. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, February 28, 2011

మనస్సాక్షిగా మౌన వేదన ఎన్నాల్లిలా..?



మనస్సాక్షిగా మౌన వేదన ఎన్నాల్లిలా..?
నాలో నేను ఉన్నానో లేనో అర్దంకావడంలేదు....
నాకు నేనుగా ఎమౌతున్నానో అర్దం కావడంలేదు..
మౌనంగా ఉండటంలో ఎంత వేదనో ఇప్పుడు అర్దం అవుతుంది..
వద్దు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు..
ఒకప్పుడు పిలవగానే పలికే ఓ కోయిల ఇప్పుడు ఎంత పిలివాలనుకున్నా రాదేల..
రాని ఆ కోయిల రాగాలు పలికిస్తుందని ఎదురుచూపులో వెర్రితనమే కదా..?
ఎం రాస్తున్నానో ఏం చేస్తున్నానో అర్దంకావడంలేదు...
నిజం ఎప్పుడూ నిజమే ...అబద్దంకూడా నిజమే..
నన్ను నేను ఎక్కడో పోగొట్టుకున్నాను..
నాకు తెలిసిన "నేను" కాదు; ఇప్పుడున్న నేను..
స్పందించే హృదయాన్ని పోగొట్టుకున్నానో..
హృదయ స్పందననే పోగొట్టుకున్నానో..అర్దంకావడంలేదు...
ఎదో అవుతున్నాను ఎమౌతున్నానో అర్దం కావడం లేదు

సహజీవనం లో మోసంచేస్తే...ఖటినమైన శిక్షలున్నాయి..



ఇద్దరు ఇష్ట పుర్వకంగా కలిసి సహజివనం చేయోచ్చు అని సుప్రింకోర్టు జడ్జిమెంటు ఇచ్చింది .... కాని కలిసి కొన్నాళ్ళు సహజీవనం చేసి మోసం చేస్తే ఎలాంటి హక్కులు అమెకు ఉండవని కొన్ని కేసులు తెల్చడంతో..కలిసి ఇద్దరు సహజీవనం చేయడం మోసం చేసిన చేస్తున్న ఘటనలు చాలా వెలుగు చూశాయి ఇష్టపడి అతని తో సహజీవనం చేసిన మహిళ తాను మోసపోయినా ఎలాంటి న్యాయం జరుగక పోవడం తల్లిదండ్రుల వైపునుంచి సపోర్టు లేకపోవడంతొ కోందరు మోసపోయిన మహిళలు ఆత్మ హత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్త...వరకట్నాలు...కట్టు బాట్లు ఇష్టపడని యువత ఇప్పుడు సహజీవనం వైపు మొగ్గు చూపుతున్నారు...తనకు మనసుకు నచ్చిన వ్యక్తితో పేళ్ళీళ్ళూ పేరంటాలు కట్నాలు కానుకలు పెద్దలు పేరంటాలు లాంటి లాంచనాలు లేకుండా తనకు ఇష్టం వచ్చీన వ్యక్తితో కల్సి సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు...ఇద్దరూ ఇష్టపడి సహజీవనం చేస్తున్నా .... సహజీవనానికి ఒప్పుకున్న మహిళ అంటే ఓ రకమైన చిన్న చూపుసూస్తున్నారని భాదిత మహిళళు అంటున్నారు... అనుమానాలతో ఇబ్బంది పెడుతున్నారని అందరిని కాదని సహజీవనం చేయడం తో అతను చెప్పించి కష్టమైనా వినాల్సివస్తుందని వారి ఆరోపన ... ఇలాంటి వేదింపులకు గురైనా సహజీవనంచేస్తున్న మహిళలకు పోలీష్టేషన్ లో కూడా సరైన న్యాయం జరుగని పరిస్థితి ఉంది...సహజీవనం లో సహజీవనం చేస్తున్న మహిలకు ఎలాంటి హక్కులు ఉండవని తెలియడంతో సహజీవనం చేస్తున్న మహిళను వేదించడం కాకా భాదిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి.... ఈ వీషయాల పై రివ్యూచేసిన సుప్రింకోర్టు...తన తీర్పులో కొన్ని మార్పులు తెచ్చింది... బార్యా బర్తలు లాగే కల్సి ఉంటారు కాబట్టి సహజీవనం చేస్తూ మోసం చేస్తే 498/A కేసు నమోదు చేయొచ్చని తీర్పు ఇవ్వడంతో సహజీవనంపేరుతో మోసం చేస్తే ఇప్పటినుంచి ఖటిన చర్యలు తప్పవు దీనికి సదరు మహీళ ఎలాంటి సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు తనతో కలిసి సహజివనం చేసి వేదిస్తునాడన్ ఎదైనా స్థానిక (దగ్గరలోని )పోలీష్టేషన్ లో రిటన్ గా ఫిర్యాదు ఇస్తే అతని పై 498/A కేసు చిటీంగ్ 420 కేసు తనను మోసం చేశాడని ,తనకు న్యాయం చేస్తానని చెప్పిమోసంచేసాడని అతని మీద 493 సెక్షన్ క్ర్రింద కేసునమోదు చేయవచ్చు వీటన్నిటికి ఎలాంటి సాక్ష్యాదారాలు చూపించాల్సిన అవసరం లేదు తాము సహజీవనం చేస్తున్నామని కాని సదరు వ్యక్తి మోసంచేశాడని ఫిర్యాదు చేస్తే చాలు అతని మిద పోలిసులు చర్యలు తీసుకోవచ్చు 1) 498/A గ్రుహహింస సేక్షన్ 2) 420 చీటింగ్ 3) 493 మభ్యి పెట్టడం సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసి సహజీవనం లో మోసపోయిన మహీళను న్యాయం పొందవచ్చు ఎవ్వరైనా ఇలాంటి మోసాగాళ్ళ బారిన పడిన వారు మాకు సమాచారం ఇస్తే మేము వారికి సహాయం చేస్తాము..www.cybercrimehelp.com.లో ఫిర్యాదు చేస్తే సహజీవనంలో మోసపోయిన మహిలలకు మేను సహాయం చేస్తాము..విషయాన్ని పోలీసు ఉన్నతాదికారుల ద్రుష్టికి తీసుకవచ్చి సహజీవనంలో మోసపోయిన భాదిత మహిళలకు అండగా ఉంటాం ఇలానే ఈ రోజు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఓ రిటైర్డ్ సీఐ సహజీవనం పేరుతో మొసం చేసి ఐదో పెళ్ళి చేసుకున్న మహిలకు న్యాయం జరిగేలా చూడటమేకాక అతని వద్దనుంది నెల నెలా మైటనెన్స్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాం సహజివనం చేస్తున్న మహిళలు మీరు ఇక బయపడాల్సిన అవసరంలేదు మిమ్మల్ని రక్షించేందుకు చట్టాలు ఉన్నాయి..మేమున్నాం Dont Worry

చీరకట్టిన నా చెలి.... అందాలు అద్బుతం...పోతపోసిన అజంతా సిల్పం

చీరకట్టు నీకే సోతం ...చీరకట్టులో నిన్నే చూడాలి అంత అద్బుతమైన అందం నీది..పోతపోసిన అజంతా సిల్పం లాంటి నీరూపు చూడటానికి రెంటు క్జళ్ళు చాలవు ప్రియా.. చెంగావి చీరకట్టిన నా చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా? కొంగుమాటున దోబూచులాడే శృంగారం, కనిపించనట్టే కనిపించే సింగారం.. గుబులు రేపకపోతే ఆ చీరకే సిగ్గుచేటు కాదా? ఆ కట్టు... ఆ బొట్టు.. చెంగుమని ఎగిసిపడే ఆ చెంగులు... అందానికి కొమ్ముకాసే కొంగు, సౌందర్యానికే సౌందర్యం కాదా..వన్నెల రాణికి సిరిజోతలను ఏరికూర్చి పెట్టే అందాల పూబోణి చీర.. చీరకట్టిన చిన్నారి వయ్యారంగా నడుస్తుంటే వినిపించే రసధ్వనికి రాయైనా చలించకుండా ఉండేదెలా? చీర కట్టు పవర్ అలాంటిది మరి..కనిపించి కనిపించని అందాలు చూపి చుపనట్టుగా ఊరిస్తుంటే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది మరి అది ఆ చీరకట్టులో అందం..ఊరించే అందాలు ఊరకనే ఉంటాయా మరి మనసులు అల్లాడిస్తాయి మరి.ఇలా చీరలో నా ఇష్టసఖి ని చూస్తే మాత్ర్రం నా మనసు మాటవినదు మరి.. ఆ అందాల ఆరబోతలో చెలిని చీర కట్టుకోనే చూడాలి మరి..ఓ మాట అనకూడాదుకాని ఎదురొచ్చు యుద్దానికి సిద్దమా అన్నట్టు ఉండే ఎదపొంగును తన చాటున దాచే పైట గాలిలి అలా ఎగురుతుంటే ..ఇక చెప్పెదెముంది లేమరి కొందరికి సన్నని నడుము అందాలయితే మరికొందరిని నడుమున కనిపించీ కనిపించని మడతల వయ్యారాలు ఆ చీరకట్టులోనే ఉరిస్తూ కనిపించి కనిపించకా ఊపేస్తాయిమరి....మనసు సఖి ఇలాంటి చీరకట్టులో దగ్గరుకు వస్తే చేతులు ఊరకుంటాయా...ఆగండి ఊహల్లోకి వెళ్ళకండి ఆ చీరకట్టు గురించి ఆ అందాల గురించి డీటైల్ గా తెల్సుకోవాలని ఉందా అయితే ఈ ష్టోరి ఒసారి చుడాల్సిందే మరి



నేను నీవంటూ వేరైఉన్నా..నాకీ వేల నీలోనేనున్నట్టుగా

కొన్ని సంఘటనలు మర్చిపోలేం..అలా మనస్సులో నిలిచిపోతాయి...ఏదైనా ఇష్టం అయిన పని జరిగినప్పుడు ఆ సమయంలో లీలగా ఎదైనా పాట వినిపిస్తే అదే మనసులో నాటుక పోతుంది..ఆ పాట విన్నప్పుడల్లా ఆ ఘటనలు గుర్తుకు వస్తాయి...ఇది అందరికి జరుగుతుంతుందో లేదో కాని నాకు మాత్రం అనిపిస్తుంది..నేను నా ప్రాణంగా ఇష్టపడ్డ నా ఫ్రెండ్ తోఉన్నప్పుడు నా FM Radio లో ఆరంజి సాంగ్స్ వస్తుండేవి...అప్పుడే ఆ సినిమా రిలీజ్ అనుకుంటా..అలా పాట నా మనసులో నాటుక పోయింది..అదే ఆరంజి సినిమాలోని "నేను నీవంటూ వేరైఉన్నా..నాకీ వేల నీలోనేనున్నట్టుగా " ఈ పాటవింటున్న ప్రతిసారి తను గుర్తుకు వస్తుంది..తను గుర్తుకు వచ్చిన ప్రతి సారి ఈ పాట గుర్తుకు వస్తుంది..నిజంగా ఈ పాటలో మంచి ఫీల్ ఉంది..

నేను నీవంటూ వేరైఉన్నా....నేను నువ్వు ఇద్దరం వేరైవున్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా ఉంటుంది..అనిపిస్తూ ఉంతుంది నాలో ఉన్న నీకోసం వెతికేంతగా నీవే నాకంటూ లేకపోతే ఎమౌతానో నీస్నేహంకావాలి..నామీదొట్టు ఇది నిజం నమ్ము నీవు నమ్మాలంటే ఎంచేయాలి ఒక్కసారి నిన్ను చూసాను అంతే కలిసాను ఎలా కలిసామో ఎందుకు కలిసామో స్నేహం చేశాం..ఇంక నన్ను ఎప్పటికీ వీడవుగా అని ఎన్ని సార్లు అనుకున్నానో ......అదే జరిగింది పూడ్చలేని అఘాదం మిగిలించి మన మద్యి నిన్ను ఎంతో ఘాడంగా ఇప్పటికీ ప్రేమిస్తున్నాను నాప్రేమలో నిజాయితీ ఉంది నాప్రేమలో వాస్తవం ఉంది నీ ప్రేమలో పడి మునిగాక నివుదూరం అయినా నాప్రేమలో నీమీద ఉన్న ఇష్టం లో మార్పు లేదు ఎన్ని జన్మలకైనా నీకోసం నా ప్రాణాలు అయినా ఇస్తాను ఇది నిజం.. ఈ పాటలో " నిజానికి ఉన్నోడీని నిజాలన్ని అన్నోడిని అబద్దాలు రుచించని అబ్బాయిని నేను "ఈ విషయం నీకు తెలీదా..? ..ఈ పాటలో " ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరే అని" "ముసుగేసుకోదు ఏనాడు నా మనసు ఓభామ నన్ను నన్ను గానే చూపిస్తా కాదన్నా పోరాడే ఈ ప్రేమ ".." తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షనం విరోదమా ఇవాళ నా ప్రపంచమే నీవే సుమా..ఓ గాలానికే వలేసినా దివే అలా దిగొచ్చినా నాలాంటి మాడిని చూడ లేవు అమ్మా ".." ఒకనాటి తాజ్ మహల్ అయినా నాముందు ఓరిలో ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే ప్రేమ నాదేలే "


ఈ పాటను చదువుతూ పాడుకోవాలనుకుంటున్నారా అయితే ఈవీడియో చూస్తూ పాడుకోండి..

Sunday, February 27, 2011

మాటలు తడబడుతున్నాయి... మనసు మూగబోయింది..




మాటలు తడబడుతున్నాయి... మనసు మూగబోయింది..
మాటలు గొంతుదాటడం లేదు..మనసు ఆరాటం తప్ప..
మాటల్లో చెప్పి మనసు వేదన తగ్గీంచుకోవాలని వుంది
ఆరాటం అవదులు దాటుతున్నా ..అవకాశం చేజారింది..
మనమద్యి అతరం పెగిగించి..అర్హత అడ్డొస్తోంది..
కనీసం ఓ స్నేహితునిగా మాటాడే అర్హ్జత కుడా లేదా
గతం తాలూక జ్ఞాపకాలు..గుండేల్లోనే పదిలంగా ఉన్నాయి
ఇప్పుడు నీతో మాట్లాడే వారికన్నా నేను మంచోడిని కాదా..
నీతో మాట్లాడకుండా ఉండ లేకపోతున్నా..ఎన్నాల్లిలా మౌనంగా
నా పెదాలు దాటే పదాలు..నీహ్రుదయాన్ని చేరేదెలా..
ఏవేచో చెప్పాలని ఉంది..అన్నీ చెప్పి మనసులో భారం దించుకోవలని ఉంది..
నా అర్హత అడ్డొస్తోంది మిత్రమా..ఈ మౌన వేదన బరించలేకున్నా..నా వళ్ళ కావడం లేదు

