చీకటిని అందంగా చూపే నీ వెలుగులో
చుక్కలని తిరిగి లెక్కబెట్టాను..ఎంతకీ లెక్కతేలలేదు
కవ్వించే నీ ఉనికితో నువ్వు నా ఎదురుగా పెట్టిన ప్రశ్నలెన్నో
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు
సమాదానానికి ప్రశ్నే సమాదానం అయిన క్షనంలో
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..నేలపైనేను
కాలం ఏ మాయ చేసిందో..
నానుంచి నీ చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత గా మారిపోయావు
ఈ క్షణపు నీ విలువ ఎంత అంటూ
నీవెవరంటూ నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నప్పుడు
జారిపడిన నా కన్నీటి బొట్టే సమాదానం
అది గమనిచలేవు .. దరిచేరలేనంతదూరంలో నీవు
నీ దూరం ఎంత దగ్గర అంటూ..నాచుట్టూ పరుదులు పెట్టావు
నీ పేరుపలకొద్దని షరతులు పెట్టావు
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు..గుడ్డివాడిగా నేను
పదునైన కత్తితో నాగొంతు నిలువునా కోసి
మాట్లాడమంటే ఏం మాట్లాడను...
మూగగా నీకోసం రోదించడం తప్ప..?