నా రక్తపు మరకలు ఇంకా అంటని నా మనసు కాగితం ఫై ఏదైనా రాయండి .
ఎక్కడ వున్నాయ్ ఆ దివ్య లోకపు మంటలు ......
మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నన్ను దహించండి.......
ఎక్కడ వున్నాయ్ ఆ అనంత ప్రేమ సాగరాలు ....
వేడుకుంటున్నాను నన్ను మీలో నిమజ్జనం చేయండి ..
ఎక్కడ వున్నారా కాలాతీత జ్ఞానులు ......
ప్రార్థిస్తున్నాను నా రక్తపు మరకలు ఇంకా అంటని
నా మనసు కాగితం ఫై ఏదైనా రాయండి ....
నీ ఆలోచనలు సూది మొనలా చిత్ర హింసలు పెడుతున్నాయి......
నా అస్తిత్వాన్ని మరిచేలా ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్
నలిగిన నామనస్సును చిదిమేయి ప్రియా
నేనీ చిత్రవధను అనుభవించలేను
రోజు రోజుకి నా ఓపిక నసిస్తుంది
నీరసం ఆవహిస్తుంది ఆలొచన మందగిస్తుంది
మతితప్పి గతిమారుతోంది ఏదో జరుగుతోంది ప్రియా