ఎంత పని చేశావురా బాబు నీవు పెట్టిన (చిచ్చు) మంటలో దహించుకుపోతున్నా




ఎంత పని చేశావురా నివు పెట్టిన (చిచ్చు) మంటలో దహించుకుపోతున్నా...నీకు కావాల్సింది నీకు దక్కింది అనుకున్నది సాదించావు ఎందుకురా జీవితాలతో ఆడుకుటావు..ఇప్పుడు నీవు సాదించింది ఏమిటి...నీవు హేపీగా ఉన్నావు..అందరూ హేపీగా ఉన్నారు.... నీవు కావాలని పెట్టిన మంటలొ..కొంచెం.. కోంచేంగా కలిపొతున్నా ప్యూర్తిగా కుడా ఎప్పుడొ దహించుకుపోతానెప్పుడో..ఓ కుటుంబాన్ని నాశనం చేసి ఏంసాదించావురా బాబు నీవు...బాబు నీది ఓ బ్రతుకేనా...ఇలా ఎదుటి వాడి లైఫ్ తో ఆడుకొని నీవు హేపీగా ఉన్నాను అనుకొంటున్నావు...అది శాశ్వితంకాదని గుర్తుంచుకో..జీవితాల విలులు నీకు అస్సలు తెలియదు అనుకుంటా....బాబు ఫ్యామిలి విలువలు నీకు అసలు తెలీవు అనుకుంటా...బాబు ఇంతా చేసి కనీసం నీకు పచ్చాతాపం కూడా లేదు అంటే బాబు నీ వో శాడిష్టువని అర్దం అవుతుంది...నిన్ను అడ్రస్ లేకుండా చేయడం నాకు పెద్ద పని కాదు నీలాగా నేను కాదు నాకు మనసుంది ఎదుటి వాడు బాగుండాలి అనికొరుకుంటా వాడు నాకు శత్రువైనా...స్నేహితులన వారు కనీసం భాదపడుతున్న నన్ను ఓదార్చడం లేదనే భాద వేదిస్తుంది....అసలు నీవు ఏంచదువుకున్నావు... కవితలు రాయడం కాదు..భావాన్ని భావుకతను ఎదువాని మనసుకు హత్తుకునే లా చెప్పడంకాదు...నిజంగా నిజ జీవితంలో ఎవ్వరిని అయినా భాదపెడుతున్నానా అని ఆలోచించావా నీవు నా జీవితంలో పెట్టిన మంట చిన్నదికాదు..... అది ప్రతిక్షనం నన్ను వేదిస్తూ దహిస్తుంది ఆ మంటలు తట్టుకోలేక ప్రతిక్షనం నేను ఆర్తనాదాలు చేస్తున్నా మౌనంగా వినేవారు లేరు అర్దం చేసుకునేవారు లేరు.ఆ మంటలు తట్టుకోలేక ప్రతిక్షనం నేను ఆర్తనాదాలు చేస్తున్నా మౌనంగా... వినేవారు లేరు అర్దం చేసుకునేవారు లేరు. అర్దంచేసుకోవాల్సిన మనిషి ఎందుకు మౌనంగా ఉందో తెలీదు ....ఎందుకు నాగురించి ఆలోచించాలి నివు హేపీగా ఉండా టానికేగా ఇవన్ని బరిస్తుంది.......ఓ వైపు రగిలిన మంటల్లో కాలుతూ కూడా అగని నీ ఆలోచనలు..ప్రతిక్షనం నివు గుర్తుకు వస్తున్నావు కాని ఏంచేయలేని పరిస్థితి...ఓ వైపు నీ ఆలోచనలు ఎందుకిలా దూరంగా శత్రువుల్లా ఉన్నామాని మరో వైపు ప్రతిక్షనం దహించుకుపొతున్న మంటలు...ఒకప్పుడు హేపీగా ఉండేనాకు ఎందుకిలా జరుగుతుందో అర్దం కావడంలేదు..నాకు తెల్సి నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు మోసం చేయలేదు..ఎమౌతానో అర్దంకావడంలేదు ప్రతిక్షనం ఏంజరుగుతుందో అర్దంకావడంలేదు ఒకటి మాత్రం నిజం ఇలా మంటల్లో దహించుకు పోతూ ఎప్పుడో...పూర్తిగా కలిపోయే రోజు దగ్గర్లోఉందని ఇదినిజం...బాబు నీవు కోరుకుంది అదే కదా..?ప్లీజ్ మరొసారి ఎవ్వరి విషయంలో అలా చేయకు నిగురించి ఆలోచించుకో కాని ఎదుటి వాడ్ని ఎలా నాశనం చేద్దామా అని మాత్రం అలోచించకు ..ఇలాంటివి చేస్తూ.. కవితలు రాస్తు తాను పెద్ద భావుకత ఉన్న వాడినని చెప్పుకోకు వాస్తవంలో జివించు....ప్లీజ్ ఇది నా రిక్వష్టు మైడియర్


http://agnijwaala.blogspot.com/ బ్లాగ్ స్పాట్ లోనిది

Saturday, February 26, 2011

ఈ మందు ఎవడు కనిపెట్టాడోగాని ....?



ఈ మందు ఎవడు కనిపెట్టాడోగాని ....?
మనస్సు భాదగా ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది..
గుండేళ్ళో మంటలు ఆర్పలేదుకాని...
ఆ మంటల్ సెగలు పైకి అనిపించకుండా చేస్తుంది..
తాగేప్పుడు చేదుగా ..
గొంతులోకి వేళ్ళేప్పుడు మంటగా..
గుండేల్లోకి చేరగానే హాయిగా అనిపిస్తుంది..
ఆ మందు గుండెల్లోకి చేరగానే పనిచేయటం ప్రారంబిస్తుంది..
గుండేల్లో వేదన భాదని తన మత్తులో హాయిగా జోగేలా చేస్తుంది..
అప్పుడూ నీజ్ఞాపకాలు మొద్దుబారతాయి...తెలీని మత్తు ఆవరిస్తుంది..
అయినా అప్పుడప్పుడూ ఆ మత్తులో కూడా నీజ్ఞాపకాలు వెంతాడుతూనే ఉంటాయి..
అప్పుడు పెగ్గుల కౌంటర్ పెంచితే..గాని ఊరటరాదు..
అన్నిటికి ఇంగ్లీషు మందులు కనిపెట్టారు..?
మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ...
నీజ్ఞాపకాలు వేదిస్తున్నప్పుడు నాకిప్పుడు ఇదే నేస్తం..
నేస్తం నీవు నాకు దూరం అయ్యావని
ఈ నేస్తాన్ని (మందు) ప్రతిరోజు సాయంత్ర కలుస్తున్నాను ..
నీ గుర్తులు,జ్ఞాపకాలు అన్నీ మర్చిపొవాలంటే ఇంతకు మించిన స్నేహితుడు లేడు మరి నాకు

మిత్రులమైన మనం శత్రువులుగా ఎందుకు మారాం...?



మిత్రులమైన మనం శత్రువులుగా ఎందుకు మారాం...?
ఎవ్వరికి ఎవ్వరూ పరిచయంలేనట్టు దూరంగా ఎందుకిలా..?
కారణం ఏంటాని నా మనసు పొరల్ని తరచి తరచి చూశా ...
అన్నీ ప్రశ్నలే సమాదానాల్లేవు ఎందుకంటే నాదగ్గర నీవు లేవుగా..
ఈరోజు ఉదయాన్నే లేవగానే జోరున వర్షం..ఎందుకిలా..?
అప్పుడెందుకో గుర్తుకు వచ్చావు...ఇప్పుడేంస్తుంటావా అని
గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండేళ్ళో భాద..చెప్పలేనిది..
అప్పుడనిపించింది కాలం మనల్ని విడతీస్తే మబ్బులు ఏడుస్తున్నాయా అని
పోలిక దరిద్రంగా ఉందికదా..నా కంట్లో కన్నీరు లేదిక మరి..
అలా పడుతున్న వర్షం లోకి వేళ్ళాలనుకున్నా ఎందుకోతెలుస్తా..
నా కంట్లో ఉన్న ఆ కాస్త కన్నీరు కారిస్తే వర్షంలో కల్సిపోతుందని..
ఆశ నిరాసే అయింది వర్షంలోకి వెళ్ళగానే వర్షం ఆగింది..
చూశావా ప్రక్రుతి కూడా ఎలా నన్ను వెటకారం చేస్తుందో..
ఇలా నీవు గుర్తుకు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు సాగుతాయి..
ఎంటిలా ఆలోచిస్తున్నానా అని ఒక్కోసారి నామీద నాకే చిరాకేస్తుంది..

ఎవరికి ఎవరు ఈలోకంలో ఎవరికి ఎరుక....?

నిజంగా కొన్ని పాతలు జీవితాలను ప్రతిబంబిస్తాయి....ఆ యా పాటలు రాసే రచయితలు కూడా వాళ్ళు నిజంగా లైఫ్ లో ఫీలయి రాస్తారని పిస్తోంది కొన్నిపాటలు..సిరి సిరి మువ్వసినిమాలోని పాట..ఎవరికి ఎవరు ఈలోకంలో ఎవరికి ఎరుక ఏదారెటుపోతుందో ఎవరిని అడగక..నిజమేకదా...ఎప్పుడూ ఎవరు కలుస్తారో ఎందుకు విడిపోతారో..కార్నాలుండవు అప్పటికప్పుడు క్రియేట్ అవుతాయి పరిస్థితులు ఏంజరిగిందా ని చూసేలోపు అన్నీ జరిగిపోతాయి..ఒక్కటిగా ఉన్న ఆ ఇద్దరు విడిపోతారు ఒకేదారీయినవారి దారులు వేరవుతాయి..వానకురిసి కలిసేది వాగులో వాగువంకలైసేది నదిలో అంటూ జీవితాన్ని చెప్పకనే చెప్పినట్టుంది ఈ పాటలో మీరు వినండి..

జ్ఞాపకాలు..గతాలు దయలేనివి గుర్తుకు వచ్చి మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి...




జ్ఞాపకాలు..గతాలు దయలేనివి ...
గుర్తుకు వచ్చి మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి...
అప్పుడు తెలీదు కదా ఇప్పుడు ఇలా జరుగుతుందని..?
అప్పడు..ఇప్పుడూ అదే మనుషులం కాని..?
మనసుల్లో అభిప్రాయ భేదాలు...ఎందుకిలా..?
ఇలా గతం ప్రతిక్షనం గుర్తుకొస్తోంది శత్రువులా..?
జ్ఞాపకాలు అనిక్షనం వెంతాడుతున్నా రాక్షశిలా..?
వీటినుంచి తప్పించుకోలేక..మనసును ఒప్పించలేక..?
అనుక్షనం నేనెంత భాద పడుతున్నానో తెలుసా...?
తెల్సుకొని నీవేం చేయగలవు...చెప్పి నేనేం చేయగలను.
అసలు నేనంటూ ఒక్కసారైనా గుర్తుకు వస్తానా..?
జ్ఞాపకాలు నీకున్నాయా అడగాలని పిస్తుంది..?
అడిగే హక్కు లేదు..అని గుర్తుకు వచ్చినప్పుడు....అంతే..?

Friday, February 25, 2011

రాలీపోయే పూవానీకు రాగాలెందుకే..వాడిపోయే పువ్వానీకు వర్నాలెందుకే

ఓ తల్లి తన పిల్లలను కష్టపడి పెంచింది...తాను ఎక్కువకాలం బ్రతకను అని డాక్టర్లు తేల్చి చెప్పారు..తన వద్దే పెరుగుతున్న అవిడివాడైన కొడుకును ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదు..ఎంచెయ్యాలో దిక్కుతోచని స్థితులొ కూతురికి లేఖరాసి ఆఖరిసారిగా అందరిని కలవడాని వెలుతోందా తల్లి..మాత్రుదేవో భవ సినిమాలోపాట "రాలీపోయే పూవానీకు రాగాలెందుకే..వాడిపోయే పువ్వానీకు వర్నాలెందుకే" కంట తడి పెట్టిస్తుంది...కీరవాణి సంగీతం ..వేటూరి సుందరాం మూర్తి మనసును కదిలించేట్టు రాశాడు..ఈ పాట గురంచి చాలా చెప్పాలని ఉంది కాని ఈ పాటే మనసు పాడు చేసింది..


రాలీపోయే పూవానీకు రాగాలెందుకే..తోటమాలిని తోడులేదులే
వాడిపోయే పువ్వానీకు వర్నాలెందుకే..లోకమెన్నడో చీకటాయనే
నీకిది తెలవారని రేయమ్మా..కలిపి చిలక పాటకు నిన్నటి నీరాగం..

చెవులుండి నీగోడు గాధగా..చిలకా గోరింకమ్మ గాధగా.
చిన్నరి దీపాలు కన్నీటి దిపాలు కాదా..
తనవాడు తారల్లో చేరగా..మనసు మాంగళ్యాలు జారగా
చెందొడ వర్నాలువల్లారి తెల్లారిపోగా
లోకంలో వెన్నెలవై..కరిగే కర్పూరం నీవై..ఆశలకే హారతివై..
అనుబందమంటేనే అప్పులే..కరిగే బందాలన్ని మబ్బులే
హేమంతగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే..తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే రాళీ పోయే
పగిలే ఆకాశం నీవై..జాలిపడే జాబిలివై
నీలో ఆలాపన్ నీవై నీజతలో

మనం ఏం చేస్తున్నామో అర్దం అవుతోందా..మనుషులుగా ఎన్నో కోల్పోతున్నాం

మనం ఏం చేస్తున్నామో అర్దం అవుతోందా..మనుషులుగా ఎన్నో కోల్పోతున్నాం..నేను మేము అనే పదాళ్ళోనుంచి బయటకు రాలేకపోతున్నాం..అంతా స్వార్దం పక్క వాడికి ఏమైతే నాకేంటి అనే కుంచిత స్వభావం మనసుల్లో పెట్టుకొని పైకి కి పెద్ద మనసు ఉన్న పెద్ద మనుషుల్లా బిల్డప్ స్తున్నాం.తనదాకా వస్తేనే అది ప్రాబ్లం గా కనిపిస్తోంది మనకు ఎదుటి వానికి వస్తే అవునా అని పక్కకు తప్పుకుంటాం..కారణం మన మనసులు కల్మషం అయ్యాయి...మంచి అనే ముసుగు..వేసుకొని తిరుగుతున్నామే కాని చుట్టు పక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడంలేదు..మన సమాజంలో చుట్టూ ఏం జరుగుతున్నాయో ఓ సారి మనసున్న మనిషిగా చూడండి..అనేక భాదలు వ్యధలు కనిపిస్తాయి..రోడ్ల్ పై తెగిన గాలి పటాల్లా తిరుగుతున్న చిన్నారులను చూశాం కదా ఏరోజైనా వారిగురించి ఒక్కసారైనా ఆలోచించామా..ఎవరు వీళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని మన పిల్లవాడు బాగా చదువుకోవాలి మంచిగా హాయిగా జీవించాలని ఎన్నోచేస్తాం మన జీవితాన్ని దార పోస్తాం అది మన ధర్మం..మన పిల్లలు హాయిగా ఉంటున్నారు మరి ఇలా వీధిలో తిరుగుతున్న చిన్నారులు ఎవరు...ఎక్కడినుంచి వచ్చారు అని ఒక్కసారి అన్నా ఆలోచించామా లేదు మనక్కి అంత తీరిక ఎక్కడిది..

కారనాలు అనేకం..ఇంటినుంచి బయటికి వస్తున్న చిన్నారులు గమ్యింతెలియక అనేక అలవాట్లకు గురౌతున్నారు...తల్లిదండ్రుల ఆలనా పాలనా కరువైనప్పుడు...వీదుల పాలవుతున్న చిన్నారులు ఎందరో...ఒక్క హైదరాభాద్ లోనే వేలల్లో దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటున్నారు..మరి విరిని అసాఘిక శక్తులుగా చూడవలసిందేనా...ఒక్కసారి వారి జివితాల్లోకి తొంగిచూసే ప్రయత్నంచేస్తే ఎన్నో బయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి...నేను ఈ ష్టోరీని 6 సంత్స్రారాలక్రితం చేశాను కాని అప్పటికి ఇప్పటికి సమాజంలో ఎలాంటి మార్పులేదు..వీధిబాలలు పెరుగుతూనే ఉన్నారు కొన్నిస్వచ్చంద సంస్థ్జలు పనిచేస్తున్నా...పెరుగుతున్న వీధి బాలల జివితాలు బుగ్గిపాలవుతూనే ఉన్నాయి..........ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇలాంటి వీధి బాలలను ఆదుకోవలసిన అవసరం ఎంతైనాఉంది..ఆ వీధి బాలలు తల్లిందడ్రులను వదలి విదుల్లో ఎలాంటి కష్టాలు అనుబవిస్తున్నారో ఒక్కసారి మీరే చూడండి....

Thursday, February 24, 2011

ఎవరో పిలుస్తున్నారు...దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నారు..?




ఎవరో పిలుస్తున్నారు...దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నారు..?
అవి అరుపుల్లా లేవు ఆక్రందనల్లా ఉన్నాయి...
ఎక్కడనుంచో అర్దంకావడం లేదు...ఎవరో తెలియడం లేదు
చాలా భాదగా దీనంగా..ఆక్రోశంగా వినిపిస్తున్నాయి ఆరుపులు..
కన్నీటి వేదన వినిపిస్తోందా అరుపులో..?..
కేకల్లో చావు కేక కొట్టొచ్చినట్టు కనిస్తుంది..
చావబోయేముంది తన నేదన వినాలంటూ ఉన్నాయా అరుపులు..
అలా అరిసి అరిసి ఒక్కోసారి సొమ్మసిల్లిన గొంతుకతో అరుపు
ఏంజరుగుతుందో అరదంకావడంలేదు..ఎవరి అర్దంకావడంలేదు..
మొత్తానిని ఈరోజో రేపోచావబోయే వ్యక్తి అరుపుల్లా ఉన్నాయి..
తాను తప్పు చేయలేదు అని చెప్పినా ...
తన వాళ్ళేవరూ పట్టించు కోవడం లేదని అరుస్తున్నట్టుంది..
తానే చెప్పేది నిజం అని అర్దంచేసుకోవాలని దినంగా అరుస్తున్నట్టుంది...
నీతిగా నిజాయితీగా ఉన్నా ఎందుకు అర్దంచేసుకోవడం లేదని అరుస్తున్నట్టుంది..
ఎందుకో అలా అరచి అరచి ఆ గొంతు మూగ బోయింది ఎంత వెతికినా ఎవ్వరో అర్దం కావడం లేదు...
అరుపుల్ని బట్టి అర్దం అయింది....ఓనీతి నిజాయి మనసున్న మనిషి అర్దంచేసుకోలేని మనుషులకు దూరం అయినట్టుంది..

