ఏదివిలొ విరిసిన పారిజాతమో..ఏ కవిలో వెలసిన ప్రేమగీతమో....ఓ అద్చుత సౌందర్యాన్ని గమనిస్తున్నానీమద్యి...నిజంగా ఈ పాట వింటున్నప్పుడు ఈమెకోసమే రాశాడా ఆ సినిమా రచయిత అన్నట్టు అనిపిస్తుంది...తను పరిచయమే ఇంతకుముందు కాని ఈమద్యి చూపుళ్ళో మాటల్లో అమె ఎందుకో అంత సౌందర్యింగా కనిపిస్తుంది నాకు..అయితే ఏదివిలొ విరిసిన పారిజాతమో పాట చాలా పాతది 1973 లో కన్నే వయస్సు అనే నిమిమాలోది పాట పాటల్లో మంచి మెలోడీ మెలోడి మ్యూజిక్ అందించే సత్యం మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సంగీతం ఈ సినిమాలో హైలెట్..
ప్రిముడు తన అంద మైన ప్రియురాలిని గుర్తుకు తెచ్చుకుంటూ పాడే పాట ప్రతి లైన లో ప్రియురాలి అందాన్ని వర్నిస్తూ..అమె పై ఉన్న ప్రేమను తెలిపేసాంగ్ నిజంగా సూపర్ ...ఏదివిలొ విరిసిన పారిజాతమో..ఏ కవిలో వెలసిన ప్రేమగీతమో..నా మదిలో నీవే నీడిపోయెనే..నీరూపమే దివ్యి దీపమై ...అంటూ సాగుతుంది స్మూత్ గా అమె అందాన్ని పొగుడుతూ ..నీనవ్వులే నవ్యితారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే...పాల బుగ్గలను లేతసిగ్గులను పల్లవించగా రావే.. అంటూ చిరుగాలికి అమె ముంగురులు కదలికలను ఎంత బాగా వర్నీచాడో ..నీలీముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే..అమె నడుస్తున్నప్పుడు వినిపించే మువ్వల సవ్వడి గురించి కూడా...కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజ హంసలా రావే..నిదుర పోయేప్పుడూ కలన్నో నీవే వస్తున్నావు ప్రణయంలో ముంచెత్తుతున్నావు అని చెప్పిన విదానం నిజంగా సూపర్... నిదుర మబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణ పై ప్రణ యరాగములు ఆలపించినది నీవే...పదము పదములో మదువులూరగా కావ్యి కన్నెవైరావే..
సన్నగా నాజూక్ గా ఉండే ఆ అమ్మాయిని చూస్తే నాకెందుకో ఈపాట గుర్తుకు వస్తుంది..అందమే కాదు అనుకువ మాటల్లో నిజాయితీ గుర్తుకు వచ్చి ఈపాట అమెకు సూట్ అవుతుంది అనిపించింది..
ఆ పాట తాలూకు వీడియో చూస్తే అర్దం అవుతుంది ఆ రియల్ ఫీల్ ఏమిటో