండెలు కరిగేలా...విలపించనీ వినిపించనీ విన్నవించనీ...
రాఖీ..
Labels:
కవితలు