మనసులో అలజడి.. నీ జ్ఞాపకాలు......శత్రువుల్లా వెంటాడుతున్నాయి



అదే జ్ఞాపకం..మనసులో అలజడి
మనస్సుని తడుముకుంటూ..నిన్నే తలచుకొంటూ

కల్సిసాం ..విడిపోయాం
క్షణం క్రితమే..అన్నీ జరిగినట్టుగా ఉంది
ఎందుకు జరిగిందో అలోచించే లోపు అన్నీ జరిగిపోయాయి
గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో మనసుతో వెతకమని..
వెతికితే కనిపిస్తావేమోకాని అప్పటి నా మనిషిగా కాదు..
అప్పుడు మిత్రుడిని ఇప్పుడు శత్రువు నయ్యాకదా..?
నీ గుర్తులు గుండెళ్ళో గునపాళ్ళా గుచ్చుకుంటున్నాయి...

నా మనస్సు హెచ్చరిస్తూనే ఉంది...నీవు జ్ఞాపకమే నని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని...అది నావళ్ళ కాదు అని తెల్సినా

నేను వేసే ప్రతి అడుగులో..తీసే ప్రతి శ్వాసలో నీ జ్ఞాపకం
నేను చేసే ప్రతి పనిలో నీజ్ఞాపకం..శత్రువుల్లా వెంటాడుతున్నాయి


నాకు.నీవు ఎందుకంత దూరం అయ్యావో తెలీదు
మనస్సులో ఉన్నావు... నివు దూరం అయ్యేంత తప్పు నేనేం చేశాను
నీవు ఎప్పుడూ మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో తెలుసా
కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి నీతో మనస్సు విప్పి మాట్లాడాలని
ఎదురుచూస్తున్నా...నిస్సహాయంగా దీనంగా నీకోసం అయినా నీకు జాలి కలుకదా ప్రియా...?

Wednesday, February 23, 2011

ఒకప్పుడు కల్సిన పట్టాల్లా ఉన్నాం..ఇప్పుడు...?



ఎవరు నీవు ఎవరు నేను..
కాలం కలిపిన మనుషులం
కాలానికి కళ్ళు కుట్టి విడదిసిన మనసులం..
....ఒకప్పుడు కల్సిన పట్టాల్లా ఉన్నాం..ఇప్పుడు...?
కల్సిన రైలు పట్టాలు ఎక్కువ దూరం ఉండవు ...
అవే పట్టాలు గమ్యింతెలియకుండా అలాగే విడిపోయి వుంటాయి ...
ఎంత దూరమో తెలీదు ఎప్పుడు కలుస్తాయో తెలీదు ...
అలాగుంది మన జీవితం...ఎన్నాళ్ళిలా ఎన్నేళిలా..

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత ఖటినం..

ప్రేమ..ప్రేమ అనేది ఇద్దరు మనుష్యులకు సంబందించింది కాదు మనసులకు సం బందించింది ..అసలు ప్రేమంటే ఏంటి...దాని విలువ తెలుసుకోకుండా ..ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం..అకారణంగా దూరం కావడం...పెదాలపై పలికే పదాలు కాదు ప్రేమ..హ్రుదయంలోంచి వచ్చే స్పందన...అది ఒకరు చెబితే ఒచ్చేదికాదు..ఒకరు పొమ్మన్నా పోయేది కాదు..ఒక్కసారి ప్రేమిస్తున్నాను అని చెప్పుకొని మనసుల్లో భావాలు పంచుకోని..ఎప్పటికి వీడని బందం అంటూ కలకాలం కల్సిందా అనుకొని...ఒక్కసారిగా ఇద్దరు దూరాం అయితే ఆభాద వర్నానాతీతం అది చెప్పేది కాదు అనుభవించిన వాడికే ఆభాద తెలుస్తోంది అలాంటి భాదపడుతున్న రెండు హ్రుదయాల స్పందన ఎలాఉంటుంది..ఇద్దరిలో ఒక్కరు విడిపోతే ఆఫీల్ ఎలా ఉంటుంది....ప్రేమించిన సఖి దూరంగా ఉంటే చచ్చిపోవడం కంటే మరో దారి లేదు..తను ప్రాణంగా ప్రేమించిన సఘి తనెదురుగా ఇంకొకరితో ఉంటే అంతా సూన్యిం గా కనిపిస్తుంది ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నామా అనిపిస్తుంది..ఆ భాదను అభినందన సినిమాలో ఈ పాట రూపంలో చెప్పడం చాలా బాగుంది..ఈ పాట ఆద్యంతం ప్రేయసి ఎదురుగా మరొకరి తో ఉండటం పాట పాడుతూ పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని పాడటం పాటలో నిజ మైన ఫీల్ ఉంది.. ఆ పాటలో ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత ఖటినం.. ప్రేమిస్తునప్పుడు తెలీలేదు అది విషమని ప్రేమ అనేక్షీర సాగర మదనాన్ని మదించినప్పుడు వచ్చింది విషయం అయినా మింగాను ఎందుకంటే అప్పుడు పక్కన ప్రేయసి ఉంది ..ప్రేమించుటేనా నాదోషము..పూజించుటేనా నాపాపము ఎన్నాళ్ళు భరించాలి ఈ భాద ప్రేయసి తలపులు ప్రతిక్షనం ఎదలో గుచ్చుకుంటున్నాయి భరించలేకున్నాను ఎన్నాల్లని ఈ ఎదలో ముళ్ళు..కన్నీరుగ కరిగే కళ్ళు నాలో ఉన్న నీరూపం అలాగే నిలచి పోయింది..అది పోవాలి అంతే నా గొంతులో ప్రానం పోవాలి నాలోని నీరూపమూ... ఆరాలి పోవాలి ప్రాణము ఇక ఈభాద బరించలేను నావల్లకాదు నీవే ఈ దీపాన్ని ఆర్పేయరాదాని ప్రియుడు ప్రియురాల్ని రిక్వెష్టు చేయడం మనసులోని భాదను పాటరూపంలో వ్యక్తం చేయడం నిజమైన ఫీల్ నేనోర్వలేను ఈ తేజము ...ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి...నారేపటిని మరిచేపోయిమానాలి నీధ్యానమూ...కావాలి నే సూన్యిమూ..ఆగాలి ఈమూగ గానము..నిజంగా ప్రేమించిన ప్రేయసి దూరం అయి ఎదురుగా మరొకరితో ఉంటే ఆభాద ఎలాఉంటుందిందో పాట రూపంలో నిజంగానే చెప్పినట్టుంది..ఇలాంటి ఘటనలు నిజ జీవితాళ్ళో కూడా ఉన్నాయి ఈ పాట ఊహ కాదు వాస్తవం..

ఈ అద్బుదమైన పాట తాలూక వీడియో మీరు చూడండి

Tuesday, February 22, 2011

నిన్ను గెలిపించడంకోసం నేను ప్రతిక్షనం ఓడిపోతున్నా



నిన్ను గెలిపించడంకోసం నేను ప్రతిక్షనం ఓడిపోతున్నా..
నాకు ఓటమితో భాదలేదు..నీగెలుపే నాకు ముఖ్యిం
నిన్ను గెలిపించడం కోసం నన్ను నేను కోల్పోతున్నా..
అదిఎంతలా అంటే ..నేను జీవించలేనంతగా..
జీవించాలని లేదు...జీవించి సాదించేదేమిటి నీవులేకుండా..
నిన్ను గెలిపించే క్రమంలో నేను ఎప్పుడో చచ్చిపోయాను..
బ్రతికున్న శవంగా మారిపోయాను నీకు తెలుసా..
నీవు విజయంసాదించావు ...నేను ఓటిపోయాను
నీకు విజయం శాస్వితం..నాకు ఓటమి శాశ్వితం..
నీది నూరేళ్ళ జీవితం..నాది మద్యిలోపోయే ఊపిరి?
నీకు ఎప్పుడైనా ఒక్కసారైనా గుర్తుకు వస్తానా..?
ప్రతిక్షనం మదన పడుతునా తెల్సా...?
నీ కన్నీ తెల్సు..అయినా తెలియనట్టు నటిస్తున్నావు..
ఇలా ఆలోచించి కంట కన్నీరు ఇంకి పోయేంత భాదపడటం తప్ప ఏమీచేయలేను..
రాత్రుల్లు నిదుర కోల్ఫోయాని...చిమ్మచీకటే నా నేస్తం..
చీకట్లో...ఎన్ని సార్లు వెతుక్కుంటానో తెల్సా నీకోసం..
నీవు అక్కడ లేవని తెల్సినా ..నా వెతుకులాట మాత్రం ఆపను

ఆన్ లైన్ మోసాలు ,వేదింపులు చెక్ పెట్టేందుకు www.cybercrimehelp.com



ఆన్ లైన్ మోసాలు ,వేదింపులు చెక్ పెట్టేందుకు సైబర్ క్రైం పోలీసుల సహకారంతో త్వరలో ఈ వెబ్సైట్ ప్రారంబిస్తున్నాం... ఈ సైట్ కు నల్లమోతు శ్రీదర్ గారు,ఎపి మీడియా కబుర్లు రాముగారు,సైబర్ క్రైం అడిషినల్ ఎస్పీ రామ్మొహన్ గారు సహకారంతో నేను ( ఇన్నారెడ్డి క్రైం రిపోర్టర్ ) ఈ సైట్ ప్రారంబించ బోతున్నాను ...ఇప్పటికే సైబర్ కైం ఆవస్యికత పెరిగింది...సైబర్ నేరాలు పెరిగాయి...వీటిని ద్రుష్టిలో పెట్టుకొని అనేక మోసాలు జరుగుతున్నాయి...ఇప్పుడు సైబర్ నేరస్తులు కొత్త కొత్త పందాల్లొ నేరాలు చేస్తున్నారు ఆన్ లైన్ లో వేదింపులు చీటింగ్ లు పెరిగాయి వీటిలొ ఆర్కూట్ లో ఫేక్ ఐడిలు క్రియేట్ చేయడం..ఫేస్ బుకు లలో ఫోటోలను కాపి చేసుకోని అసభ్యి కరంగా కామెంట్స్ తో కొత్త కొత్త సైట్ లు వస్తున్నాయి ..బ్లాగుల్లో అమ్మాయిల ఐడిలతొ అబ్బాపు వచ్చి మహిళా బ్లాగర్ లను వేదించడం... అసభ్యికర మైన కామెంట్స్ తో వేదించడం..పాస్వర్డ్ చోరీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి..అలాగే ఇలాంటీ సైబర్ నేరాలను చెక్ పెట్టేందుకు కొత్తగా ఐటి యాక్టులు వచ్చాయి...అవేంటి ఆ చట్టాలతో ఎలాంటి శిక్షలుంటాయి నేరస్తుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తిసుకొవాలి జిమైల్, ఆర్కూట్,బ్లాగ్ స్పాట్ ల మొసాలు చెక్ పెట్టి అవసరంఐతే ఆ బ్లాగులను వెంటనే బ్లాక్ చేసేందుకు "గుగూల్" వారి సహకారంకోరాం వారివద్దనుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది త్వరలొ అన్ని వివరాలు అందిస్తాం ..నేరస్తుల బారిన పడితే ఎలా బైట పడాలి అన్న అన్ని విషయాలు ఈ వెబ్సైట్ లో ఉంటాయి...ఇంకా అనేక విషయాలుంటాయి...ఎవ్వరైనా మోసపోతే సైబర్ క్రైం పోలీసులను ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా రక్షన పొందాలి లాంటి అన్ని వివరాలు ఈ వెబ్సైట్ లో ఉంటాయి..బాదితులకు న్యాయం జరిగేవరకు మేము వారికి సహాయ పడుతుంటాం...సైబర్ నేరగాల్లు ప్రపంచంలో ఏమూల ఉన్న వారికి శిక్షపడేట్టు చేయడం ...బాదితుల పక్షాన నిలబడి పోరాడి ఆ నేరస్తులను ప్రపంచానికి చూపించి మరొకరు ఇలాంటి నేరాలు చేయకుండా ఉండేందుకు అందరి సహకారం తీసుకుంటాం

ఇదే ఆ వెబైట్ లింక్ -----> www.cybercrimehelp.com

యగ్నంలో మీరు సహాయపడాలనుకుంటున్నారా అయితే మాకు మైల్ చేయండి..అందరం కలిసి ఓ మంచి పని చేద్దాం.....

బెష్టు వరెష్టు తెలుగు బ్లాగర్ అవార్దు లు...



కొందరు పని పాట లేని బ్లాగర్లు...అనవసర్ విషయాల్లో తలదూర్చి అనవసరగా మాట్లాడటం కామెంట్స్ లో కనిపించింది...ఎదుటివాళ్ళతో ఎలాంటి సంబందం లేకపోయినా కల్పించుకొని వెదవ ఉచిత సలహాలు ఇస్తుంటారు..కోదరైతే కామెంట్స్ లో... వాడు ..వీడు అని మాట్లాడుతున్నారు...అనే హక్కు వీళ్ళ కెక్కడిది...చాలా పోష్టుల్లో ఇలాంటి కామెంట్స్ చూశాను వీళ్ళకు పని పాట లేదు ..మన ఇంటి చుట్టుపక్కల్ ఉండే అమ్మ లక్కల టైప్ వాళ్ళ పని చూసుకోరు..పక్కనోడిగురించి మాత్రం సలహాలు ఇస్తారు..ఒక్కోసారి శ్రుతిమించి మాట్లాడి వాళ్ళ మానసిక పరిస్థితిని చెప్పకనే చెబుతారు...వీళ్ళు నిజంగా మానసిన వికలాంగుల టైప్ ...వీళ్ళ ఎవరిగురించి కామెంట్స్ చేద్దామనే చూస్తారు పరిమితిని మించి మాట్లాడుతారు మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టరూ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని వీది ధీమా ఇలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది,...నిజంగా కామెంట్స్ రాయాల్సి ఉంటే ఒకె కాని తగుదునమ్మాని ఎదుటివాడిని ఎలా భాద పెట్టాలా అన్నదే వీరి టార్గెట్...అందుకే వీరిని మానసిక వికలాంగులు అంటున్నా ...ఇలాంటి వారిని కొందరిని గుర్తించి వారి ఐపి అడ్రస్ లతో సహా బెష్టు వరెష్టు బ్లాగర్ అవార్దు ఇద్దామని ఇప్పటికే ప్రయత్నాలు మెదలు పెట్టాం..ఏ విమర్శ అయినా..అలోచింప జేసేదిగా ఉండాలి...మార్పు తెప్పించేట్టు ఉండాలి కాని ఎదుటి వారిని భాద పెట్టేది గా ఉండ కూడాదనే మా ఉద్ద్యేశ్యిం...సదరు బ్లాగర్లు ఇంతకు ముందు పెట్టిన అన్ని కామేంట్స్ ను పరిగణలోని తీసుకుంటాం అన్ని ఇప్పటికే కలేక్టు చేస్తున్నాం ఎందుకు వీరికి ఈ ఆవార్డు ఇవ్వవలసి వచ్చిందో కుడా నిష్నాతులైన వారితొ వివరణ ఉంటుంది ఎందుకు వీరు ఇలా కామెంట్స్ పెడుతున్నారనే దాని పై కూడా విష్లేషన ఉంటుంది..

