Sunday, February 20, 2011
కనులు మూసినా చెలి కన్నులలో మేదిలేను ఓ కమ్మని కల
ఓ నిండయిన జాబిలి
నిండు పున్నమివేళ ఓ నిండయిన జాబిలి
చెలిమి చేసింది ఓ చందమామ కౌగిట ....
అమావాశ్య నల్లటి మబ్బులు చంద్రుని దాచిన వేళ
ఒంటరి అయి నిశ వీదులలో అభిసారికలా ప్రియుని జాడకయి పరుగులు తీసింది ,
దోబుచులటాలని వెతుకులాడింది వెంపర్లడింది.
చివరకు ఓ చోట సోమ్మసిల్లింది.
నిద్రాదేవి కలతలన్నీ కరిగిపోయేలా లాలించగా
కనులు మూసినా చెలి కన్నులలో మేదిలేను ఓ కమ్మని కల
వినీలకసపు నేపధ్యం లో మేఘాల రధం మీద
నక్షత్రాలను కోసుకుంటూ వెన్నెలను పాత్రలో నింపుకొని
తనకోసమే తీసుకు వస్తున్న తన ప్రియుని చూసి మురిసి పోయింది
మైమరిచిపోయింది. అ మైమరుపులో తననే మరిచిపోయింది..
ఆ కల కరిగిపోయింది నా చెలి నిదురపోయింది.
నా చెలిని నిదురలేపలేక , తను లేచేవేళకోసం
ఎదురుచూస్తూ తన సమాధి వద్దే నిలిచి ఉన్న ........