ఏదివిలొ విరిసిన పారిజాతమో..ఏ కవిలో వెలసిన ప్రేమగీతమో

ఏదివిలొ విరిసిన పారిజాతమో..ఏ కవిలో వెలసిన ప్రేమగీతమో....ఓ అద్చుత సౌందర్యాన్ని గమనిస్తున్నానీమద్యి...నిజంగా ఈ పాట వింటున్నప్పుడు ఈమెకోసమే రాశాడా ఆ సినిమా రచయిత అన్నట్టు అనిపిస్తుంది...తను పరిచయమే ఇంతకుముందు కాని ఈమద్యి చూపుళ్ళో మాటల్లో అమె ఎందుకో అంత సౌందర్యింగా కనిపిస్తుంది నాకు..అయితే ఏదివిలొ విరిసిన పారిజాతమో పాట చాలా పాతది 1973 లో కన్నే వయస్సు అనే నిమిమాలోది పాట పాటల్లో మంచి మెలోడీ మెలోడి మ్యూజిక్ అందించే సత్యం మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సంగీతం ఈ సినిమాలో హైలెట్..
ప్రిముడు తన అంద మైన ప్రియురాలిని గుర్తుకు తెచ్చుకుంటూ పాడే పాట ప్రతి లైన లో ప్రియురాలి అందాన్ని వర్నిస్తూ..అమె పై ఉన్న ప్రేమను తెలిపేసాంగ్ నిజంగా సూపర్ ...ఏదివిలొ విరిసిన పారిజాతమో..ఏ కవిలో వెలసిన ప్రేమగీతమో..నా మదిలో నీవే నీడిపోయెనే..నీరూపమే దివ్యి దీపమై ...అంటూ సాగుతుంది స్మూత్ గా అమె అందాన్ని పొగుడుతూ ..నీనవ్వులే నవ్యితారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే...పాల బుగ్గలను లేతసిగ్గులను పల్లవించగా రావే.. అంటూ చిరుగాలికి అమె ముంగురులు కదలికలను ఎంత బాగా వర్నీచాడో ..నీలీముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే..అమె నడుస్తున్నప్పుడు వినిపించే మువ్వల సవ్వడి గురించి కూడా...కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజ హంసలా రావే..నిదుర పోయేప్పుడూ కలన్నో నీవే వస్తున్నావు ప్రణయంలో ముంచెత్తుతున్నావు అని చెప్పిన విదానం నిజంగా సూపర్... నిదుర మబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణ పై ప్రణ యరాగములు ఆలపించినది నీవే...పదము పదములో మదువులూరగా కావ్యి కన్నెవైరావే..
సన్నగా నాజూక్ గా ఉండే ఆ అమ్మాయిని చూస్తే నాకెందుకో ఈపాట గుర్తుకు వస్తుంది..అందమే కాదు అనుకువ మాటల్లో నిజాయితీ గుర్తుకు వచ్చి ఈపాట అమెకు సూట్ అవుతుంది అనిపించింది..

ఆ పాట తాలూకు వీడియో చూస్తే అర్దం అవుతుంది ఆ రియల్ ఫీల్ ఏమిటో

Monday, February 21, 2011

వేశ్య...తనువు పుండై..ఒకరికి పండై..తనువుని పంచునది..



నిలువెత్తు,
హ్రుదయశిల్పమెప్పుడొ
సమాధిగ మారినది..
పాపమొక భోగం,
ఆడతనమొక శాపం..
దహిచు రోగం
అరణ్య రోదనం..
తనువు పుండై..
ఒకరికి పండై..
తను శవమై..
ఒకరికి వశమై..
విధిరాత విషమై..
తను శిలగ మారి
తనువుని పంచునది..
నాలుగు నోట్ల మధ్య
నలుగుతున్న అస్తిత్వం..
సమాజం కోరల మధ్య
ఉరేయబడ్డ మానవత్వం..
యేనాడొ వెలేయబడ్డ
చీకటి ప్రపంచపు
ఆఖరి శ్వాసల
ఉత్తేజం లేని ఉచ్వాసం..
నిస్సత్తువ నిచ్వాసం..
రేపన్నది లేనేలేదు
బయటప్రపంచమొక
మధ్యరాత్రి పీడకల..
నీలి నీడల ఆర్తనాదాలు..
కాళ రాత్రుల ఆనవాళ్ళు..
నేనొక అర్ధరాత్రి స్వతంత్ర్యం..
నాదొక అంటరాని వసంతం..

- చైతూ (ORKUT )


( విది వంచితులు తమ వళ్ళు అమ్ముకొనీ జీవిస్తుంటే కోందరు తిరుగుతున్నారు...అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా... మాకు కొందరు సీక్రెట్ గా తీసిన వీడియోలను పంపుతారు ఇంట్లో తల్లి దండ్రులకు తెలీకుండా ఇలాంటి పనులు చేస్తున్న వారిని ఏమనాలి కొన్ని చీ అనిపిస్తుంది ఇలాంటి పనులు చేసేవారు తమను ఎవ్వరూ చూడటం లేదనుకుంటా టెక్నాలజీ పున్యమా ఎప్పుడొ ఒకప్పుడు బ్రతుకులు బయట పడతాయి జాగ్రత్త ..ఒక్కొక్కరు అమ్మాయిలు ,అబ్బాయిలు పదిమందితో తిరగటం ఎంజాయ్ చేయడం ఫేషన్ అనుకుంటున్నారు..పబ్బుల చుట్టూ తిరుగుతూ గబ్బు పడుతున్నారు...ఆ ఫోటోలు మీకు తెలీకుండా తీసి నెట్లలో పెడుతున్నారు జాగ్రత్త ఇలా తీసిన వీడియోలు ఫొటోలు మీతల్లి దండ్రులు చూస్తే ఉరి వేసుకొని చస్తారు ఇది మాత్రం నిజం..మీకు తెలీకుండా తీసిన వీడియోలు మీడియాకు దొరికేలా చేస్తున్నారు కొందరు వెదవలు .....ఈ మద్యి ఇలాంటి ఓసిడి చూస్తే తల తిరిగిపోయింది..నలుగురికి తెల్సిన కొందరి వీడియోలో ఉన్నాయి అందుకే ఈ కవిత చూసి భాద కోపం వచ్చి ఇలా రాస్తున్నా...అందుకే అన్నా కొందరు విధిలేని పరిస్థితుల్లో చేస్తుంటే చివరకు పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా బరెతెగించి పోతున్నారు ఆడమగ తేడాలేకుండా..? అది ఒక్కరితో కాదు మరి వీరికంతే వ్యభిచారులే నయం అనిపించింది)

నాకు పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలిపిన వారందరికి ..Thanks



పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలిపిన వారందరికి ..Thanks..ఫిబ్రవరి 2 ఈరోజు నా పుట్టిన రోజు ఉదయంనుంచి నాగురించి తెల్సిన వారు తెలియని వారెందరో విషెష్ చెబుతుంటే నాకు చాలా సంతోషం వేసింది..ఆర్కూట్ లో దాదాపు అందరూ నాకు పుట్టినరోజు సుభాకాంక్షలు చెప్పారు అందరికి నా Thanks.. ఇంతమంది అభిమానిస్తున్న నేను నిజంగా హేపీగా ఫీల్ అవుతున్నా...చాలామంది ఫోన్ చేశారు నా నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేశారు వారందరికి నా Thanks..మనం అభిమానించే వాళ్ళకంటే మనల్ని అభిమానించే వాళ్ళే నిజమైన స్నేహితులు కదా..?నాకు శుభాకాంక్షలు చెప్పటం కుదరని వాళ్ళు SMS పంపారు..చాలామంది ఫోన్లను అటెండ్ చేయలేకపోయా కారణం డ్యూటీలో బిజిగా వున్నాను క్షమించగలరు

నాకిష్టమైన ఓ వ్యక్తి నుంచి నాకు విషెష్ చెబుతుందని సాయంత్రం వరకు ఎదురుచూశా..చాలా భాద వేసింది...అంతకంటే ఏంచేయగలం.. నేను అంతగా ఇష్ట పడే తను ఎందుకు చేయలేదో తెలీదు నాకు విషెష్ చెప్పాలనిపించ లేదేమో...తను విషెష్ చెప్పెంత గొప్పవాడిని కాదేమో..అనిపించింది నాలాంటి వాడికి ఎందుకు చెప్పాలనుకుందో ఏమో...?

నాకు తొడుగ నా కన్నిరుని నాకు పరిచయం చేసి..?



నా ప్రేమకు రెక్కలొచ్చాయి
ఏగిరిపొయింది దూరంగా
నా పిలుపు వినిపించనంత గా,
నా చేతిలొ తన చేతిని విదిలించుకుని,
నా ప్రేమను కాదని,
కొత్త రెక్కల మొజులొ ....
నన్ను మరిచిపొయి ..
కలిసి కన్న కలలు అన్ని కలలు గా మిగిల్చి,
ఒంటరి గా నడక సాగించమని ఒంటర్ని చెసి,
ప్రేమ లేదని బంధం తెంచుకొని ,
నాకు తొడుగ నా కన్నిరుని నాకు పరిచయం చేసి,
గ్నాపకాల మూటను ఒడిలొ విడిచి ,
వాటిని ఉపిరి గా మలిచి భ్రతకమని ...
నా గుండె కు ఏడబాటు చూపుతూ..
నా మనసుకు గాయం చేస్తూ...
గడిచిన కాలం మరువమని,
కొత్త జీవితం అందుకొ మంటూ .
తన రెక్కలతొ విసిరికొడుతూ ..
నా హ్రుదయం గదిలొంచి రక్తం చిమ్ముతూ...
నా హ్రుదయం పడ్డ గాయాన్ని కూడ లెక్క చేయక ...
తన స్వార్ధని వెతుక్కుంటూ ...
కొత్త రెక్కల మొజులొ .......
ఏగిరిపొయింది నా ప్రెమ.....నన్నొదిలి దూరంగా
-Sree

Sunday, February 20, 2011

కనులు మూసినా చెలి కన్నులలో మేదిలేను ఓ కమ్మని కల


ఓ నిండయిన జాబిలి
నిండు పున్నమివేళ ఓ నిండయిన జాబిలి
చెలిమి చేసింది ఓ చందమామ కౌగిట ....
అమావాశ్య నల్లటి మబ్బులు చంద్రుని దాచిన వేళ
ఒంటరి అయి నిశ వీదులలో అభిసారికలా ప్రియుని జాడకయి పరుగులు తీసింది ,
దోబుచులటాలని వెతుకులాడింది వెంపర్లడింది.
చివరకు ఓ చోట సోమ్మసిల్లింది.
నిద్రాదేవి కలతలన్నీ కరిగిపోయేలా లాలించగా
కనులు మూసినా చెలి కన్నులలో మేదిలేను ఓ కమ్మని కల

వినీలకసపు నేపధ్యం లో మేఘాల రధం మీద
నక్షత్రాలను కోసుకుంటూ వెన్నెలను పాత్రలో నింపుకొని
తనకోసమే తీసుకు వస్తున్న తన ప్రియుని చూసి మురిసి పోయింది
మైమరిచిపోయింది. అ మైమరుపులో తననే మరిచిపోయింది..
ఆ కల కరిగిపోయింది నా చెలి నిదురపోయింది.
నా చెలిని నిదురలేపలేక , తను లేచేవేళకోసం
ఎదురుచూస్తూ తన సమాధి వద్దే నిలిచి ఉన్న ........

అందరూ చావుకు ఎందుకు భయపడతారు..?



అందరూ చావుకు ఎందుకు భయపడతారు..?అసలు మనం ఎందుకు పుట్టాం..చావంటే ఎంటి..ఎందుకు పుడతాం...ఎప్పుడు చనిపోతాం..చావు పుట్టుకుల మద్యి కాలంలో ఈ అనుబందాలేంటి ..పుట్టినప్పుడు మనతో లేని అనుబందాలు చనిపోయాక కూడా మనతోరావు...దీనికోసం అందరూ ఎమోషనల్ గా ఎందుకు ఫీల్ అవుతారు అని ఆలోచిస్తుంటే ఏ ప్రశ్నకు సరైనా సమాదానం దొరకదు...ఒక్కొసారి అనిపిస్తుంది అంతా ట్రాష్ అని..ఎవరు ఎవరికి ఎమౌతారు...ఎందుకు ఎర్పడతాయి బదాలు కారనం ఎంత వెతికినా దొరకదు ఒక్కోసారి అనిపిస్తుంది...కొన్ని బందాలు గమ్మత్తుగా ఏర్పడతాయి...ఎంత అంద మైన అమ్మాయిలను చూసినా అబ్బా అందంగా ఉంది అనిపిస్తుంది కాని ఎలాంటి ఫీలింగ్ రాదు..ఎందుకో కొందరి పరిచయం ఏర్పడిన బందాలు భాదను మిగులిస్తాయి తనెవరు నేనెవరు..ఎందుకు అంతగా గుర్తుకు వస్తుంది అంతే సమాదానం ఉడదు...అంతకన్నా అందమైనా అమ్మాయిలు పలుకరించినా ఏమి అనిపించదు కాని ఆమెను తలచుకుంటేనే ఏదో ఫిలింగ్ కారాణం తెలిదు...ఉప్పెనలా జీవితంలో ప్రవేశించి ఉప్పెనలా వెళ్ళిపోయినా అమెతాలూకా గుర్తులు ఎందుకు ప్రతిక్షనం వెంటాడతాయి అని ప్రశ్నించుకుంటే ప్రశ్నలేకాని సమాదానం దొరకదు ఎందుకు అంటే ఎమో...మనం ఇక్కడ ఫీల్ అవుతున్నాం అమెకు అస్సలు గుర్తుకు వస్తామా అని ఆలోచిస్తేఈ ప్రశ్నకు సమాదానం దొరకదు ...తను నాగురించి ఎందుకు ఆలోచించాలి ఎప్పుడూ నాగురించి ఆలొచించడానిని నేనెవరిని తనకు ఏమౌతాను అని ప్రశ్నించుకుంటే కూడా నాదగ్గర సమాదానం లేదు చావంటే ఎందుకు బయపడాలి..ఎప్పుడైనా రావచ్చు ఏరూపంలో అయినా రావచ్చు మనం ఆపగలమా లేదుకదా అలాటప్పుడు ఎందుకు బయపడాలి ఒకవేల పోతే ఓ నెలరోజులు మహాఅయితే ఆరు నెలలు అనుకుంటారు ఆతరువాత ఎవరి బిజీళ్ళొవారు బిజీగా ఉండి మర్చిపోతారు అవును నిజమే కదా..?...అసలు వాళ్ళు మనల్నిఎందుకు గుర్తుకు పెట్టుకోవాలి నాకనిపిస్తుంది మరపు దేవుడిచ్చిన వరం కదా..?అందరూ నావాళ్ళు నాకందరు ఇష్టం అని నేను అనుకుంటే సరిపోతుందా వాళ్ళు అనుకోవాలి కదా..అలా అనుకుంతే బందాలు మద్యిలో ఎందుకు తెగిపోతాయి ఎందుకు విడిపోతారు కదా..?విడిపోయిన వాళ్ళు మళ్ళి కలుస్తారా..కలిస్తే ఎలా కలుస్తారు..అంతకు ముందులా ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటారా ఒక్కప్పటి ప్రేమలు... స్నేహాలు ఎందుకిలా మద్యిలో పోతాయి తప్పు చేయకున్నా ఆ బందాలు మనల్ని తప్పించుకొని పోయి మనల్ని ఒంటరిని ఎందుకు చేస్తాయి..ఏంటి ఇదంతా అనుకుంటున్నారా..ఒకే బోర్ కొట్టించినట్టున్నా కదా.......అవును మద్యిలో ఎందుకు విరోదులు ఎర్పడతారు విరోదంపెంచుకొని ఎం సాదిస్తారు...అంటే కూడా ఎమీ అర్దంకాదు...కొందరు కొందరి జివితాలు నాశనం చేసేదాకా ఎంటాడుతారు...అనుమానం వాళ్ళని ఇలా చేయిస్తుంది...ఎందుకు అలా ప్రవర్తిస్తారో తెలీదు అవతలి వ్యక్తిని భాదపెట్టి సాదించేదేమిటి...భాదపేట్టామని తెల్సి వారిని ఇంకా కసి తీరదు ఇంకా ఇంకా వెంటాడుతూనే ఉంటారు.. కారనం ఏంటి........పైకి మంచిగా ఉండి ఎదుటి వ్యక్తిని కసిదీరా వెంటాడి వేదించి సాదించేదేమిటి..ఇలా ఆలోచించుకుంటూపోతే ఏమీ అర్దంకాదు...కదా..?

http://agnijwaala.blogspot.com/ లోనిది

నన్ను నేను మర్చిపోయినప్పుడే నాలో నీవున్నావు...



నిన్ను వదిలి వెళ్తునానే బాద లేదు, ఎందుకంటే.....
నన్ను నేను మర్చిపోయినప్పుడే నాలో నీవున్నావు...
నిన్ను విడిచి వెసే ప్రతి అడుగులొ ఎన్నొ ఆనందపు అనుభుతులు నా మనసును తడుముతున్నాయి,
నిన్ను విడిచె ప్రతి క్షణం నీ ఆలొచనలు నా గుండెల్లొ నాట్యమాడు తున్నాయి,
నీవు లేని ఈ సమయం నీ రూపం నా కన్నుల్లొ, నీ ధ్యాస మనసులొ నిండి ఉంది,
నీవు నా చెంత లేవనే చేదు నిజం నా కళ్లల్లొ కన్నీరై నిలిచింది
కాని ఆ కన్నీళ్లలొ నీ రూపం కరిగిపొతుందని భయంతొ,
కన్నిటిని తరిమాను,ఏడబాటును దూరం అవుతున్నా,
నీ చెంత చివరి వరకు ఉండాలనే, ఈ ఏడబాటు కడవరకు ఉండదు
అనే చిన్న నమ్మకంతో జీవిస్తున్నా..ఎప్పటి వరకో తెలువదు

నన్ను డిఫరెంట్ గా చూడాలని ఉందా..అయితే ఇది చూడండి

నా హృదయం మౌనంగా విలపిస్తుంది.




నల్లని చిన్నటి నీ కురుల్ని చూసి చీకటి చిన్న బోయింది
ఆ చిన్నకురులను సింపుల్ గా వెనుక్కు అనటంలో ఓ సోయగం ఉంది
ఏముందో ఆకళ్ళలో ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేను..
బాపు బొమ్మను తలపించిన నీ సౌందర్యిం నాకన్నుల తో నే చూడాలి..
నవ్వే నీచిరునవ్వులో వేయి విద్యుత్ దీపాల కాంతి పవర్ ఉంది..
నీ కళ్ళ లోకి అలా చూస్తూ ఎన్ని యుగాల్నైనా క్షనాల్లా గడీపేస్తా ప్రియా
నీవు కట్టిన చీర రంగుని చూసి ఆకాశం వెల్ వేల బోతోంది
నీ నడక లోని హొయలను చూసి కొండలలోని సెలయేరు సోమ్మసిల్లుతుంటే
ఇన్ని హంగులున్న నీవు నాకు దక్కవేమో అని ఎప్పుడూ
నా హృదయం మౌనంగా విలపిస్తుంది.

నాప్రాణమా నను వీడిపోకుమా..నీ ప్రేమలో కరగనీయుమా

ప్రేమను వ్యక్తం చేయడానికి ..ఒక్కొక్కొల్లు ఒక్కోరకంగా ఆలోచిస్తారు..అది వారి అభిరుచిని బట్టి వుంటుంది...నాగరాజు అనే స్టూడెంట్ రాసిన అనితా అనే పాట సంచలనం సృష్టించింది...ఈ పాట తెలంగాళా నే కాదు రాష్ట్రంలో ఓ సంచలనం ప్రయివేట్ సాంగ్ ఇంతగా సం చలనం అవ్వడానికి కారణం.. ఆ పాటలో నిజమైన ఫీల్ ఉంది...పాటల్ లోని ప్రతి అక్షరంలో నిజమైన ప్రేమ ఉంది ఓసారి ఆపాటల్ లోని ఆఫీల్ తెల్సుకుందామా...నాప్రాణమా నను వీడిపోకుమా..నీ ప్రేమలో కరగనీయుమా పదే పదే నా మనస్సు నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుంఆ నిన్నే కోరుకంటోంది.వనిత అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నాప్రాణమా నను వీడిపోకుమానమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా...నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా కలలో కూడా నీరూపం నను కలవర పరిచెనే కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెడుతుంది నిజంగా ఇక్కడ నాగరాజు చెప్పిన విదానం సూపర్ ప్రియురాలిని చూడాలని కను రెప్పలు కలవర పడుతున్నాయి అని చెప్పడం చాలా బాగుంది కదా నాకు బాగా నచ్చిన లైన్ నువ్వొక చోట నేనొక చోట నిను చూడ కుండ నేనుండ లేను లే నా పాటకు ప్రాణం నీవే నా రేపటి స్వప్నం నీవే నా ఆశల రాణివి నీవే నాగుండెకు గాయం చేయకే...చూశారుగా ఈ పాటలో ప్రతిలైన్ లో నిజమైన ఫీల్ ఉంది నీవే నా దేవత వని ఎదలో కొలువుంచా.. ప్రతి క్షనమూ ద్యానిస్తూ పసిపాపల చూస్తా..విసుగు రాని నా హ్రుదయం నీకోసం ఎదురు చూసె నిను పొందని ఈ జన్మ నాకెందుకని అంటుండే.. కరునిస్తావో కాటే స్తావో నీవుకాదని అంటే అంటే నేను శిలను అవుతానో ...నను వీడని నీడవు నీవే ప్రతిజన్మకు తోడువు నీవే నన్ను వంటరి వాడ్ని చేయకే అంటూ తన మనస్సులోని ప్రియుడు ప్రియురాలికి చెబుతాడు
చివరిగా ఏదోరోజు నామీద ప్రేమ కలుగుతుందని చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా నాఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా..ఈ పాటలోని ప్రతి పదంలో నిజమైన ఫీల్ ఉంది..ఆ ప్రేమలో నిజాయితీ ఉండి నిజంగా ఇలాంటి ప్రేమను పొందిన వారు అద్రుష్టవంతులు నిఖార్సయిన ప్రేమ లో ఫీల్ ఇలా ఉంటుండి ..ఈ పాటను కోందరు ఉత్సాహవంతులు వీడియో ఏడ్ చేసి ఆపాటకు మంచి ఫీల్ తీసుక వచ్చారు ఆపాట వీడియో మీరు చూడండి



Saturday, February 19, 2011

మనం నుంచి నేను గానే మిగిలిపొనా...? ఒంటరిగా నీవులేకుండా



మనం నుంచి నేను గానే మిగిలిపొనా...? ఒంటరిగా నీవులేకుండా..కాదు అలాజరగదు అని అనుకున్నా ఇదేనిజమా...ఎన్నాల్లిలా నీవులేని నేను లేను అని తెల్సినా..నిజం నిజంకాకుండా పోదుకదా మరి అయినా చాలా చెప్పాలనుంది కాని చెప్పలేక పొతున్నా కారనం నీకు తెల్సా..ఏంటో మనసు చికాగ్గావుంది ఇప్పుడు ఎందుకో..........?

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేఎలా..?

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేఎలా..?..ఈ సాంగ్ మెలోడి హిట్...సూపర్ డూపర్ హిట్ వినటానికి చాలా బాగుంటుంది...తన ప్రియుడి కి ఏదో చెప్పాపని తన ప్రేమను వ్యక్తంచేయాలని ప్రియురాలు పాడే పాట నిజంగా ఇలాంటి ప్రియురాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఈపాట వింటుంటే .పాటకు తగ్గట్టు కుల్ గా సాగే మ్యుజిక్ నిజంగా చాలాబాగుంటుంది..హాయిగా ఉంటుంది..మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేఎలా ...మాటున ఉన్నది ఓమంచి సంగతి బైటికి రాదేఎలా..అతడిని చూస్తే రెప్పలువాలి పోయే బిడియం ఆపేదెలా...ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరే ఎద గొడవేమిటో తెలవక పోతే ఎలా..తన ప్రియుడి గురించి తలస్తూ తన మనసులో ఉన్న మాటను ఎలా చెప్పాలాని తపనతో ఆశతో పాడుకునే పాట సీక్వెన్స్ చాలా బాగుంది ఈ పాతలో రియల్ ఫీలింగ్ ఉంది నీగురించి ఆలోచిస్తుంటే ఆనొప్పిఏంటో కుడా తెలవడంలేదు కలల్లో తేలిపోతున్నా నీగురించి ఆలోచిస్తూ అని ప్రియుడి తలపులను తలచుకోంటున్నా అలాంటి ప్రియురాల్లు నిజంగా ఉంటారా..? పాటలో ఓ చరనంలో ప్రేమంటే తీయని భాదని అదె గుండెల్లొ కోండత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నాప్రియమైన నీకు నాయెద కొత అనుకోంతూ తనచుట్టూ తిరుగుతోంది నామనసూ అని చెబుతోందా ప్రియురాలు నీకు చెప్పకుండా ఎలా ఉండా గలను ఈ మనసులో భాదను చెప్పాలనే ఉంది అంటూ సాగుతుంది ....నీకై ఆశతో చూస్తున్నా నీమనసులో కాస్త చోటిస్తావా..నీ ఆలోచనలతో రాత్రుల్లు అవేకలలు నీవే ప్రతిక్షనం గుర్తుకు వస్తున్నావు నేస్తమా ...నిజంగా ఇలాంటి ప్రియురాళ్ళు ఉంటారా...ప్రియుడికోసం మనస్సులో ఇంత భాదతో ప్రియుడికోసం ప్రియురాలు ఎదురుచుస్తుందా ఇవన్నీ నిజాలేనా ఇలా నిజంగా కూడా ఉంటారా.. అనిపిస్తుంది ఒక్కోసారి అలా అనిపించి షడన్ గా మానివేస్తే అవతలి హ్రుదయం ఎలా వేదన పడుతుందో కదా..అలా బాదపడతారని తెల్సి ఎలాంటి ఫీలింగ్ లేని భాద పెట్టే ప్రియురాళ్ళు ఉన్నారు కదా..

సరే ఆపాట వీడియో మీరూ చూడండి


అరె! .ఏమైందీ... మనసుకు రెక్కలొచ్చి ..ఎక్కడికొ ఎగిరింది

చిరంజీవి సినిమాల్లొ ఇదో మంచిసాంగ్ మనసుకు సంబందించి తన లోని భావాలు మనస్సుతో పొలుస్తూ పాడే పాట ...నిజంగా చాలా అద్బుతమైన పాట..మనస్సులో ఉప్పొంగే ఉప్పెనలను లోలోపలె పేరుక పోయిన భాదను ఈ పాట రూపంలో వ్యక్తంచేసినట్టూంటుంది..ఇష్టమైన వాళ్ళు కనిపిస్తున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే ఈపాటే పాడాలనిపిస్తుందేమో అనిపిస్తుంది మాటల్లో చెప్పలేని భావాలు పాటరూపంఅంటే ...ఇలాగే ఉంతుంది కదా..? మీరు ఆపాట పాడుకోవాలనిపిస్తే ఇక్కడ ఉండి చూడండి ఆపాటలో "ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ...తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందికలగాని... కల ఏదో... కళ్లెదటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది..." చూశారా ఎంత అద్బుతంగా ఉందో ఆపాట పదాల అమరిక ప్రతిక్షనం గుండేల్లో అలజడుల ప్రతిరూపమే ఈ సాంగ్..ఇంకా ఈపాటగురించి ఏదో చెప్పాలని ఉందికాని..మాటలు రావడంలేదు..అంత అద్బుత మైనపాట ఇది

పల్లవి :
అరె! ఏమైందీ... అరె! ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ...
తన మనిషిని వెదుకుతు
ఇక్కడొచ్చి వాలింది
కలగాని... కల ఏదో...
కళ్లెదటే నిలిచింది
అది నీలో మమతను
నిద్దుర లేపింది... ఆ ఆ ఆ... ॥

చరణం : 1
నింగి వంగి నేలతోటి
నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగి కోసం
పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు
పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు
నింగిైవె పు చూపులేదు
కన్నెపిల్ల కళ్లలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావే... ఓ...

చరణం : 2
బీడులోన వాన చినుకు
పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన
పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు
గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే
పాట నీవె రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు
వీడు మారిపోతాడు
మనిషౌతాడు...

ఆ అద్బుత మైన పాట తాలూక వీడియో చూడండి ..నిజంగా మనసు ఉన్న మనుషులైతే నిజంగా ఎవ్వరిని అయినా ప్రేమించి ఉంటే కంట కన్నీరు రావల్సిందే..

Friday, February 18, 2011

ఏదో తరుముకొస్తోంది...ఎవరో వెంటాడుతున్నారు..?




ఏదో తరుముకొస్తోంది...ఎవరో వెంటాడుతున్నారు..?ఎవరు..? ఎందుకు..? కారాణం..? ఎంత వెతికినా ఎంత సోదించినా..ఎంత ఆరాట పడినా సూన్యిం కనిపిస్త్సోంది...చల్లటి చంద్రుడి వెన్నెల కూడా వేడిగా అనిపిస్తోంది ఎందుకో..?పండు వెన్నేల నాకు ఎండమావిలా అనిపిస్తోంది..?సాయంకాలపు చిరుగాలులు అందరికి చల్లగా.. నాకు వేడిగా అనిపిస్తోంది..ఏదో జరుగుతోంది ఏదో జరుగబోతోంది..నీవు నాతో లేని ప్రతిక్షనం ఇలాగే ఫీల్ అవుతాను..నాకిదేం కొత్తకాదు..నీవు దూరం అయిన క్షణం నుంచి నాకు ఇలానే అనిపిస్తుంది స్నేహంచేయడం తెల్సు చేసిన స్నేహాన్ని మరువడం తెలీదు మిత్రమా ఎన్నో కారనాలు ఉండవచ్చు కాని ఎప్పటికీ చేసిన స్నేహాన్ని మరువను మరిచిపోయే స్నేహాన్ని చేయను...ఏదో ఆసించి స్నేహం చేయను...నిఖార్సయిన నిజాయితీ ఉంది నా స్నేహంలో...నీవు హేపీగా ఉండాలనే కోరుకుంటా ప్రతిక్షనం......ఇది నిజం ..అందుకే రాత్రుల్లు సైతం ఇలా ఫీల్ అవుతున్నా ఎందుకో..కారణాలు ఇక్కడ అప్రస్తుతం..ఇద్దరు స్నేహితుల్లో ఎవరు ఎవరిని పోగొట్టుకున్నట్టు ఎవరు ఎవరికి దూరం అయినా ఆస్నేహంలో నిజాయితి ఇద్దరిని వెంటాడి వేదిస్తుంది వేదనే ఆ భాదే నిజమైన స్నేహానికి గుర్తులు...ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు..రోజు మాట్లాడిలిన అవసరం లేదు..సప్తసముద్రాల ఆవల ఉన్నా నిజమైన స్నేహితులు ఇలానే భాదపడతారు..ఎదో చెప్పాలని ఉందికాని చెప్పుకోలేని భాద ఉందని మాత్రం చెప్పగలను ఏమి చేయలేక కాదు ఏది చేసినా అది నాస్వార్దం అవుతుంది...అవతల ఓ చిన్ని మనస్సు భాదపడుతుంది...ఇప్పటికే ఎన్నో భాదలున్న తనకి నేను మరో భాదగా మిగిలిపోకూడదు ....ఇప్పుడు నాకు దగ్గరయిన కొత్త మిత్రులు..గుండెలనిండా పొగ ....గుండెల్లో మంటలు చల్లార్చే మందు...ఇవే నాకు నేస్తాలు ఎప్పటికీ..నీగుర్తులు నన్ను తడుముతున్న ప్రతిసారి..ఓదార్పు నిచ్చే నేస్తాలు ఈ రెండే..మరో మిత్రుడు కూడా రెడీగా ఉన్నాడు కబలించేందుకు చాలా తోందర పడుతున్నాను తొందర పెడుతున్నాడు ఆకొత్త నేస్తం

మీరు నుంచి నీవు గా మారిన పలుకు మళ్లీ మీరుగా ఎందుకు మారింది అసలే మాటలు లేకుండా పోయాయి ...?



మీరు నుంచి నీవు గా మారిన పలుకు మళ్లీ మీరుగా ఎందుకు మారింది కారణం వరుస సంఘటనలు..ఎంజరుగుతుందో తలచుకునే లోపే అన్నీజరిగిపోయాయి..కారణాలు ఎంత వెతికినా కనిపించడంలేదు...ఎందుకిలా జరుగుతుందో అర్దంకావడంలేదు ..నాకు తెల్సి ఎలాంటి తప్పు చేయనప్పటికి దోషిని అయ్యా..కారనాలు వెతికి నేను నిర్దోషిని అని నిరూపించుకోవలని పించలేదు..కొన్ని నిజాలు అబద్దాలు అయితే ఎంత బాగుండు అనిపించి...కాని అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా..? కొందరు ఎందుకు దగ్గర అవుతారో ఎందుకు దూరం అవుతారో అని ఎంత ఆలోచించినా అర్దంకావడంలేదు......గతం ఎప్పటి తిరిగిరాదు వర్తమానం ఎప్పుడూ మనదికాదని తెల్సినా...గతం గాయాలు మిగిల్చినా వర్తమానం వసంతాలు తెస్తుందన్న ఆశవున్నా...అది ఎంత వరకు జరుగుతుందోఒ అస్సలు జరగదేమో అన్న భీతి ఉన్నా ఎక్కడో చిన్ని ఆశ ఇంకా మనస్సులో మిగిలే జరుగని విషయాలు జరగవని మారిన పిలుపులు తిరిగి మారుతాయా అన్న సందేహం మనస్సును తొలుస్తూనే ఉంది...మీరు నుంచి నీవు గా మారిన పిలుపు అస్సలు లేకుండా పోయింది ఇప్పుడు ..ఆశ అవసరమా అని మనస్సును తొలుస్తున్న పెద్ద సందేహం ఇదే నిజమౌతుందో నన్న పెద్ద సందేహం..కాదు అనుమానం కాదు అదే నిజం ఎది ఎమైనా జరిగింది జరుగబోయేది...ఏది మన చేతుల్లోలేకపోయినా...మనస్సులో మెదులుతున్న అనేక సమాదనం లేని ప్రశ్నలు మెదులుతున్నాయి ఒక్కటి మాత్రం నిజం నీ విషయంలో ఎందుకిలా జరుగుతుందో అర్దం కావడంలేదు తప్పెవరిది మీరు నుంచి నీవు గా మారిన పలుకు మళ్లీ మీరుగా ఎందుకు మారింది అసలే మాటలు లేకుండా పోయాయి

కలువలు సైతం కల్లార్పకుండా చూస్తాయి...నీ కన్నుల సోయగం చూసి




కలువలు సైతం కల్లార్పకుండా చూస్తాయి...నీ కన్నుల సోయగం చూసి

గులాబీ లు సైతం సలాం అంటున్నాయి...నీ పెదవుల ఎర్ర దనాన్ని చూసి

పండువెన్నెల సైతం పరవసిస్తుంది...నీ చిరు మందహాసాన్ని చూసి

తేనే మాధుర్యం తక్కువనిపిస్తుంది...నీ పలుకులలో తియ్యదనం చూసి

చందమామ కూడా చిన్నబోయింది ...నీ మోము ని పరిశీలనగా చూసి

సరిగమల కి కూడా గతి తప్పుతుంది ...నీ నడకలోని హొయాలను చూసి

ఇంద్రధనస్సు కూడా మైమరచిపాయింది ...నీ మేని విరుపులు చూసి ...

అను నిత్యం నను కలలో వేధించే అతిలోక సౌందర్యమా ...ఇంతకీ నీవెక్కడ ..ఒక్కసారి కనిపించుమా ప్రియా

మహిళా జర్నలిష్టు పైదాడి... కేసు నమోదు చేసుకోని పోలీసులు

ఈనాడు హైదరాబాద్ సిటి ఎడిషన్ నాలుగోపేజి వార్త ఇది..

మహిళా జర్నలిష్టు పైదాడి కేసు నమోదు చేసుకోని పోలీసులు

మనం నుంచి ...నీవు, నేను గా విడిపోయి...?


నెమ్మది గా..ఇంత దూరం వచ్చాం మనం
నెమ్మది గా.ఇంత దూరం జరిగిపోయం మనం
నెమ్మది గా...భాదను బరించడం నేర్చుకుంటున్నాం


ఎవరికీ తెలీదు...మనం జీవించిన కాలగమనం ఎలా గడచిపోయిందో
ఎవరికీ తెలీదు...ఇప్పడిదాకా ఎలా బ్రతికున్నామో
ఎవరికీ తెలీదు...ఎలా జీవించామో మనం
ఎవరికీ తెలీదు...ఎందుకిలా జీవితాన్ని గడుపుతున్నామో
ఎవరికీ తెలీదు...ఎవరికోసం ఎవరు బ్రతికున్నారో
ఎవరికీ తెలీదు...నీకు నాకు ఉన్న ఆ బందమేంటో
ఎవరికీ తెలీదు...నీవు లేని నేను లేనన్న వాస్తవం
ఎవరికీ తెలీదు...ఎందుకిన్ని అవమానాలను భరిస్తున్నానో
ఎవరికీ తెలీదు...మనంగా ఉన్న ఇద్దరం నీవు,నేను గా విడిపోయామో
ఎవరికీ తెలీదు...ఒకర్ని ఒకరు చూసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నామో

ఇవన్నీ ఎవ్వరికి తెలీదు ..
తెల్సుకోవాల్సిన అవసరం లేదు...
కొన్ని నామనస్సులోని వాస్తవాలు ..
ఇన్ని రోజుల పరిచయంలో..ఇప్పటికీ నీకు కూడా కొన్ని తెలీదు..
తెల్సుకునే సమయానికి ఇద్దరం ఒక్కటిగా లేము కదా..?
ఇంకెప్పటికీ ఒక్కటయ్యే అవకాశం లేదుకదా.....?
మనం నుంచి ...నీవు, నేను గా విడిపోయి...
మళ్ళీ ఎప్పుడు..మనంగా కలుస్తామో కదా..?
మరి అప్పటిదాకా నిన్ను నిన్నుగా తెల్సుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటా......
దీనికి ఓ జీవితకాలం పడుతుందనీ తెల్సు..అయినా తెల్సుకునే ప్రయత్నాన్నిమాత్రం విరమించను

Thursday, February 17, 2011

జాబిల్లొ కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై....!

జాబిల్లొ కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై..నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై ...సాంగ్ మొలోడి ట్రాజెడి బీట్ తో మంచిసాంగ్ తన ప్రియురాలు దూరంగా ఉంటే అమెను గుర్తుకు తెచ్చుకొంటూ పాడూకునే పాట.చీకట్లో ఒంటరిగా కూర్చున్న ప్రేమికుడు పాడుతున్న పాట...ఎక్కడో ఉన్న ప్రియురాలి కోసం..నీవక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటికలిసున్నది ఏనాడైనా.ఈ పువ్వులనే నీనవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా అంటూ ఆకాశంలోకు చూస్తు ప్రియుడు పాడుతాడు..ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాలేక..కబురంపినాను రావాదేవి ..అంటూ ప్రియురాలికి సందేసాన్ని మేఘాలతో పంపుతున్నాను అని చెప్పడం బాగుంది..నీవుకనిపించక పోయేసరికి జాబిల్లికోసం ఆకాసం ఎదురుచూస్తున్నట్టు నేను ఎదురు చూస్తున్నా అంటూ సాగుతుంది ఈపాట. పేరొక జపమైనది నీప్రేమొక తపమైనది నీ ద్యానమె వరమైనది ఎన్నాల్లైనా ఉండీలేక ఉన్నది నీవే ఉన్నాకూడా లేనిది నేనే నారేపటి ఆడియాసల రూపంనీవే దూరాన ఉన్నా నాతోడు నీవే నీదగ్గర ఉన్న నీనీడ నాదే నాదన్నది అంతా నీవే నీవే..ప్రియురాలిని ప్రతిక్షనం గుర్తుకు తెచ్చుకునే ట్రాజిడి మెలోడి సాంగ్ మీరు వింటారా అయితే వినండి మీ రు ప్రేమికులు ఐతే ఈ పాట ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు

ఒక అందమైన రాక్షశివి..ముళ్ళులున్న గులాబి పువ్వువి


కల ఒక జ్ఞాపకం
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది
జ్ఞాపకం ఒక కల
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది
కలలాంటి జ్ఞాపకం
జ్ఞాపకం లాంటి కల
నువ్వే....

నువ్వెవరో...
అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా
కానీ నీదయిన రూపం నీకుంది..నీకు దయలేదు..
నీ ఒక అందమైన రాక్షశివి..ముళ్ళులున్న గులాబి పువ్వువి
ప్రతిక్షణం నీ ఆలోచనలే చుట్టుముడుతుంటే
కించిత్ ఆలోచనలు లేకుండా ఎలా ఉంటున్నావు
నువ్వే నా మనసనుకున్నా ..ఆ విషయం తెలుసు నీకు

వేకువఝామున నిద్దుర లేపే పిల్ల తెమ్మెర ఒకప్పుడు
నా ముంగిలి తాకే తొలి సూర్యకిరణం నువ్వు ఒకప్పుడు
నా కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళం నువ్వు ఒకప్పుడు
రాత్రంతా నన్నల్లరి పెట్టే వెన్నెల నువ్వు ఒకప్పుడు
మరిప్పుడు ఎమైయ్యావు..ఎక్కడున్నావు
ఎప్పటికైనా వస్తావని ఎదురు చూస్తూ..?

ఎడబాటు ఎన్నాళ్ళు అంటే..ఓ జీవితకాలం అని తేలిపోయింది


వేకువజాము పక్షుల కిలకిల రావాల చప్పుల్లు ఒకప్పుడు..హాయిగా
ఇప్పుడు అవేపక్షుల కిలకిల లు వినలేకపోతున్నా..ఎందుకీ తేడా..
ఒకప్పుడు ఇష్టాలన్నీ కష్టాలుగా ఎందుకు మారుతున్నాయి..
ఎక్కడో అలజడి..రోజులు గడచాయి..నెలలు దాటుతున్నాయి..
అదే వాతావరనం అదె మనుష్యులు మరి ఎక్కడొచ్చింది తేడా..?
గుండెళ్ళో గుబులుకు కారణం తెలుసు..పాతరోజులు తిరిగి రావని తెల్సు
జరిగింది నిజమే అని తెలుసు..గతం ఎప్పటికి తిరిగి రాదని తెల్సు..
.... మనుష్యులకు మనస్సనేది లేకుండా ఎందుకు పోతోంది..
గతం గడచిపోయినా ...వాస్తవం వెక్కిరిస్తున్నా...నిజాయితీకి చోటులేదు..
ఎదురు చూపులో తేడాలేదు..ఎడబాటు ఎన్నాళ్ళు అంటే..ఓ జీవితకాలం అని తేలిపోయింది

Wednesday, February 16, 2011

మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని ..నేను ఎవరో తెలుసా..?


ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు ఆ
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి …
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీపరుగెత్తే లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు ఆ
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి …
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను...నా పేరే స్నేహం!!

--Dr.Love (దివ్యి.)

మౌనంలో ఇంత భాద ఉంటుందా మిత్రమా..?


మౌనంలో ఇంత భాద ఉంటుందా మిత్రమా..?
మౌనం ఇద్దరు మన్సుల మద్యి పెరిగిన దూరం..
మౌనం ఇద్దరు స్నేహితులను విడతీసిన భాద...
మౌనం కాలంతో కల్సిపోయి స్నేహితుల మద్యి పెరిగిన అంతరం..
మౌనం గా ఉండటం స్నేహితులకు అసాద్యిం..
మౌనం చెప్పటానికి రెండు అక్షరాలే అది పెట్టే భాద అనుబవించేవారికే తెలుస్తుంది..
మౌనం ఎందుకు ఇద్దరిమద్యికు అవస్తుంది..ఇద్దరి మద్యి దూరం పెరిగినప్పుడు ...
మౌనంగా ఉండటం చాలా కష్టం..అది ప్రతిక్షనం గుండెను కోస్తుంది
మౌనాన్ని మౌనంగా బరించడం అంటే..చచ్చి బ్రతకడమే..
మౌనం ప్రతి క్షనం వేదనకు గురి చేస్తుంది..చావు ఒక్కసారే వస్తుంది..

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబందమో..?

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబందమో..? ఈ పాట చాలా బాగుంటుది మెలోడి సాంగ్ సైలెంట్ మ్యూజిక్.. రొమాటిక్ టచ్ తో పాడుకునే పాట...మనసు చికాగ్గా ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటే హాయిగా ఉంటుంది..జరిగిపోయిన కాలాన్ని చేరుకోలేకపోయినా..విరహపు జాడలో వేడి కన్నీరు చుదలేని జతలో గత జన్మాల బంగారు క్షనమిది అంటూ సైలెంట్ మ్యూజి చాలా బాగుంటుంది..ప్రతిక్షనం నాకళ్ళలో మెరిసె నీరూపం బ్రతుకులో అనువనువునా నీస్నేహం..ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా.. పదికాలాలు ఉంటాను నీప్రేమ సాక్షిగా అంటూ నిజమైనా ప్రేమను చెప్పేవిదానం చాలా బాగుంటుంది చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో..లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాని తుదిలేని చరితగ అంటూ చెప్పే మెలోడి టచ్ హ్రుదయాన్ని కదిలిస్తుంది కదా..?పాట వినటానికి మెలోడి అయినా సాంగ్ వీడియోలో రొమాటిక్ సన్నివేశాలున్నాయి...మంచి ఫీల్ ఉన్నసాంగ్ మీరూ చూస్తారా యూట్యూబ్ వీడియో మీరూ చూడండి

క్రైంరిపోర్టర్స్ అసోసియేషన్ దర్నా...ఇందిరా పార్కు వద్ద




క్రైంరిపోర్టర్స్ అసోసియేషన్ దర్నా...ఇందిరా పార్కు వద్ద గత సంత్స్రం ఫిబ్రవరి 14 ను ఉస్మానియా యూనివర్సిటిలో కేంపస్ లో తెలంగానా ఉద్యమంసందర్బంగా పోలీసులు టార్గెట్ చేసి క్రైంరిపోర్టర్లను చితకబాది..మావాహలానలు సైతం ద్వంశం చేశారు..ఈ సందర్బంగా మా అసోసి యేషన్ ప్రతినిధులు ఇందిరా పార్కువద్ద ధర్నా నిర్వహించాము..నేను అసోసియేషన్ లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను...మొన్న సిసియస్ పోలీష్టేషన్ వద్ద మీడియాపై రవితేజ తమ్ముడు దురుసుగా ప్రవర్తించినప్పుడు సైఫాబాద్ పోలీష్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆందోళన చేయడంతో దిగివచ్చినసినిమాహీరో రవితేజ తమ్ముడు సారి చెప్పాడు..మా మొదటివిజయం తరువాత రిపోర్టర్ల ల పై దాడి చేసివాహనాల నష్టపరిహారాన్ని సాదించుకున్నాం ఇది మా అసోసియేషన్ రెండో విజయం..క్రైంరిపోర్టర్లుగా మేము ఎప్పుడూరిస్క్ తోనే పని చేయాల్సి ఉంటుంది అందుకే ఈమద్యి యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం

Tuesday, February 15, 2011

అమ్మే ప్రత్యేక్షదైవం..ఆ అమ్మతనాన్ని వద్దంటున్న నేటి యువతి



అమ్మే ప్రత్యేక్షదైవం..ఆ అమ్మతనాన్ని వద్దంటున్న నేటి యువతి..మనం ఎటుపోతున్నాం...అమ్మ అనే మాట ఎంత అద్బుతమైంద్.... ఆ అమ్మ మనల్ని కనకూడదని అనుకుంటే మనం ఈ లోకంలో ఉండే వాళ్ళమేనా...ఆ అమ్మతనానిన్ని ప్రశ్నిస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి...ఆడపిల్ల అని పురిటిలోనే చంపడం తానో అమ్మాయినే అమ్మతనాన్ని పొందానన్న నిజాన్ని మర్చిపోతుంది...ఎందుకిలా జరుగుతోంది సమాజం ఉచ్చనీచాలు మర్చి ప్రవర్తిస్తొంది అనటాంకి ఇలాంట ఘటనే నిదర్శనం..అలా పుట్టి ఓ తల్లి చల్లని ఓడిలో పెరిగి..తాను తల్లి అయ్యె మరో జీవికి జన్మను ఇచ్చే అవకాశం ఉడి కూడా వద్దనుకుంటున్న వీరి ఆలోచనలు ఎందుకిలా మారుతున్నాయి..ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లని మార్చేందుకు కన్న తల్లులు ఎందుకు ప్రయత్నించడంలేదు కారణం ఎంటనేది అర్దంకావడంలేదు చదువుకున్న మూర్ఘులు చేస్తున్న ఇలాంటి పనులు తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు..కన్న తల్లి అయ్యే అవకాశం ఉండి అదో పెద్ద పని పిల్లలు తమ హేపికి అడ్డం అనుకుంటున్నారు...మరి ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిని కన్నదీ ఓతల్లే అమే కూడా ఇలానే అనుకుంతే అమె భూమి మీద ఉండేదా...స్వేచ్చ ఎటు వైపు దారి తీస్తుంది పాష్టుకల్చర్ లో ప్రేమలు అబిమానాలకు చోటులేదు...అలాంటిది పేళ్ళిళ్ళు కూడా వేష్టు అని సహజీవనం అంటూ పిచ్చిపనులు చేస్తున్న వారిని ఎవరు మార్చాలి...తప్పెవరిది.. తమ పిల్లలు తప్పు చేస్తున్నారని తెల్సి వాళ్ళకు స్వేచ్చను ఇస్తున్నారే ఆ తల్లి దండ్రులదే ...మరి అలాంటి వారు అమ్మతనం మాధుర్యింతేల్సి ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు... ఎదైనా వయస్సు లో ఉన్నంత వరకే ఎంజాయి ఆతరువాత మీ జీవితం ఎటువైపు వంపులు సోంపులు ఊరిస్తున్నంత వరకే మగాడు వెంట పడతాడు ఆ తరువాత జీవితం ఎంటో ఆలోచించడంలేని యువత అమ్మతనం లోని కమ్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ...ఓ కన్నతల్లి తన బిడ్డకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది ...కన్నతనానికి అర్దాన్ని మారుస్తున్న ఈ కన్నతల్లులు తమ పిల్లలు చేస్తున్న తప్పటడుగులని సరిదిద్దకుండా ఎందుకు ఉరకుంటున్నారు..ఇలాంటి ఆలోచనలు ఉండటం తప్పు పిల్లలది కాదు అలాంటి ఆలోచనలు ఉన్న పిల్లల్ని మార్చలేకపోవడం ..నిజంగా కన్న తల్లుల తప్పే

అమ్మతనం అంటే అర్దం ఇది తెల్సుకో యువతి లేదంటే నీజీవితం వ్యర్దం
ఇది అమ్మతనం అంటే

ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నవంట కదా!ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను? దానికి భగవంతుడు చిరునవ్వుతో నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది, పాడుతోంది. నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది. నిన్ను ఎల్ల వేళలా ఆనదంగా ఉంచుతుంది. నన్ను గుర్తుకురాకుండా చేస్తుంది. వెరసి నీ ప్రతి ఒక్క విషయంలోనూ తను ఉంటుంది మరి నాకు అక్కడ భాష రాదు కదా మాటలు ఎలా అర్ధం చేసుకోను? నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప. నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు. అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకొంటుంది. అన్నాడు భగవంతుడు. మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను? నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో చెబుతుంది. నీలో ఉన్డే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతోంది అన్నాడు. ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది. భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి. అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ.... నా దేవత పేరేంటి అని అడిగింది. ఆ దేవత పేరు అమ్మ అని సమాధానమిచ్చాడు భగవంతుడు. పదాలు తెలియని పెదవులకుఅమృత వాక్యం ‘అమ్మా’ఆమె చల్లని ఒడిలో మొదలైంది ‘ఈ జన్మ’ పసిపాప బోసి నవ్వుల కోసం తల్లి అయినది ఓ నేస్తం పంచ ప్రాణాలు పాపాయి కోసం పంచి ఇచ్చింది ,తన రక్తం బుజ్జి బుజ్జి పాపయికి బుజ్జగింపునకు జోలపడింది కోటి ఆశల చిన్న పాపయికి జన్మ నిచ్చింది చందమామనే మేనమామగా చేసింది జాబిలినే భువికి రమ్మంది కమ్మని కథలెన్నో చెప్పింద ఆది గురువై అక్షరం నేర్పిందిఈ జీవితంలో నా ప్రియ నేస్తం’అమ్మ’ ఆమె లేకుండ ఉండేదా’ఈ జన్మ’ అందుకే తల్లి ఋణం తీర్చలేం ఆమెకు ఈ జన్మ అంకితం సదా కన్న తల్లి దేవత ఈ జీవితానికి ఆమే విధాత..

తడి కన్నులనే తుడిచిన నేస్తమా..?

పాదం ఎటుపోతున్నా పయనం ఎందాకైనా..అడుగు తదబడుతున్నా తోడు రానా మంచి ఫీల్ ఉన్న సాంగ్ ఈ సినిమా చూస్తున్నా పాటలు వింటున్నా కాలేజ్ డేస్ లో ఏం మిస్స్ అయ్యామా అనిపిస్తుంది కదా..?ఈ సినిమాలో నాకు నచ్చిన సాంగ్ నాకు ఈ పాట చాలా ఇష్టం స్నేహంగురించి చాలా గొప్పగా చెప్పాటు రైటర్ ఈ పాటలో స్నేహితుల మద్యి చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా అనే లై సూపర్ ఒంటరైనా ఓటమైనా వెంట నడచి నేను రానా ఓ మైప్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా..అంటూ పాట మెలోడి బీట్ లోసాగుతుంది నిజంగా కంట తడి పెట్టించే వారే గాని కంట తడి తుడిచే స్నేహితులు ఉంటారా అనిపిస్తుంది నాకెందుకో వడిదుడుకుల లో అండగా నిలచిన స్నేహమా..? జన్మకంతా తీరిపోని మమతలన్నీ పంచుతోంది ఈ స్నేహం నిజమైన స్నేహం కదాఇది ..స్నేహం చేసి వాడు భాదపడుతున్నాడు అని తెల్సినా తన స్వార్దం కోసం ఏమైనా చేసేవారున్నారు మరి..స్నేహం చేసి వాడిని భాదపడకుడా ఎలా ఉంచాలనే ఆలోచన రాకపోవడం నిజంగా... ఇలా మెలోడి బీట్ లో సాగే పాటలో స్నేహం పై ఎన్నో మీనింగ్ ఫుల్ పదాలు నిజాలున్నాయి మీరు వినండి మీరు నిజమైన స్నేహితులైతే మీలో స్వార్దం లేకపోతే...

ఆజాత శత్రువులా ఉన్న నేను ఆశత్రువు చేతిలో ఓడి పోయా..?



ఎందుకో ఈ మద్యి పాతజ్ఞాపకాలు కంగారు పెడుతున్నాయి..
నీ తలపులు గుర్తుకొచ్చి గుండె వేగంగా కొట్టుకుంటుంది..
కారణం అడక్కు ఆ రోజులు పోయాయి తిరిగొస్తాయన్న నమ్మ లేదు..
నీకు అస్సలు గుర్తుకొస్తానా అని తలచుకొంటే..గుండెళ్ళో దడ..
గుండెళ్ళో గాయం బాగా పెద్దది అయినట్టుది..రోజు రోజుకి భాద పెరుగుతోంది..
ఆ గాయానికి ఎన్నోరకాలుగా మందులు వేసి తగ్గిందుకొందామని ట్రైచేసి ఫైల్ అయ్యా..
విషాదం గుండెల్లో చేరి ఆగాయాన్ని ఇంకా పెద్దది చేస్తుంది..
ఒక్కోసారి అనిపిస్తుంది నీవు నాకు అస్సలు గుర్తుకు రాకుండా ఉండాలంటే ..
ఎంచేయాలో నిన్నే అడిగితే అని..అంతదైర్యం చేయలేనని తేలింది..
గుండెలొ ఉప్పొంగే దుఖం కన్నీటి బొట్టులా జారుతున్నాయి..
నులి వెచ్చని ఆకన్నీరు కూడా బాధను దూరం చేయలేక పోతుంది..
ప్రతి క్షనం నీతలపులు తో పైకి ఆనందంగా ఉన్నట్టు నటించ లేకపోతున్నా..


నీవు దూరమైన గడియలు ..నీ తలపులు నన్ను శత్రువులా వెంటాడుతున్నాయి ..
మరి ఆ శత్రువునుంచి దూరంగా పరిగెత్తూన్నా వెంటాడుటూనే ఉంది ..
అ శత్రువు నన్ను వదిలేట్టు లేదు నా అంతం చూసేవరకు...
నా రక్తం కళ్ళ్ చూసేవరకు అది నిదుర పోయేట్టు లేదు మరి..
ఇప్పటి దాకా ఆజాత శత్రువులా ఉన్న నేను ఆశత్రువు చేతిలో ఓడి పోయా..

ఇవన్నీ నిజాలే తెలుసా మీకు..?


1) మనకు ఎందరో పరిచయం అవుతుంటారు అందులో కొందరే మంచి స్నేహితులవుతారు మనతో మంచి చెడు పంచుకుంటూ మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా..స్నేహం విలువ తెలీనివాళ్ళకు దూరంగా ఉండు

2)."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...

3).'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

4)."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

5)."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

6)."నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట"...

7)."ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...

8)."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు....!!!!!

9) ప్రేమించి మోసం చేశారని భాదపడకు ఆర్హత వాళ్ళు కోల్పోయారు అని తెలుసుకో అదే నీప్రేమలో నిజాయితీ...

10) ప్రేమించానంటూ చెప్పి వేరే కారణాలతో తనకిష్టం లేదనే అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త..అలాంటి వారిని డీప్ గా లవ్ చేయకు మోసపోతావు

Monday, February 14, 2011

లవ్ ఫెయిలైతే..?...ఏంచేయాలి...?


లవ్ ఫెయిల్.. ఇప్పుడు కామన్ వర్డ్.. మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా పలకరించి చూడండి.. వారి లవ్‌స్టోరీలు తెలుసుకోవడానికి ట్రై చేయండి.. ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ లవ్‌ ఎట్ ఫస్ట్ సైట్ కథలు చాలానే ఉంటాయి. వాలెంటైన్ డేన మీకు మీ లవర్ దూరం అయ్యిందని ఫీలవడం కన్నా.. అలాంటివి లవ్‌లో కామనే అని తెలుసుకోండి. ఎందుకంటే ఇది కమర్షియల్ వరల్డ్. రిలేషన్స్‌షిప్‌పై ఫీలింగ్స్‌తో పాటు, చాలా ఇష్యూలు ప్రభావం చూపిస్తుంటాయి. అవసరాన్ని బట్టి బంధాలను మార్చేస్తుంటాయి.డ్రస్స్ లను మార్చినంత ఈజీగా బాయ్ ప్రెండ్స్ ను మార్చే అమ్మాయిలున్నారుఎదుటి వాళ్ళ మనస్సులతో వాళ్ళు ఆడుకుటారు ..వీళ్ళో శాడిస్టులు. సో.. లవ్ ఫెయిల్ అయిందని ఏ మాత్రం ఫీల్ కావద్దు.చాలామంది లవ్ ఫెయిల్ అయితే.. జీవితం కోల్పోయామనుకుంటున్నారు. ఆ కోపంతోనే..దాడులకూ దిగుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలనూ తీయడానికి ట్రై చేస్తున్నారు. హంతకులుగా మారుతున్నారు. మన రాష్ట్రంలో ఇలా ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, తృటిలో తప్పించుకున్న అమ్మాయిలు ఎంతోమంది. మరి ఇదేనా ప్రేమంటే.. ? అంతవరకూ ఎంతో ప్రేమించి.. అప్పటికప్పుడు ప్రాణాలు తీయాలని ఎలా అనిపిస్తుంది..?
అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమలో పడ్డవారు ఎప్పుడైనా ఆలోచించారా..? లవర్‌ను ఎప్పుడూ చూడాలనిపించడం, వాళ్లతో వీలైనంత వరకూ గడపడం.. సరదా షికార్లకు వెళ్లడం.. అంతేనా...? అంతవరకే అయితే అది ప్రేమ కానే కాదు. జస్ట్ అట్రాక్షన్. అది వయస్సుకు సంబంధించింది మాత్రమే గానీ.. మనసుకు సంబంధించింది కాదు. మీరు మనసుతో ప్రేమించి ఉంటే.. మీరు ఎప్పుడూ అలా ప్రవర్తించరు.
ఇక ప్రేమలో గెలవలేదని మనోవేదనకు గురై.. ఎంతోమంది తమ జీవితాలను ముగిస్తుంటారు. అదీ కరెక్ట్ కాదు. ఎందుకంటే.. మనకు ప్రేమ దక్కలేదంటే.. అది ఎదుటివారి లోపం అనుకోవాలే తప్ప.. మన లోపం అనుకోకూడదు. ఒకరు కాకపోతే మరొకరు. ఈ ప్రపంచమేమీ చిన్నబోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి కోసం ఎదురు చూడండి.
ఇక ప్రేమించడానికి, లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డే మాత్రమే ఉందనుకోకండి. మీలో ఎప్పుడు ఫీలింగ్ వస్తే అప్పుడే వాలెంటైన్ డే. మీకు నచ్చిన మనిషిని.. మిమ్మల్నీ మెచ్చితే ఆ రోజే ప్రేమికుల రోజవుతుంది. ఎక్కడినుంచో వచ్చి పడ్డ ఈ రోజును తలచుకుని ఏ మాత్రం బాధపడకండి. మీ వాలెంటైన్‌డేను మీరే సృష్టించుకోండి.చెప్పడం ఈజీనే అనుబవిస్తే తెలుస్తుంది అసలు భాదంటే అంటారు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు... మరి ఎవరి భాద వాళ్ళని నిర్నయించడానికి మనం ఎవరం కదా...?

ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా..?


ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా..?..నాకెందుకో ఈ ఘటన మీకు రొటీన్ అయినా నాకు ఎందుకో వింతగా అనిపించింది..నాకు ఓ అమ్మాయి పరిచయం అన్నయ్యా అని పిలుస్తుంది...డిగ్రీ చదువుతుంది ఎందుకి ఆరునెలలుగా మాట్లాడలేదు బిజిగాఉండి నేను పట్టించుకోలేదు... నా సెల్ నెంబర్ మిస్సైందని ఎలా వున్నావు అన్నయ్యా అంటూ క్షేమ సమాచారం అడిగింది ఏంట్రా ఈమద్య అస్సలు ఫోన్ చేయలేదంటే పరిక్షలు బిజి అని చెప్పింది....కాని నాకు నమ్మ బుద్ది కాలేదు....నిజం చెప్పు ఇది వరకు రోజుకు ఓక్కసారన్నా ఫోన్ చేస్తావు ఎందుకు చేయలేదని కోంచే సీరియస్ గానే అడిగా అప్పుడు చెప్పడం మొదలు పెట్టింది తనకు ఓ ప్రేండ్ లా ఓ స్నేహితుడు పరిచయం అయ్యాడని ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమను వ్యక్తం చేసుకున్నారట ఐలవ్యూ ఆని చెప్పుకున్నార0టమరి ...అందుకే నేను అస్సలు గుర్తుకు రాలేదంట...ఇద్దరు ప్రతి క్షనం ఫొన్లలో మాట్లాడు కునే వాళ్ళంటా..అస్సలు కుదరక పోతే SMS తొ పలుకరించుకునే వాళ్ళంట...తనకు అంతకు ముండు ఓ అమ్మాయితో పరిచయం ఉందికాని ఇప్పుడు మాట్లాడు కోవడం లేదు ఈ అమ్మాయంటే ప్రేమని చాలా ఇష్టం అని చెప్పాడట..అలా ఐదు నెలలు గడచిన తరువాత ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడుతుందని అమె తను లేక పోతే చచ్చి పోతుంది నీవు మర్చి పో అన్నాడట ఇంకేముంది అప్పటి దాకా గుర్తు రాని అన్నయ్య గుర్తుకు వచ్చాడు...అర్జంటుగా కలవాలని వచ్చి పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది..ఆ అబ్బాయే పరిచయం చేసుకున్నాడట తనే ఇష్టం అని చెప్పాడట...నివు లేనిది నేను లేను అన్నాడట మరి ఇప్పుడు పాత అమ్మాయి వచ్చింది అని హేండిచ్చాడని ఏదుస్తోంది..అంతకు ముందు అమ్మాయి పరిచయం ఉన్నసంగతి చెప్పినప్పుడు నీవు ఎందుకు జాగ్రత్త పడలేదంటే నీవంటే ఇష్టం అన్నాడని చెబుతోంది...ఇంకా చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నా నేనంటే చాలా ఇష్టం అన్నాడు ఇప్పుడు మర్చిపో అంటున్నాడని బ్రతకను అంటోంది ...చుసారుగా ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఉన్నారా...పరిచయం ఉన్నన్ని రోజులు పదినిమిషాలకు ఒకసారన్నా మాట్లాడుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఎందుకలా చేస్తున్నాడు పాత లవర్ తో సమయం గడపుతున్నాను మర్చిపో అని సింపుల్ గా అన్నాడట.. అబ్బాయి లేకుండా నేను బ్రతకను అంటుంది ఎంత చెప్పినా వినటం లేదు తనే ప్రతిక్షనం గుర్తుకు వస్తున్నాడంటుంది ....ఇప్పటికి తన స్నేహితులైన అమ్మాయిలతో మాట్లాడుతాడు కాని తన తో మాత్రం మాట్లాడడు అని అంటు బోరున ఏడుస్తుంది ..చూడ బోతే తనతో మాట్లాడకుండా ఆ అమ్మాయి స్నేహితురాళ్ళతో మాట్లాడటం తట్టుకోలేక పోతుంది అనిపిస్తుంది..నీతో మాట్లాడను అన్నాడుకదా మర్చిపో అంటే నో నావల్లకాదు అతను నాతో మాట్లాడక పోతే చచ్చి పోతా అంటుంది ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఉన్నారా అని పిస్తుంది మరి..?

ఆత్మకి చావు వుండదు.. మన స్నేహానికి కూడ చావు వుండదు..


నా ప్రీయ మైన నెస్తమా...!
నా చుపూ నీ కొసం ఏదురు చుస్థుంది...
నా స్వసా నీ కొసం తపిస్తుంది...
నా ప్రతి ఆశ నువ్వు గొప్ప వ్యక్తివి కావలని..
నా ప్రతి రక్తపు బొట్టు నీ కొసం చిందిస్తాను..
నా తుది స్వసా వదిలె వరకు నిన్ను మరవను..
ఆత్మకి చావు వుండదు.. మన స్నేహానికి కూడ చావు వుండదు..
నీ కొసం తపిస్తున్న ఈ స్నేహితుడిని మరవకు......................

"ఎవరు నువ్వు అని నన్ను అడిగితే -
ఏమని చెప్పను నా గురించి నేను...

ఇన్నేళ్ళ ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెను తిరిగి చూస్తే
నా ఈ జ్ఞాపకాల దొంతరలో
ఎన్నో అనురాగాలు,ఎన్నో మమకారాలు
ఎన్నో ఏవగింపులు,ఎన్నో ఈసడింపులు..

ఏమి సాధించానని నన్ను నేను ప్రశ్నించుకుంటే -
అసలు ఏమీ సాధించావంటు ఈ ప్రశ్న అని
నా అంతరంగం నవ్వుతుంది నన్ను చూసి..

చిత్రంగా లేదు -
కనీసం నా అంతరంగాన్ని అయినా సమాదానపరుచుకోవాలన్న
పట్టుదలతో ముందుకి సాగుతున్నాను......

ఒంటరితనం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది అంటారు -
కాని అదే ఒంటరితనం నిన్ను నువ్వు తెలుసుకోవాడానికి,
నిన్ను నువ్వు మలుచుకోవాడానికి దొరికే సమయం అంటాను నేను...

ఈ ఒంటరితనపు నిశీదిలో
నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది అంటారు -
కాని అది నన్ను వెక్కిరిస్తుంది
నిన్ను నువ్వు తెలుసుకుంటు ఎన్నాళ్ళు ఇలా అనీ..

పాపం దానికేమి తెలుసు -
మనిషి ఆశకు అంతం ఉండదని
ప్రపంచం ఎంత తెలుసుకున్నా చేరని లోతు బావి అని....

అణువు అణువున స్వార్ధం నిండిన ఈ ప్రపంచం మీద నాకు -
ఏదో తెలియని ఆవేశం
ఏదో తెలియని ఆక్రొశం
ఏదో తెలియని ఆవేదన...
కాని -
రేపు ఎప్పుడు నిన్న లాగ ఉండదని నాది ఒక చిన్న ఆరాటం
రేపటీ ఆ వెలుగు కిరణాల కోసమే నా ఈ గమ్యం లేని ప్రయాణo

ప్రేమకోసం ఎదురు చూడటంలో ఎంతో ఆనందం ఉంది

ఇది నిజమైన ప్రేమంటే....?

ఇది నిజమైన ప్రేమంటే....?

కాదన గలరా ప్రేమత్యాగం అంటే ఇది పెదాల మీద ఒకమాట అవకాశం వచ్చినప్పుడూ ఒకమాట చెప్పేవారికి ఇలాంటి నిజమైన ప్రేమలు త్యాగాన్ని కోరే ప్రేమలు..ఉంటాయని తెలుసా..నాది నిజమైన ప్రేమ అని పైకి చెప్పుకోలేనప్పుడు ఆమాట పలికే అర్హత ఉందా ప్రియా..ప్రేమలోని నిజాయితీ ఓ ప్రాణాన్ని నిలబెడుతుందన్న వాస్తవం ఈ ప్రేమికుల రోజు సందర్బగా అయినా గుర్తువస్తుందా..ఎన్నిజరిగినా ఎన్నిచేసినా మనస్సులో ప్రేమలో మార్పు లేదన్న వాస్తవం గుర్తుంచుకో చాలు ఇప్పుడే కాదు బ్రతికి ఉంటే 100 సంత్సరాల తరువాత అయినా నేను చెప్పేమాట ఇదే+

కవిత అనే అమ్మాయి తన ప్రియుడి మీద చూపిన నిజమైన ప్రేమను చూడు ఓసారి



ఇది నిజమైన ప్రేమంటే....?

ప్రేమను ప్రేమగా ప్రేమించే ప్రేమికులకు ప్రేమికుల దీనోత్సవ శుభాకాంక్షలు ప్రేమతో.- ఇన్నారెడ్డి


ప్రేమను ప్రేమగా ప్రేమించే ప్రేమికులకు ప్రేమికుల దీనోత్సవ శుభాకాంక్షలు ప్రేమతో.- ఇన్నారెడ్డి

Sunday, February 13, 2011

చెంగావి చీరకట్టిన చెలి...కొంగుమాటున ....? అందాలు,

చెంగావి చీరకట్టిన చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా? కొంగుమాటున దోబూచులాడే శృంగారం, కనిపించనట్టే కనిపించే సింగారం.. గుబులు రేపకపోతే ఆ చీరకే సిగ్గుచేటు కాదా? ఆ కట్టు... ఆ బొట్టు.. చెంగుమని ఎగిసిపడే ఆ చెంగులు... అందానికి కొమ్ముకాసే కొంగు, సౌందర్యానికే సౌందర్యం కాదా..వన్నెల రాణికి సిరిజోతలను ఏరికూర్చి పెట్టే అందాల పూబోణి చీర.. చీరకట్టిన చిన్నారి వయ్యారంగా నడుస్తుంటే వినిపించే రసధ్వనికి రాయైనా చలించకుండా ఉండేదెలా? చీర కట్టు పవర్ అలాంటిది మరి..కనిపించి కనిపించని అందాలు చూపి చుపనట్టుగా ఊరిస్తుంటే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది మరి అది ఆ చీరకట్టులో అందం..ఊరించే అందాలు ఊరకనే ఉంటాయా మరి మనసులు అల్లాడిస్తాయి మరి.ఇలా చీరలో నా ఇష్టసఖి ని చూస్తే మాత్ర్రం నా మనసు మాటవినదు మరి.. ఆ అందాల ఆరబోతలో చెలిని చీర కట్టుకోనే చూడాలి మరి..ఓ మాట అనకూడాదుకాని ఎదురొచ్చు యుద్దానికి సిద్దమా అన్నట్టు ఉండే ఎదపొంగును తన చాటున దాచే పైట గాలిలి అలా ఎగురుతుంటే ..ఇక చెప్పెదెముంది లేమరి కొందరికి సన్నని నడుము అందాలయితే మరికొందరిని నడుమున కనిపించీ కనిపించని మడతల వయ్యారాలు ఆ చీరకట్టులోనే ఉరిస్తూ కనిపించి కనిపించకా ఊపేస్తాయిమరి....మనసు సఖి ఇలాంటి చీరకట్టులో దగ్గరుకు వస్తే చేతులు ఊరకుంటాయా...ఆగండి ఊహల్లోకి వెళ్ళకండి ఆ చీరకట్టు గురించి ఆ అందాల గురించి డీటైల్ గా తెల్సుకోవాలని ఉందా అయితే ఈ ష్టోరి ఒసారి చుడాల్సిందే మరి



నా ప్రేమ నవపారిజాతం..పలికింది ప్రియ సుప్రభాతం

నా ప్రేమ నవపారిజాతం..పలికింది ప్రియ సుప్రభాతం..మెలోడి బీట్ ట్రాజెడీ ఫీల్ తో సాగే పాట చాలా బాగుంటుంది..ఇది కుడా నాకు చాలా ఇష్టం ఎందుకో ఈ రోజు పాతపాటలు తిరగేస్తుంటే ఇవన్నీ గుర్తుకు వచ్చి అన్నీ బ్లాగ్ లో పొష్టు చేస్తున్నా..ఈ పాటలంటే నాకు చాలా ఇష్టం మనస్సుకు నచ్చిన పాటలు ...మనసు బాగోనప్పుడు ఇలాంటి పాటలు వింటే కొంచెం రిలాక్సుగా ఉంటుంది కదా .... అది ఇష్టమైన మెలోడి సాంగ్స్ అందరికి నచ్చక పొవచ్చు కాని ఈ పాటలంటే నాకు చాలా ఇష్టం ఇద్దరు నిజమైన ప్రేమికులు దూరంగా ఉండి గతాన్ని గతంలో తమ ప్రేమను గుర్తుకు తెచ్చుకునె పాట ఇది నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం ...నీ ఎదవీన పై మనకద వీన మీటగా అనురాగం పలకాలి నూరేళ్ళ బందాన్ని కానా అంటూ సాగుతుంది..ప్రేమ అనేని ఇప్పటిది కాదు ఏళ్ళు గడిచినా నిజమైనా ప్రేమ శాశ్వితంగా ఉంటుంది అనే లైలో సాగుతుంది బేసికల్ గా ట్రాజేడీ బీట్ కాని పాత జ్ఞాపకాల దొంతరలో హీరో హీరో యిన్లు గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పాడుకునే పాట.. వేదంలా స్నేహంలో యుగాలు క్షనాల్లా గడుపుతూ సాగాలి ప్రేమ అంతు సాగుతుంది నిజమేకదా నిజమైన ప్రేమను ప్రేమికులు ఇలాగా ఫీల్ అవుతాను ..అనుకుంటాను ఈ జన్మలో ప్రేమించి కోవడం అంటే గత జన్మ బందమే ఈ జన్మలో ఇలా ముడి పడుతుంది అంటారు నిజమే కదా..?నీ ప్రేమలో మునిగిపొయి ప్రపంచాన్నే మర్చిపొతాను అనేది కూడా వాస్తవమేకదా ట్రాజిడీ బీట్ అయినా..ఈ పాట విడియో చూడండి ప్రేమికులు తాము గతంలో ఎలా ఏంజాయి చేశారో తమ ప్రేమలో ఎలా మునిగి ఆనందాన్ని పంచుకున్నారో చూపిస్తారు ...ఇలా ఉండాలి నిజమైన ప్రేమికులు అన్నా నిజమైన స్నేహితులు అయినా సరే ఆ పాట వింటూ ఆ వీడియోసాంగ్ మీరు చూడండి ఫీల్ అవండి

చినుకులారాలి నదులు గా సాగి వరదలైపోయి కడలిగా పొంగాలి నాప్రేమ

చినుకులారాలి నదులు గా సాగి వరదలైపోయి కడలిగా పొంగాలి నీప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం ఈ పాట లో ప్రేమ పై నిజమైన ఫీల్ ఉందనిపిస్తుంది..హాయిగా ఉండే సన్నని జల్లులా సాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే అన్ని వర్నన ఎంత అద్బుతంగా ఉంది కదా..వేకువ జామున వచ్చే ఎర్రని సూర్యుడ్ని నుదుటి కుంకు మతో పోల్చాడు రచయిత.. నీప్రేమకోసం ఏన్నిజన్మలైనా వేచి ఉంటాను..నీకోసం నీప్రేమకొసం ఇలా ఎన్ని రోజులైనా వేచి చుస్తాననడం బాగుంది కదా హిమము లా మారి రుతువు లై నవ్వుతూ మదువులై పొంగు నీప్రేమ నా ప్రేమ అంటూ సాగుతుందిఈ పాట ఎన్ని అడ్డంకులు వచ్చినా నన్ను విడిచి పోబోకుమా అంటు ఇద్దరి ప్రేమలో నిజాయితి ఇక్కడ కనిపిస్తుంది మన ప్రేమ నిజాయితీగా ఉండాలి విరహంగా మారి నాకు దూరం కాకూడ దనే ఫీల్ చాలా బాగుంది కదా ఈ పాటలో ఎక్కువగా ప్రకృతిని ప్రేమలో పోల్చి చెప్పే విదానం అద్బుతంగా ఉంది...మౌనమై మెరిసి గాన మై మెరచే నీ ప్రేమ నా ప్రేమ అంటూ సాగుతుందిఈ పాట నాలుగు స్థంబాలాట సినిమాలోది మీరు వింటారా అయితే వినండి కాదు చూస్తూ వినంది ఫీల్ అవ్వండి నిజంగా మీరు నిజ మైన ప్రేమికులైతే మీలొ నిజాయితీ ఉంటే

ఓ బంగరు రంగుల చిలుకా పలుక వే...

ఓ రంగుల బంగరుచిలకా పలకవే...ఓ అల్లరి చూపుల రాజా ఏమని....నా మీదప్రేమే ఉందని..నామీద అలకే లాదనీ..పాత పాతల్లో కుడా మెలోడి హిట్సు ఉన్నాయి వాటిల్లో ఇదొకటి నాకు నచ్చిన పాట...మ్యూజిక్ పరంగా....పాట సాహిత్యంకూడా అద్బుతం...ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పాటల్లో మీనింగ్ కొరవడుతుంది కాని పాట వింటుంటే హాయిగా అనిపిస్తుంది..తన ప్రియురాలిని ప్రియుడు బంగరు చిలుక తో పోల్చి పాడుకుంటాడు..ప్రిమురాలు తన ప్రియుడ్ని అల్లరి చూపుల రాజా అంటూ పిలవడం బాగుంది....మాటల్లొ చేతల్లొ కాదు పిలుపుల్లో కూడా అత్మాయతలున్నాయి అప్పటి రొజుల్లో అనటానికి ఈ పాట ఓ ఉదాహర గా చెప్పుకో వచ్చు..కదా ఈ పాటలో ప్రియురాలితో నామీది నివు అలుగ లేదు ఉందంతా ప్రేమే అని చెప్పే విదానం బాగుంది..ప్రియురాలు పలుకవా అనటం ఏమని అని ప్రియుడు అనటం నీ ప్రేమకోసం పంజరాన్ని దాటుకొని బందాలని విడిచి వచ్చనని ఎంత నిజయితీ గా చెబుతుందో కదా..?నిజంగా ప్రేమను ప్రేమించే వారి ప్రేమలో నిజాయితి ఉంటే ఇలా ఉంటుంది ఆ ప్రేమబాగుంది..అన్ని వదలి పెట్టుకొని నీమీద ఆశతో వచ్చాను అనటం లైను నిజంగా బాగుంది మేడలో ని చిలుకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా ఉండే అందాల బొమ్మ ఈ నిరుపేదను వలచావెందుకే అనే లైను కుడా చాలా బాగుంది ఆఫీల్ మ్యూజిక్ లో కూడా చూపించారు నీచెరువలొ నీచేతులలో పులకించేటందుకే అని ప్రియురాలు సమాదానం..సన్నజాజి తీగ ఉంది తీగ మీద పూవుంది ఆ పువులోని నవ్వే నాదిలే..అని ప్రియుడి సమాదానం..కోటే తుమ్మెదొచ్చింది కొంటెతేనె కోరింది అందించే భాగ్యిం నాదిలే అనే చిన్ని పాటి శృగారం మేళవించిన పదాలు...ఈ కొండల్లో ఈ కోనల్లో మనకేదురే లేదులే...అంటూ సాగే ఈ పాట నిజంగా చాలా బాగుటుంది... ప్రేమలో నిజాయితీ...ప్రేమలో అభిమానం అన్నీ మేలవించిన అద్బుత మైన పాటా నాకు చాలా ఇష్టం మీకు చూడాలని ఉండా అయితే మీరు చూడండి

Saturday, February 12, 2011

ప్రేమా ఎక్కడ నీచిరునామా..?


ప్రేమలో నమ్మకంలేదు..
ఇప్పటి ప్రేమల్లో నిజాయితి లేదు ...
ప్రేమను ప్రేమగా ప్రేమించే వాళ్ళు తగ్గిపోయారు...
ఈ నాటి ప్రేమలు పెదవులతోనే మాటాళ్డుతున్నారు..
హ్రుదయం లేనివాల్లు ప్రేమిస్తున్నాం అని బ్రమ పడి ఎదుటి వారిని మోసం చేస్తున్నారు ..
వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొంటూ ఎదుటివార్ని మోసం చేస్తున్నారు ..
నన్ను నమ్ము నిజంగా ప్రేమిస్తున్నాను అన్న మాటల్లో నిజాయితీ ఉందా..
నా ప్రేమలో రెస్పెక్టు అన్నదానిలో నిజాయితీ ఉందా..?
నీవు తప్పుచేయవు అది నామీద నాకు నమ్మకం అన్నదానిలో నిజం ఉందా..
ఇన్ని నిజాలంటూ చెప్పి..ఓ మనసును దారుణంగా మోసం చేసి ఏంసాదించావు..
ఎందుకు ఇన్ని అబద్దాలు ఆడావు...అని నిలదీస్తున్నా..సమాదానం చెప్పగలవా..?
అవును నీవంటున్నది నిజమే సమాదానం చెప్పే హక్కు నాకు లేదు..అడిగే అర్హత నీవు కోల్పోయావు..
ప్రేమికుల రోజు నీవు పుల్ ఎంజాయ్ చేస్తావుకదూ.....అప్పుడు కనీసం ఓ హ్రుదయం వేదన పడుతుందని ఆలోచిస్తావా..?